Andhra Pradesh

News April 6, 2024

తిరుపతి: ఈనెల 9న SVIMSలో సెలవు

image

ఉగాది పండుగ సందర్భంగా SVIMSలో ఈ నెల 9న ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర వైద్య సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి సహకరించలని ఆయన కోరారు.

News April 6, 2024

ఆలూరులో టీడీపీ జెండా ఎగరవేస్తాం: రాష్ట్ర అధికార ప్రతినిధి

image

రానున్న ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనేకుర్తి రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం మనేకుర్తి, అంగసకల్, ఎ.గోనెహల్ గ్రామాల వార్డు సభ్యులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి అంబేడ్కర్, వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీగా టీడీపీ కార్యాలయానికి చేరుకొని వీరభద్ర గౌడ్‌ను పూలమాలతో సన్మానించారు.

News April 6, 2024

నెల్లూరు: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ

image

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ముంబై జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ సీట్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికుల సహాయంతో బయటకి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2024

నంద్యాల: పాలిటెక్నిక్ దరఖాస్తుకు గడువు పెంపు

image

నంద్యాల: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుకు ఈనెల 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు ఉన్న గడువును మరో ఐదు రోజులు ప్రభుత్వం పొడిగించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

News April 6, 2024

కడప: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

image

శుభకార్యాయానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన దువ్వూరు మండలంలో జరిగింది. పోలీసులు వివరాల మేరకు.. భీమునిపాడుకు చెందిన యేసయ్య, సుజాత దంపతులు ఏకో పల్లిలో జరిగిన బంధువుల శుభకార్యాయానికి వెళ్లారు. గురువారం రాత్రి బైక్‌పై తిరిగి వస్తుండుగా గుర్త తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీ కొంది. క్షతగాత్రులను 108వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో యేసయ్య, ప్రొద్దుటూరులో సుజాత మృతి చెందారు.

News April 6, 2024

శ్రీకాకుళం జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు వీరే..

image

జై భారత్ నేషనల్ పార్టీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఇప్పిలి సీతరాజును ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రకటించారు. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా రాగోలు నాగశివ, టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా బైపల్లి పరమేశ్వరరావు, పలాస అసెంబ్లీ అభ్యర్థిగా బద్రీ సీతమ్మలు బరిలో దిగనున్నట్లు ఆయన చెప్పారు. తమపై నమ్మకం ఉంచి టికెట్లు కేటాయించిన అధ్యక్షుడికి వారు కృతజ్ఞలు తెలిపారు.

News April 6, 2024

గిద్దలూరులో వాడి వేడిగా మారిన రాజకీయాలు

image

గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. వైసీపీ నుంచి కుందూరు నాగార్జునరెడ్డి, టీడీపీ నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి రేసులో ఉండగా ఇప్పుడు తాజాగా జనసేన రెబల్ అభ్యర్థిగా ఆమంచి స్వాములు బరిలో నిలుస్తున్నట్లు శుక్రవారం కంభంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమంచి వెల్లడించారు. దీంతో గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ చర్చ వాడివేడిగా మారింది. దీంతో గిద్దలూరులో ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.

News April 6, 2024

చెన్నై – భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్(06073) మే 6, 13, 20, 27 తేదీల్లో అర్ధరాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తరువాత రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ వచ్చి.. వెళుతుందన్నారు. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ (06074) మే 7, 14, 21, 28, జూన్ 4 తేదీల్లో రాత్రి 9కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుందన్నారు.

News April 6, 2024

పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు పిఠాపురంలోనే

image

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 2వ విడత పర్యటన ఖరారైంది. 7వ తేదీన అనకాపల్లి, 8వ తేదీన యలమంచిలిలో పర్యటించి అక్కడ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం 9వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 9వ తేదీ అనంతరం షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 6, 2024

చెన్నై – భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్(06073) మే 6, 13, 20, 27 తేదీల్లో అర్ధరాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తరువాత రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ వచ్చి.. వెళుతుందన్నారు. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ (06074) మే 7, 14, 21, 28, జూన్ 4 తేదీల్లో రాత్రి 9కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుందన్నారు.