Andhra Pradesh

News April 4, 2024

కోడూరు: కృష్ణా నదిలో దూకి యువకుడి ఆత్మహత్య..!

image

కృష్ణా నదిలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం భవానీపురం వారధి చోటు చేసుకుంది. అవనిగడ్డ సీఐ త్రినాథ్ తెలిపిన వివరాల మేరకు గుడివాడకు చెందిన చిన్న శంకర్రావు(33) అనే యువకుడు బుధవారం రాత్రి ఉల్లిపాలెం వారిధి వద్ద తన యొక్క వాహనాన్ని వదిలి కృష్ణా నదిలో దూకినట్లు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా గురువారం మృతదేహం లభ్యం అయిందని తెలిపారు.

News April 4, 2024

టీటీసీ పరీక్ష ఫలితాలు విడుదల డీఈవో

image

డిసెంబర్‌లో జరిగిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాసైన వారి సర్టిఫికెట్స్ ను అభ్యర్థులు శిక్షణ పొందిన విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వైయస్సార్ కడప, ఆనంతపురం, కేంద్రాలలో పొందవచ్చని తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాల్ టికెట్ చూపించి పాస్ సర్టిఫికెట్ ఆయా కేంద్రాల్లో పొందవచ్చని విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ గురువారం వెల్లడించారు.

News April 4, 2024

బలిజిపేట సీడీపీఓ మృతి

image

బలిజిపేట సీడీపీఓగా పని చేస్తున్న సుగుణ కుమారి గురువారం మృతి చెందారు. గురువారం ఉదయం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆమెకు తీవ్ర తల నొప్పి వచ్చింది. విజయనగరం ఆసుపత్రి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందింది. పాచిపెంటలో సూపర్ వైజర్‌గా పనిచేసిన ఆమె పదోన్నతిపై బలిజిపేట సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్నారు. 

News April 4, 2024

ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్

image

ప్రకాశం జిల్లా ఎస్పీగా 2015 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సుమిత్ సునీల్ ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8 గంటలలోపు విధుల్లోకి చేరాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

News April 4, 2024

నాయుడుపేటలో ముగిసిన జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ

image

నాయుడుపేటలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తిరుపతి జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు నెల్లూరు చింతారెడ్డిపాలెం వద్ద బస చేస్తారు.

News April 4, 2024

అనపర్తి టికెట్‌పై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు

image

కొవ్వూరు ‘ప్రజాగళం’ సభలో TDP అధినేత చంద్రబాబు అనపర్తి టికెట్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో జనసేన 2చోట్ల పోటీ చేస్తుంది. మిగిలిన 5 స్థానాల్లో ఒక అసెంబ్లీ సీటు BJPకి ఇచ్చాం. BJPకి ఇచ్చిన అసెంబ్లీ సీటు ఇంకా నిర్ణయం కాలేదు. MP అభ్యర్థిగా పురందేశ్వరీ పోటీ చేస్తున్నారు’ అని అన్నారు. కాగా.. అనపర్తి టికెట్ BJPకి ఇవ్వగా.. నల్లమిల్లి నుంచి అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే.

News April 4, 2024

50వేల మెజారిటీతో గెలుస్తా: సత్యకుమార్ యాదవ్

image

ధర్మవరం నియోజకవర్గంలో ఐదేళ్లుగా సాగిన రాక్షస పాలనకు అంతం పలుకుదామని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్‌లో తన బహిరంగ సభకు కదలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే.. 50వేల మెజారిటీలో గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజలు తలుచుకుంటే వైసీపీ పాలన నేలమట్టమవుతుందని చెప్పారు. ధర్మవరంలో వైసీపీ పాలన తొలగి.. ప్రజాపాలన రావాలని సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు.

News April 4, 2024

పల్నాడు: ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్

image

పల్నాడు జిల్లా ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ నియమితులయ్యారు. కాగా ఈయన గతంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన బిందుమాధవ్ పశ్చిమగోదావరి జిల్లా గ్రేహౌండ్స్, రంపచోడవరంలో అసిస్టెంట్ ఎస్పీగా, ఎస్‌ఈబీ గుంటూరు రూరల్‌ జిల్లా జాయింట్‌ డైరెక్టర్ గా పనిచేశారు.

News April 4, 2024

మహానందీశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు

image

కర్ణాటక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహానందీశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు చేపట్టినట్లు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు వేకువజామున 3 గంటలకే ఆలయ తలుపులు తెరిచి స్థానిక అభిషేక, అర్చన పూజల అనంతరం అష్టవిధ మహా మంగళహారతులు పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వేకువజామున 4 గంటల నుంచి 6: 30 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

News April 4, 2024

ఎన్టీఆర్: తొలిసారి పోటీకి దూరంగా దేవినేని

image

సోదరుడు రమణ మరణానంతరం 1999 నుంచి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దేవినేని ఉమ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 1999, 2004లో నందిగామలో గెలిచిన ఉమ ఆ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2009,14,19లో మైలవరంలో పోటీ చేశారు. 2019లో మినహా ఆయన ప్రతిసారి గెలుపు సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికలలో టీడీపీ అధిష్ఠానం మైలవరం టికెట్ వసంతకు కేటాయించడంతో ఉమ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.