Andhra Pradesh

News April 5, 2024

శ్రీకాకుళం: టీ షర్ట్ కోసం అన్నదమ్ముల గొడవ.. అన్న మృతి

image

సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్(31), సురేశ్ (25) అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేశ్ టీ షర్ట్ ను సురేశ్ వేసుకున్నాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. రమేశ్‌ను తమ్ముడు సురేశ్ నెట్టివేయడంతో తలకు రాయి తగిలి, తీవ్ర గాయమైంది. స్థానికులు శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతిచెందినట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు.

News April 5, 2024

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా అమిత్ బర్దార్ బాధ్యతలు

image

సార్వత్రిక ఎన్నికలు- 2024 జిల్లాలో ఎలాంటి ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యమని నూతన ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగంతో కలసి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఎస్పీ ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఉన్నా.. సమిష్ఠిగా ఎదుర్కొని పరిష్కరిస్తామన్నారు. 

News April 5, 2024

బుగ్గ రామలింగేశ్వరుడిని తాకిన సూర్యుని కిరణాలు

image

తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్‌ను సూర్యుడు గురువారం సాయంత్రం కిరణాలు తాకాయి.  ప్రతి సంవత్సరం పాల్గుణ వైశాఖ మాసంలో సూర్యహస్తమయ సమయంలో కిరణాలు మూల విరాట్‌పై పడతాయని అర్చకులు తెలిపారు. శుద్ధ ఏకాదశి కావడంతో సూర్యుడి కిరణాలు స్వామి వారి మూల విరాట్‌పై పడ్డాయని అర్చకులు తెలిపారు.

News April 5, 2024

విశాఖ: 7న జూలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

image

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జాతీయ’జూ ప్రేమికుల దినోత్సవం’ ఈనెల 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. జూలోని జంతువుల మాదిరి చిన్నారులు డ్రెస్ వేసుకుని పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు.

News April 5, 2024

వినుకొండకు ఏప్రిల్ 8న సీఎం జగన్ రాక

image

వినుకొండ పట్టణంలో ఏప్రిల్ 8 న జరగనున్న ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో సీఎం జగన్ పొల్గొననున్నారని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని వైసీపీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బొల్లా బ్రహ్మనాయుడు, అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రారంభమైన మేమంతా సభ తర్వాత గురజాలలో జరుగుతుందని తెలిపారు.

News April 5, 2024

విజయవాడ: పింఛన్ సొమ్ముతో సచివాలయం ఉద్యోగి పరార్

image

విజయవాడలో పింఛను డబ్బుతో సచివాలయ ఉద్యోగి పరారైన ఘటన శుక్రవారం జరిగింది.మధురానగర్ సచివాలయం-208కి చెందిన ఉద్యోగి నాగమల్లేశ్వరావుగా అధికారులు గుర్తించారు. సచివాలయంలో పింఛను పంపిణీ సొమ్ములో తేడా రావడంతో విషయం వెలుగుచూసింది. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News April 5, 2024

శ్రీసత్యసాయి: ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడే మోసిన మాజీమంత్రి

image

సత్యసాయి బాబా అనువాదకుడు అనిల్ కుమార్ భౌతికకాయాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులర్పించారు. రెండు రోజులు క్రితం ప్రొఫెసర్ అనిల్ కుమార్ అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం పుట్టపర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడేను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మోశారు. సత్యసాయిబాబా అనువాదకుడిగా అనిల్ కుమార్ భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

News April 5, 2024

తిరుపతి IITలో ఉద్యోగాలకు నేడు చివరి తేదీ

image

ఏర్పేడు సమీపంలోని తిరుపతి IITలో సీనియర్ రీసెర్చ్ ఫెలో-01, ప్రాజెక్టు అసిస్టెంట్-01 పోస్టుల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుంది. యూజీ, పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, గేట్ పాసైన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 05.

News April 5, 2024

ప్రకాశం: బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి స్పాట్ డెడ్

image

బైక్‌‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మార్టూరు పట్టణంలోని సినీఫక్కీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరుకు వెళుతున్న కారు అతి వేగంతో ముందు వెళుతున్న బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చిలకలూరిపేటకు చెందిన నల్లజర్ల వేమయ్య (32)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News April 5, 2024

శ్రీకాకుళంలో భానుడి భగ భగ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఎండతీవ్రతకు పట్టణంతో పాటుగా ఆమదాలవలస, రణస్థలం, ఎచ్చెర్ల, చిలకపాలెం, టెక్కలి, రాజాం, పొందూరు ప్రధాన రహదారులపై జనసంచారం పలుచబడింది. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.