Andhra Pradesh

News April 5, 2024

పెద్దశేష వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

image

తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్ర‌వారం రాత్రి 7 గంటలకు పెద్దశేషవాహనంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

News April 5, 2024

ఏలూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా

image

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్కూల్ బస్సుగా స్థానికులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆ బస్సులో పిల్లలు ఉన్నారా..? లేరా..? అనే వివరాలేవి తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 5, 2024

శ్రీకాకుళం: నాలుగు నియోజకవర్గాలో అభ్యర్థుల ప్రకటన

image

జైభారత్ నేషనల్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పలాస -బద్రి సీతమ్మ యాదవ్, టెక్కలి -బైపల్లి పరమేశ్వర్ రావు, శ్రీకాకుళం-రాగోలు నాగ శివ, రాజాం -కుపిలి చైతన్య కుమార్ లు పోటీ చేయనున్నారు.

News April 5, 2024

నంద్యాల: వైసీపీకి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాజీనామా

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఓబుల్ రెడ్డిగారి బాలిరెడ్డి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు, ఎమ్మెల్యే కాటసానికి పంపించినట్లు తెలిపారు. కొంతకాలంగా ఎమ్మెల్యే, పార్టీ తీరుపై బాలిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈయన త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

News April 5, 2024

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 49 మంది వాలంటీర్లు, ఏడుగురు కాంట్రాక్ట్ సిబ్బంది, ముగ్గురు రెగ్యులర్ సిబ్బంది, ఇద్దరు రేషన్ డీలర్లను తొలగించామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

News April 5, 2024

విశాఖ: ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వీవీ లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. భీమిలి-ఎల్లిపిల్లి అనిల్ కుమార్, విశాఖ పశ్చిమ- జగ్గుమంత్రి వెంకట గణేష్, అనకాపల్లి- కె.సురేష్ బాబు, పెందుర్తి- కేఎంకే శ్రీకాంత్, ఎలమంచిలి- డి.పూర్ణచంద్రరావు, అరకు-ఉపేంద్ర పోటీ చేస్తారు.

News April 5, 2024

తోట్లవల్లూరులో మహిళ అస్తిపంజరం కలకలం

image

మండలంలోని కాసుమాలపల్లికి ఆనుకుని ఉన్న చెరుకు తోటలో అస్తిపంజరంగా ఉన్న మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ కిషోర్ బాబు,  ఎస్సై విశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ చనిపోయి 15 నుంచి 20 రోజులు అయి ఉంటుందని వారు చెప్పారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

News April 5, 2024

పార్వతీపురం: గుర్తు తెలియని మృతదేహం

image

పార్వతీపురం మండలం కృష్ణపల్లి సమీపంలో గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని గుర్తించినట్లు రూరల్ ఎస్సై దినకర్ తెలిపారు. స్థానిక వీఆర్వో సంఘటనా స్థలానికి వెళ్లామన్నారు. మృతుడు గ్రీన్ కలర్ ట్రాక్ ప్యాంటు, నీలం రంగు షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. 30-35 ఏళ్ళ వయసు ఉంటుందన్నారు. మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు వెల్లడించారు. ఆచూకీ తెలిసినవారు రూరల్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.

News April 5, 2024

పల్నాడులో చంద్రబాబు పర్యటన షెడ్యూల్

image

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో పర్యటించనున్నారు. అక్కడ ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన షెడ్యూల్‌ను టీడీపీ నాయకులు విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 2.55 గంటలకు చంద్రబాబు క్రోసూరు పశువుల ఆసుపత్రి వెనుక ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటున్నారు. 3 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరుతారు. 3.10కి క్రోసూరులోని ఎన్టీఆర్ సెంటర్ వద్ద సభలో ప్రసంగిస్తారు.

News April 5, 2024

ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఇలా! 

image

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలోకి శనివారం ప్రవేశించనుంది. ఆ యాత్ర ఇలా సాగనుంది. ఉదయం 9 గంటలకు నెల్లూరు జిల్లా కావలిలో సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారని సీఎం ప్రోగ్రాంల కోఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు.