Andhra Pradesh

News April 4, 2024

43 శాతం సామాజిక ఫించన్ పంపిణీ పూర్తి

image

తిరుపతి జిల్లాలో గురువారం సామాజిక ఫించన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ మాసంకు గాను జిల్లా వ్యాప్తంగా 2,71,477 సామాజిక భద్రత పెన్షనర్లకు సచివాలయాల పరిధిలో సాయంత్రం 7 గంటల వరకు 1,16,958 (43%) పెన్షన్ల పంపిణీ జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన వారికి సైతం శుక్రవారం కూడా పంపిణీ చేస్తామని వివరించారు.

News April 4, 2024

తూ.గో.: ఈ నెల 15 నుంచి చేపల వేట నిషేధం

image

సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా మత్స్యశాఖ అధికారులు బుధవారం తెలిపారు. మెకానిజం మోటార్ బొట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ కమిషనర్ సూర్య కుమారి ఆదేశాలు జారీ చేశారన్నారు. చేప, రొయ్యల జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

News April 4, 2024

అంగన్వాడీ కేంద్రాల సమయాలలో మార్పు: ఢిల్లీ రావు

image

వేసవి దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సమయాలను మారుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.

News April 4, 2024

ప్రకటనలకు ముందస్తు అనమతి పొందాలి: సుమిత్ కుమార్

image

జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ ముందస్తు ఆమోదం పొందాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వివిధ టీవీ ఛానల్స్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రకటనలు, సమావేశాలు, ర్యాలీలను క్షుణంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

News April 3, 2024

విశాఖ: షిప్ యార్డ్‌ను సందర్శించిన ఈఎన్‌‌సీ చీఫ్ 

image

తూర్పు నావికాదళపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ బుధవారం హిందుస్థాన్ షిప్ యార్డ్ ను సందర్శించారు. షిప్ యార్డ్ సిఎండి కమడోర్ హేమంత్ ఖాత్రి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో హెచ్ఎస్ఎల్ చేపట్టనున్న భవిష్యత్తు ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వివరించారు. అలాగే సంస్థ విస్తరణకు సంబంధించిన విశదీకరించారు.

News April 3, 2024

ఎన్నికల ప్రచారంలో అనుమతి లేకుంటే చర్యలు: సంపత్ కుమార్

image

విజయవాడ నగరంలోని కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాలు, ర్యాలీలు, వినియోగించే వాహనాలు, లౌడ్ స్పీకర్లకు సంబంధించి ముందుగానే అనుమతులు పొందాలన్నారు. అనుమతి పొందని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 3, 2024

ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం జగన్‌దే: రఘురామ

image

పింఛన్ల కోసం నడిరోడ్డుపై ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం జగన్ దేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. వృద్ధాప్య పింఛన్లు తీసుకునే 56 లక్షల మందిలో ఏ ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని కోరారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులతో కలిసి మండుటెండల్లో వృద్ధులను నిలబెట్టడానికి జగన్ కుట్ర చేశారన్నారు. ఈ కుట్రను ప్రజలు, ప్రత్యేకించి పింఛన్ లబ్ధిదారులు అర్థం చేసుకోవాలన్నారు.

News April 3, 2024

అల్లూరి: లోయలోకి దూసుకెళ్లిన బొలెరో.. బాలిక మృతి

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 30 మంది ఒడిశాకి చెందిన వలస కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ఒక బాలిక మృతి చెందింది. వాహనంలో చిక్కుకున్న వారినందరినీ వెలికి తీశారు. అంబులెన్స్‌లో పాడేరు తరలించారు. గతంలో ఇక్కడే ఓ కారు లోయలో వెళ్లిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.

News April 3, 2024

ప్రొద్దుటూరు: 18 మంది వాలంటీర్లు రాజీనామా

image

ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామ సచివాలయానికి చెందిన 18 మంది వాలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలు సచివాలయ అడ్మిన్ కార్యదర్శికి వారు అందించారు. వాలంటీర్లు మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించకుండా టీడీపీ నాయకుల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం తమను అడ్డుకుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు.

News April 3, 2024

రేపు నాయుడుపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

image

తిరుపతి: నాయుడుపేటలో రేపు ‘మేమంతా సిద్ధం’ సబ జరగనుండడంతో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు నాయుడుపేట సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నర్సారెడ్డి కండ్రిగ NH -16 సమీపంలో రేపు సాయంత్రం సభ జరగనుండటంతో నెల్లూరు వైపు నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు గూడూరు జంక్షన్ నుంచి వయా గూడూరు టౌన్ మీదుగా మళ్లించినట్లు తెలిపారు.