Andhra Pradesh

News April 3, 2024

ఉలవపాడు: పోలీస్ తనిఖీల్లో పట్టుబడ్డ రూ.12 లక్షలు

image

ఉలవపాడు మండలం మన్నేటికోట జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద బుధవారం పోలీసుల తనిఖీలో నగదు పట్టుకున్నట్లు ఎస్ఐ బాజీరెడ్డి తెలిపారు. ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మప్ప అనే వ్వక్తి వద్ద రూ.12 లక్షల 23 వేల నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులు తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

News April 3, 2024

పోడూరు: లారీ ఢీకొని దంపతుల మృతి

image

పోడూరు మండలం జగన్నాధపురంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే వారు మృతిచెందారు. మృతులను పెనుగొండ మండలం కొఠాలపర్రు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.

News April 3, 2024

విశాఖ జిల్లాలో 48% పింఛన్ల పంపిణీ

image

విశాఖ జిల్లాలో బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు 48% సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. అత్యధికంగా పెందుర్తి మండలంలో 76% పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లాలో పెన్షనర్లు మొత్తం 1,65,432 మంది కాగా 79,113 మందికి పింఛన్లు అందజేశామన్నారు.

News April 3, 2024

కర్నూలు MP స్థానాన్ని ముచ్చటగా మూడోసారి గెలుస్తాం: బీవై రామయ్య

image

దేవనకొండ: కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకుంటామని కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బి.వై.రామయ్య అన్నారు. బుధవారం ఆయన దేవనకొండ, నెల్లిబండ, ఓబులాపురం, గద్దరాళ్ళ గ్రామాలలో పర్యటించారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.విరుపాక్షి, ఆలూరు దేవనకొండ మండల నాయకులు పాల్గొన్నారు.

News April 3, 2024

తిరుపతి: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నర్సింగ్ ప్రాక్టీషనర్-01, వార్డు అసిస్టెంట్-01 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 08.

News April 3, 2024

విశాఖ: ‘వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు’

image

ఒకరు విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, మరొకరు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ యాదృచ్ఛికంగా సంపత్ వినాయగర్ ఆలయంలో కలుసుకున్నారు. పార్టీలను పక్కనపెట్టి ఒకరికొకరు కాసేపు ముచ్చటించుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో తనను బలపరచాలని వాసుపల్లి విజ్ఞప్తి చేశారు.

News April 3, 2024

13000 మంది ఉద్యోగులతో జీరో రీ పోల్ సాధ్యం: కలెక్టర్

image

జిల్లాలోని 13000 ఎన్నికల సిబ్బంది ఎన్నికల రోజూ బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే జీరో రీ పోల్ సాధ్యమని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలను రిటర్నింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

News April 3, 2024

43 శాతం సామాజిక ఫించన్ పంపిణీ పూర్తి

image

తిరుపతి జిల్లాలో గురువారం సామాజిక ఫించన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ మాసంకు గాను జిల్లా వ్యాప్తంగా 2,71,477 సామాజిక భద్రత పెన్షనర్లకు సచివాలయాల పరిధిలో సాయంత్రం 7 గంటల వరకు 1,16,958 (43%) పెన్షన్ల పంపిణీ జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన వారికి సైతం శుక్రవారం కూడా పంపిణీ చేస్తామని వివరించారు.

News April 3, 2024

సూళ్లూరుపేట: పెన్షన్ కోసం వచ్చి మహిళ మృతి

image

పెన్షన్ కోసం వచ్చి ఓ మహిళ మరణించిన ఘటన బుధవారం సూళ్లూరుపేట పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… సూళ్లూరుపేట పట్టణం సాయినగర్‌కు చెందిన లలితమ్మ (58) అనే మహిళ పెన్షన్ కోసం మధ్యాహ్నం నుంచి స్త్రీ శక్తి భవనం వద్ద పడిగాపులు కాచింది. పెన్షన్ ఆలస్యం కావడంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News April 3, 2024

వై.పాలెం: కాంగ్రెస్‌లో చేరిన TDP మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి

image

యర్రగొండపాలెంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. బూదాల అజిత్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమె 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. బుధవారం తాడేపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైపాలెంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేయాలని షర్మిల సూచించారు.