Andhra Pradesh

News April 5, 2024

అనంత: వడదెబ్బకు గురై బీటెక్ విద్యార్థి మృతి

image

యాడికి మండలంలో వడదెబ్బకు గురై బీటెక్ విద్యార్ధి మృతిచెందాడు. మండల పరిధిలోని రాయలచెరువుకు చెందిన నిఖిల్ చౌదరి తమ సొంత పరిశ్రమ పనుల నిమిత్తం 2 రోజులు ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News April 5, 2024

బ్రహ్మంగారిమఠం: వడ దెబ్బతో వృద్ధుడు మృతి

image

బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన రజకుడు పొంగూరు సుబ్బయ్య(65)అనే వ్యక్తి వడ దెబ్బకు గురై మృతి చెందాడు. గురువారం పింఛను కోసం మల్లేపల్లి సచివాలయం వద్దకొచ్చి వృద్ధాప్య పింఛను తీసుకున్నాడు. ఈ క్రమంలో ఎండధాటికి వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బయ్యను శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు 108లో మైదుకూరుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

News April 5, 2024

తాళ్లపల్లి : విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన శీలం శ్రీను (50) ఉదయాన్నే రైట్ కెనాల్ పక్కనే ఉన్న మరసకుంట వద్దకు బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పొలానికి నీరు పెట్టే విద్యుత్ మోటారు వైరు తగిలి కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2024

తిరుపతి: టీడీపీలో చేరిన వైసీపీ ZPTC

image

తిరుపతి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పాకాల జడ్పీటీసీ నంగా పద్మజ, ఆమె భర్త బాబు రెడ్డి చెవిరెడ్డి తీరును నిరసిస్తూ నిన్న వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప.గో జిల్లా గోపాలపురంలో మాజీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం నంగా దంపతులు మాట్లాడుతూ.. కష్టపడిన వారికి వైసీపీలో గుర్తింపు లేదని.. ఆ పార్టీలో ఉత్సవ విగ్రహాలు లాగా ఉండలేక రాజీనామా చేశామని చెప్పారు.

News April 5, 2024

పాతపట్నం: 81 ఓట్లతో MLAగా గెలిచి!

image

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పెంటన్నాయుడు, కెఎల్పి ఎమ్‌ఎస్‌నారాయణపై 81 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అలాగే 1989లో కె.మోహన్‌రావు (టీడీపీ), డి.నారాయణరావు (కాంగ్రెస్)పై 274 ఓట్లతో ఓడించి MLA అయ్యారు.

News April 5, 2024

గంపలగూడెంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గంపలగూడెంలోని మార్కెట్ సెంటర్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న ఓ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2024

అద్దంకిలో 21 మంది వాలంటీర్లు రాజీనామా

image

అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన 14 మంది వాలంటీర్లు, కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన 7 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. అనంతరం వారు అద్దంకిలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డిని కలిసి తమ మద్దతు తెలియజేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేవలు కొనసాగిస్తామని పలువురు వాలంటీర్లు తెలియజేశారు.

News April 5, 2024

విజయవాడ: ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం స్థాపించినట్లే.!

image

2008లో ఏర్పడ్డ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ గత 3 సార్లు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించింది. ఉమ్మడి ఆంధ్రలో 2009లో విష్ణు(కాంగ్రెస్), నవ్యాంధ్రలో 2014లో బొండా ఉమ(టీడీపీ), 2019లో విష్ణు(వైసీపీ) ఇక్కడ గెలవగా వారు గెలిచిన పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వైసీపీ నుంచి, ఉమ టీడీపీ నుంచి తలపడుతున్నారు.

News April 5, 2024

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

చిత్తూరు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్‌ను నూతన ఎస్పీ మణికంఠ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీగా విజయ్ మణికంఠ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News April 5, 2024

రూరల్‌లో ఎక్కువ.. అర్బన్‌లో తక్కువ: కలెక్టర్

image

ప.గో జిల్లాలోని 7 నియోజకవర్గాలలో ఏడాదిగా ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహించగా.. 14,63,014 మంది కొత్తగా నమోదయ్యారని కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం తెలిపారు. గత ఎన్నికల్లోని పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రూరల్‌లో ఎక్కువ శాతం, అర్బన్‌లో తక్కువ శాతం నమోదవుతూ వచ్చిందని అన్నారు. మే 13న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.