Andhra Pradesh

News August 24, 2025

ఎరుపెక్కిన ఒంగోలు

image

ఒంగోలులో తొలిసారిగా నిర్వహించిన సీపీఐ రాష్ట్ర మహాసభ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. 28వ రాష్ట్ర మహాసభకు ఒంగోలు వేదిక కావడంతో కొన్ని రోజులుగా జిల్లా సీపీఐ నాయకత్వం, మహాసభలను సక్సెస్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ర్యాలీతో మహాసభ సూపర్ సక్సెస్ అంటూ జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. మొత్తం మీద ఒంగోలు నగరం ఎర్రజెండాలతో రెపరెపలాడింది.

News August 23, 2025

చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి: కలెక్టర్

image

చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో జరిగిన హస్తకళా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడం మన సంస్కృతికి, కళాకారుల అభివృద్ధికి అవసరమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

News August 23, 2025

29న విశాఖకు రానున్న సీఎం చంద్రబాబు

image

ఈ నెల 29న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా హోటల్ నోవాటెల్‌కు వెళ్తారు. అనంతరం V.M.R.D.A కాంప్లెక్స్‌లు, పర్యాటక శాఖ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభిస్తారు. అమరావతి ఛాంపియన్షిప్ కప్ ఫైనల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసి తర్వాత ప్రో కబడ్డీ పోటీలను ప్రారంభిస్తారని జిల్లా అధికారులు శనివారం తెలిపారు.

News August 23, 2025

వినాయక ఉత్సవ కమిటీలకు కలెక్టర్ విజ్ఞప్తి

image

రాజమండ్రిలో వినాయక చవితి ఉత్సవాల అనుమతుల మంజూరు కోసం సింగిల్ విండో విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి తెలిపారు. ఉత్సవ కమిటీలు సులభంగా అనుమతులు పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ ప్రక్రియలో నగరపాలక సంస్థకు సహకరించాలని ఆమె ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు.

News August 23, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ గుంటూరులో అబ్బురపరుస్తున్న 99 అడుగుల మట్టి గణపతి.
☞ వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: SP.
☞ హత్యకు గురైన ఈ తీర్పు మా బిడ్డకు ఘనమైన నివాళి.
☞ మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు.
☞ తెనాలి: నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా.
☞ రాష్ట్ర స్థాయి పోటీలకు మందడం విద్యార్థి.
☞ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పెమ్మసాని.

News August 23, 2025

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: ఎస్పీ

image

జిల్లాలోని ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పలు పాఠశాలల యాజమాన్యాలతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే విద్యార్థులు ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే చట్టం తీసుకునే చర్యల గురించి యాజమాన్యాలు వివరించాలన్నారు.

News August 23, 2025

రాజమండ్రి: కొత్త బార్ పాలసీలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యం

image

మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త బార్ పాలసీని అమల్లోకి తెచ్చిందని ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ఈ పాలసీలో భాగంగా బార్లలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం రాజమండ్రిలో ఉమ్మడి తూ.గో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, స్టేషన్ సీఐలతో ఆయన సమావేశం నిర్వహించారు.

News August 23, 2025

విశాఖ పోలీస్ సిబ్బందికి పదోన్నతులు

image

విశాఖ కమీషనరేట్ పరిధిలో 29 మంది పోలీస్ సిబ్బందికి పదోన్నతలు లభించాయి. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వారిని శనివారం సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని సీపీ సూచించారు. వీరిలో 13మంది హెడ్ కానిస్టేబుళ్లు.. ఏఎస్ఐలుగా,14 మంది కానిస్టేబుళ్ళు.. హెడ్ కానిస్టేబుళ్లుగా, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు.

News August 23, 2025

ప్రకాశం ప్రజలకు విద్యుత్ శాఖ SE కీలక సూచన!

image

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు శనివారం జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బిల్లులను ఫోన్ పే, డిపార్ట్మెంట్ యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు.

News August 23, 2025

డీఎస్సీ ఫలితాలు.. ఆరు ఉద్యోగాలు సాధించిన ప్రసాద్

image

వంగర మండలం మరువాడ గ్రామానికి చెందిన గుంట ప్రసాద్ శుక్రవారం వెలువడిన DSC ఫలితాలలో ఎస్‌సిబి కేటగిరిలో ఆరు ఉద్యోగాలు సాధించారు. SA ఫిజిక్స్, SA మ్యాథ్స్, PGT ఫిజికల్ సైన్స్, TGT మ్యాథ్స్ జోన్1, TGT ఫిజిక్స్ జోన్1, TGT సైన్స్ జోన్1లలో ఉత్తీర్ణత సాధించారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తనను చదివించారని ప్రసాద్ తెలిపారు. ఇష్టమైన ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరుతానన్నారు.