Andhra Pradesh

News April 4, 2024

మద్దికేర రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి

image

మద్దికేర గ్రామ శివారులో ఇటీవల బొలెరో టైరు పగిలి విద్యుత్ స్తంభానికి ఢీకొని బోల్తాపడిన ఘటన తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న మద్దికేర గ్రామానికి చెందిన కూలీలు ఆదిలక్ష్మి (50), సంజమ్మ (40) అదే రోజు మరణించారు. కురువ లక్ష్మీదేవి (35) సావిత్రమ్మ(65) చికిత్స పొందుతూ బుధవార రాత్రి మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

News April 4, 2024

కారంపూడి: 50 మంది వాలంటీర్ల రాజీనామా

image

కారంపూడి మండలంలోని కారంపూడి పట్టణానికి చెందిన 50 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్టు గురువారం ఎంపీడీఓ గంట శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. అలాగే వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంపిణీ చేయొద్దంటూ ఆంక్షలు విధించింది. దీంతో వారు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.

News April 4, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా వర్శిటీ పరిధిలోని LL.B/B.A.LL.B విద్యార్థులు రాయాల్సిన 1,5వ సెమిస్టర్ (2023 రెగ్యులేషన్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 15, 18, 20, 23, 25 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని, 70 మార్కులకు ఈ పరీక్షలు జరుగుతాయని వర్శిటీ వర్గాలు తెలిపాయి. 

News April 4, 2024

విశాఖ: 15 నుంచి సముద్ర జలాల్లో చేపలవేట నిషేధం

image

సముద్ర జలాల్లో ఈనెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపలవేటపై నిషేధం విధించామని మత్స్యశాఖ సహాయ సంచాలకులు విజయకృష్ణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మత్స్యవేట సాగిస్తే ఏపీఎంఎస్ఆర్ చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. మత్స్యసంపద సహా బోటును స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తామన్నారు. ఆయిల్ రాయితీని కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

News April 4, 2024

సీక్రెట్ సర్వే చేయడం సంతోషం: గుండ

image

టీడీపీ గార మండల ముఖ్య నాయకులతో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు వారి నివాసంలో గురువారం సమావేశమయ్యారు. వాళ్లు మాట్లాడుతూ.. శ్రీకాకుళం నియోజకవర్గంలో నాయకుల మనోభావాలను తెలుసుకునేందుకు టీడీపీ అధిష్ఠానం ప్రయత్నిస్తోందని చెప్పారు. ముందస్తు సమాచారం లేకుండా సీక్రెట్‌గా నిన్న సర్వే చేయడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. టికెట్ మార్పు విషయమై పునఃపరిశీలన చేస్తున్నారని చెప్పారు.

News April 4, 2024

కడప: శ్రీనివాస్ యాదవ్ హత్య కేసులో సిట్ ఏర్పాటు 

image

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో అడిషనల్ SP వెంకట్రాముడు నేతృత్వంలో SP సిద్దార్థ్ కౌశల్  సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

News April 4, 2024

శ్రీశైలంలో ఉగాది మహోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు ఇవే

image

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. 6న భృంగివాహన సేవ, అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం, 7న కైలాస వాహన సేవ మహాదుర్గ అలంకారం, 8న నంది వాహన సేవ, మహాసరస్వతి అలంకారం, 9న రథోత్సవం, అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు. వీటితో పాటు 8వ తేదీన ప్రభోత్సవం, 9న పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News April 4, 2024

తాడిపత్రి: పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి

image

పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి చెందిన ఘటన తాడిపత్రి మండలంలో చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని టైలర్స్ కాలనీకి చెందిన హుసేన్ మియా పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందారు. అలాగే చిన్నపొలమడ గ్రామానికి చెందిన ఆదెమ్మ నిన్న పింఛన్ కోసం వెళ్లి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.

News April 4, 2024

పొందూరు నుంచి వెళ్తూ ముగ్గురు మృతి

image

విశాఖ నగరంలోని పెందుర్తి సమీపంలో ఇవాళ ఉదయం <<12986188>>ఘోర రోడ్డు ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లా తాళ్లపూడి మం. తిరుగుడుమెట్ట రామకృష్ణ కాలనీకి చెందిన పలువురు శీకాకుళం జిల్లా పొందూరులో జరిగిన పెళ్లికి వచ్చారు. తిరిగి స్వగ్రామానికి టాటా ఏస్ వ్యాన్‌లో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. హనుమంతు ఆనంద్(40), హనుమంతు చంద్రశేఖర్(16), చింతాడ ఇందు(50) చనిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు.

News April 4, 2024

పవన్ అలా చెప్పడం బాధాకరం: ముద్రగడ

image

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ పెద్దలు గురువారం కిర్లంపూడిలో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. సీఎం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనే అమలు చేస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ గెలిస్తే నాణ్యమైన బ్రాందీని అందిస్తానని పవన్ అనడం బాధాకరమన్నారు. బౌన్సర్లతో ప్రచారం చేసే పవన్ ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటారని ప్రశ్నించారు.