Andhra Pradesh

News September 19, 2024

గోకవరం: ఆర్టీసీ బస్సులో 30 కిలోల గంజాయి సీజ్

image

గోకవరం మండలం రామన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో గోకవరం పోలీసులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బస్సులోని అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరి మహిళలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 30 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి ఘటనపై విచారణ చేపట్టామన్నారు.

News September 19, 2024

గుండెపోటుతో ఏలూరు సీసీఎస్ ఎస్సై మృతి

image

ఏలూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న డి.నరసింహారావు గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. ఏలూరుకు చెందిన ఆయన స్థానిక సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News September 19, 2024

రుషికొండలో ప్రతిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు

image

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎంతో ప్రీతికరమైన తిరుమల లడ్డూ ఇక నుంచి ప్రతి రోజూ విక్రయించనున్నట్లు ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. ఇప్పటి వరకు వారంలో మూడు రోజులు మాత్రమే విక్రయించే వారమని, భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతి రోజూ విక్రయిస్తామని ఆయన వెల్లడించారు.

News September 19, 2024

బూచేపల్లికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి.?

image

దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా వైసీపీ పెద్దగా వ్యవహరించిన బాలినేని అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో జిల్లా బాధ్యతలు ఎవరు చేపడతారా? అనే చర్చ కొనసాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రస్థాయిలో కీలకంగా ఉండటంతో బూచేపల్లికే అధ్యక్ష పదవి వస్తుందని భావిస్తున్నారు.

News September 19, 2024

రాజాం: పొగిరిలో కాకతీయుల నాటి శిల్పాలు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో 1000 ఏళ్ల కిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని, ఆగ్రామం కాకతీయుల నాడు గొప్ప శైవక్షేత్రంగా వెలసిందని, రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. బుధవారం ఆ గ్రామానికి వెళ్లగా ఊరి ముందర రోడ్డుపక్కన నాగదేవత శిల్పముంది. అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు. ఊర్లో ఉన్న వెయ్యేళ్ళ కిందటి అగస్త్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.

News September 19, 2024

సోమందేపల్లిలో ఇద్దరికి 6 నెలల జైలు శిక్ష

image

సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ రమేశ్ బాబు తెలిపారు. నాగినాయనిచెరువు బాబయ్య (2016లో) కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఈ కేసులో సోమందేపల్లి డిష్ ఆపరేటర్ మహేశ్, లైన్‌మెన్ శంకర్ రెడ్డిపై అప్పటి ఎస్ఐ ఛార్జిషీట్ కోర్ట్‌లో ఫైల్ చేశారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికీ 6 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించారన్నారు.

News September 19, 2024

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉద్యాన వర్సిటీ వీసీ

image

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ డా.గోపాల్ బుధవారం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, సాధించిన పురోగతిని గవర్నర్‌కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ డా.శ్రీనివాసులు ఉన్నారు.

News September 19, 2024

భూటాన్ దేశంలో సత్తా చాటిన నెల్లూరు విద్యార్థిని

image

నెల్లూరు నగరం స్థానిక స్టోన్ హౌస్ పేటలో 10వ తరగతి విద్యార్థిని తుమ్మల పూజిత ఇటీవల భూటాన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ “ఆట్యా-పాట్యా” ఛాంపియన్ షిప్ 2023-24 క్రీడల్లో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ విద్యార్థినిని ప్రత్యేకంగా బుధవారం సత్కరించారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆదర్శనీయం అని ప్రశంసించారు.

News September 19, 2024

ప్రముఖుల పర్యటనలో జాగ్రత్తగా ఉండాలి: తిరుపతి కలెక్టర్

image

తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటనలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వేంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బారాయుడుతో కలసి అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తిలో దర్శనాలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతుంటారని, ఆ మేరకు ఏర్పాట్లు లోపాలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

News September 19, 2024

గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

మహాకవి గురజాడ వెంకట అప్పారావు 162వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో గురజాడ జయంతి ఉత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గురజాడ గృహం వద్ద ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన విగ్రహానికి పూల మాలాలంకరణ చేస్తామన్నారు.