Andhra Pradesh

News April 4, 2024

ఐబీఆర్ అచీవర్‌గా బుర్రిలంక బుడ్డోడు

image

కడియం మండలం బుర్రిలంకకు చెందిన ఈలి రుత్విక్  సంవత్సరం 6 నెలల వయసులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ‘ఐబీఆర్ అచీవర్’ గా నిలిచాడు. 25 రకాల చర్యలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ బుడతడు ప్రతిభను మెచ్చుకొని పలువురు అభినందనలు తెలిపారు.

News April 4, 2024

కర్నూలు: 24 నుంచి వేసవి సెలవులు

image

కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ తెలిపారు. సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పారు.

News April 4, 2024

కడప జిల్లాలో బెంబేలెత్తిస్తున్న భానుడు

image

జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం రాష్ర్టంలోనే అత్యధికంగా ఒంటిమిట్టలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండ ప్రభావానికి వృద్ధులు, చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం బయటికి రావద్దని హెచ్చరించారు.

News April 4, 2024

తిరుమల: రేపు డయల్ యువర్ ఈవో

image

టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో ఏవీ ధర్మారెడ్డితో ఫోన్లో(0877-2263261) నేరుగా మాట్లాడి తెలపవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 4, 2024

కర్నూలు: కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

అనంత(D) గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్‌కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్‌లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.

News April 4, 2024

అనంత: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. కర్నూలు(D) మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్‌కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్‌లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.

News April 4, 2024

నెల్లూరు: ఈనెల 14 వరకు అవకాశం

image

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 20,44,815 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా చిన్న తప్పులుంటే ఎన్నికల సంఘం సూచించిన 10 గుర్తింపు కార్డుల్లో దేన్నైనా చూపి ఓటు వేయవచ్చన్నారు.

News April 4, 2024

12న వెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు

image

రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెంలో 29 ఏళ్ల కిందట శిరోముండనం జరిగింది. ఈ ఘటనపై నమోదైన కేసుకు సంబంధించి విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణ బుధవారంతో పూర్తయింది. తుది తీర్పు ఈనెల 12వ తేదీన వెలువడనుంది. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ, వైసీపీ మండపేట MLA అభ్యర్థి తోట త్రిమూర్తులుతోపాటు మరో 9 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

News April 4, 2024

ప్రకాశం: గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ పరిధిలోని అంబాపురం గ్రామ శివారులో పురాతనమైన అంబబాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో కొందరు దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. ఆలయం వెనక వైపు రాతి గోడలను ధ్వంసం చేశారు. గ్రామస్థులు గమనించి బుధవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్సై గోపాలకృష్ణ పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

News April 4, 2024

శ్రీకాకుళం: కొత్త పీజీ కోర్సు మంజూరు

image

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ(పురుషులు) కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు మంజూరైనట్లు ప్రిన్సిపల్ సురేఖ తెలిపారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్.రజని కోర్సు అనుమతి పత్రాలను ప్రిన్సిపల్‌కు అందజేశారు. పీజీ సెట్ ద్వారా ప్రవేశం పొంది ఈ కోర్సు పూర్తి చేసిన తరువాత వైద్య, ఫార్మా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు.