Andhra Pradesh

News April 5, 2024

కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఎం-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 24, 26, 29, మే 1వ తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల టైం టేబుల్, పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

News April 5, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి పాఠశాలల్లో వార్షిక పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగియనున్నాయి. ప్రశ్న పత్రాలు మండల రిసోర్స్ కార్యాలయం నుంచి పాఠశాల సముదాయాలకు.. అక్కడ నుంచి సంబంధిత పాఠశాలకు ఈ ప్రశ్న పత్రాలు వెళతాయని అధికారులు తెలిపారు.

News April 5, 2024

ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలు

image

అనంతపురం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం 08: 47గంటలకు నూతన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. నూతన కలెక్టర్‌కి ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు.

News April 5, 2024

మిసెస్ ఇండియా పోటీల్లో ‘గోదారి’ మహిళ సత్తా

image

మిసెస్ ఇండియా పోటీల్లో ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన రుద్రరాజు ఛాయాదేవి సత్తా చాటారు. గత నెల 30న ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ పోటీల్లో మిసెస్ ఇండియా(క్లాసిక్)గా ఎంపికయ్యారు. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా గుండుగొలనులోనే సాగగా.. వివాహానంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. MBA చదివిన ఛాయాదేవి ప్రస్తుతం శ్రీవిహారి సర్వీసెస్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

News April 5, 2024

విశాఖ: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపాలెంలో గురువారం ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్కోజు హేమంత్ కుమార్ (38) గురువారం మధ్యాహ్నం ఇంటి లోపల గడియ పెట్టుకున్నాడు. రాత్రి అవుతున్నా బయటకు రాకపోవడంతో తల్లి స్థానికుల సాయంతో తలుపు తెరిచి చూసేసరికి ఉరివేసుకుని కనిపించాడు. తన మృతికి ఎవరు కారణం కాదని సూసైడ్ లెటర్ రాసి పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 5, 2024

సాలూరు వీఆర్వో శ్రీరాములు మృతి

image

సాలూరు వీఆర్వో గోర్జ శ్రీరాములు(57) హార్ట్‌ఎటాక్‌తో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. పెదబోరబంద గ్రామానికి చెందిన శ్రీరాములు సాలూరు పట్టణంలో వీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆఫీసులోనే గుండె నొప్పి వచ్చింది. స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటిన విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 5, 2024

కాంగ్రెస్‌లో చేరిన కిల్లి కృపారాణి

image

వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌లో చేరారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల బస్సు యాత్రలో కృపారాణి, ఆమె భర్త కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 5, 2024

కాకినాడ: 3 ఎన్నికలు.. 3 పార్టీలు గెలుపు

image

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో కాకినాడ రూరల్ ఏర్పాటైంది. కాగా ఈ నియోజకవర్గంలో తొలిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురసాల కన్నబాబు PRP నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో పిల్లి అనంతలక్ష్మి TDP నుంచి, 2019లో కురసాల కన్నబాబు YCP నుంచి గెలుపొందారు. ఇలా జరిగిన 3 ఎన్నికల్లో 3 వేర్వేరు పార్టీలు గెలుపొందాయి. మరి ఈ సారి ఏ పార్టీ జెండా ఎగిరేనో..?

News April 5, 2024

గుంటూరులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. వ్యక్తి మృతి

image

గుంటూరు నగర శివారు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో గుంటూరు నల్లపాడు గ్రామానికి చెందిన కరణం శేషా సాయి (28) మృతి చెందాడు. మరొక ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డట్టు స్థానికులు తెలిపారు. గుంటూరు నుంచి వంకాయలపాడు స్పైసెస్ పార్కుకు మినీ ట్రావెల్ బస్సులో సిబ్బంది వెళ్తుండగా.. బస్సు అదుపుతప్పి బోల్తా పడ్డట్టు సమాచారం .పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 5, 2024

ఆ నలుగురే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం

image

సీఎం జగన్ గురువారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. శనివారం ఉదయం వరకు ఇక్కడే ఉండనున్న జగన్ ఉమ్మడి నెల్లూరుతో పాటు కందుకూరు కలిపి 11/11 సీట్లలో విజయంపై జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వేమిరెడ్డి దంపతులతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసే స్థానాలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే.