Andhra Pradesh

News April 5, 2024

VZM: ఉపాధి హామీ పనులు అమలులో మనమే టాప్

image

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని అమలులో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్‌ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు జిల్లాలో 2.10 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా 1.18 లక్షల పని దినాలను కల్పించారు. జిల్లాలో 3.21 లక్షల కార్డులపై 5.04 లక్షల కూలీలు ఉపాధి హామీ పనులను వినియోగించుకుంటున్నారు.

News April 5, 2024

విశాఖ: రెండు పశువుల వాహనాలు పట్టివేత

image

పాయకరావుపేట మండలం సీతారాంపురం జంక్షన్ వద్ద గురువారం రాత్రి 9 గంటలకు అక్రమంగా 45 పశువులను రవాణా చేస్తున్న బొలెరో వాహనాన్ని, కంటైనర్‌ను ఎస్సై జోగారావు నేతృత్వంలో సిబ్బంది పట్టుకున్నారు. కంటైనర్‌లో 37 పశువులు, బొలెరో వాహనంలో 8 పశువులను బంధించి రవాణా చేస్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నామని చెప్పారు. గోవులను గోశాలకు తరలించి, రెండు వాహనాల డ్రైవర్లు, పశువులను విక్రయించిన యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.

News April 5, 2024

9న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

News April 5, 2024

వైసీపీ ప్రభుత్వంలోనే మైనారిటీల అభివృద్ధి: అవినాశ్

image

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలోనే మైనారిటీల అభివృద్ధి సాధ్యమైందని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. కడప వినాయక నగర్ వద్ద ఆటో గ్యారేజ్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 100 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News April 5, 2024

గుంటూరు ఐజీగా సర్వ శ్రేష్ట త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ

image

గుంటూరు రేంజ్ ఐజీగా సర్వ శ్రేష్ట త్రిపాఠి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఐజీగా పనిచేసిన పాలరాజుని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేయగా ఆయన స్థానంలో త్రిపాఠిని నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారిని గుంటూరు ఎస్పీ తుషార్ దూడి మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. గుంటూరు రేంజ్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని ఐజీ తెలిపారు.

News April 5, 2024

కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి నంది అవార్డులు

image

తెలంగాణలోని మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ వరకు జరిగిన నంది అవార్డులలో కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి నంది అవార్డులు వరించాయి. ఉత్తమనటుడుగా శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ నటిగా సురభి ప్రభావతి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ మేకప్ మాన్ విభాగాలలో నంది అవార్డులు లభించాయని కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు.

News April 5, 2024

ఎన్నికల విధులలో ఎవరికి మినహాయింపులు లేవు: సత్యసాయి కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో విధులకు సంబంధించి ఎవరికి ఎలాంటి మినహాయింపులు లేవని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో జరిగిన సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా, వాటిని శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలన్నారు.

News April 5, 2024

‘ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని అంశాలపై అవగాహన’

image

నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు ఎన్నికల శిక్షణా తరగతుల నిర్వహణతో అన్ని అంశాల్లో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, నెల్లూరు నగరంలోని స్థానిక డి.కె. మహిళా కళాశాలలో ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణలో అన్ని అంశాలపట్ల ఉత్తమ తర్ఫీదు ఇచ్చామని, సందేహాలకు తావులేకుండా మాస్టర్ ట్రైనర్స్ వివరించారని తెలిపారు.

News April 4, 2024

విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు నేడు గురువారం విజయవాడ మీదుగా బరౌని- కోయంబత్తూరు (నెం.05279) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఈ రోజు రాత్రి 23.42 గంటలకు బరౌనిలో బయలుదేరి ఆదివారం ఉదయం 4 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుందని పేర్కొంది. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు దువ్వాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది.

News April 4, 2024

కృష్ణా: ప్రజలకు ముఖ్య గమనిక

image

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) జిల్లాలో గురువారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో) నమోదవుతాయని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
☞కంకిపాడు 40.4
☞ఉయ్యూరు 39.9
☞బాపులపాడు 40.6
☞గుడివాడ 39.5
☞గన్నవరం 40.7
☞పెనమలూరు 40.7
☞ఉంగుటూరు 40.4
☞పెదపారుపూడి 39.9
☞తోట్లవల్లూరు 39.9
☞పామర్రు 39.1