Andhra Pradesh

News April 3, 2024

పవన్ కళ్యాణ్ నేటి తెనాలి పర్యటన రద్దు

image

నేటి సాయంత్రం తెనాలిలో జరగాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాల వల్ల ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తెనాలిలో పర్యటన కోసం పార్టీ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విషయం విధితమే.

News April 3, 2024

సత్య సాయిబాబా ప్రసంగ అనువాదకుడు అనిల్ కుమార్ మృతి

image

సత్య సాయిబాబా ప్రసంగ అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్ కుమార్ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శ్రీ సత్య సాయి స్పెషాలిటీ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మృతిచెందారు. దాదాపు 40 ఏళ్ల పాటు సత్య సాయిబాబా వద్ద అనువాదకుడిగా ఉన్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.

News April 3, 2024

జాతీయ స్థాయి క్యారమ్స్ పోటీలకు లిఖితారెడ్డి ఎంపిక

image

ఈ నెల 6 నుంచి 10 వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరగబోయే 51వ జాతీయ సీనియర్ క్యారమ్స్ పోటీలకు కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారిణి వి.లిఖితారెడ్డి ఎంపికైనట్లు జిల్లా క్యారమ్స్ సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరాజు తెలిపారు. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర జట్టు ఎంపికల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి జాతీయ పోటీలకు ప్రాతినిథ్యం వహించే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు.

News April 3, 2024

విశాఖ: గల్లంతయిన మత్స్యకారులు క్షేమం

image

విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల <<12976842>>ఆచూకీ<<>> లభ్యమయింది. వారంతా అప్పికొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఆరుగురు క్షేమంగా ఉన్నారని తెలియడంతో మత్స్యకార కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అలల ఉద్ధృతికి సముద్రంలో బోటు బోల్తా పడటంతో వారంతా దానిపై భాగంలో ఉండిపోయారు. రాత్రి అప్పికొండ సముద్ర తీరానికి చేరుకున్నట్లు వారు సమాచారం అందించారు.

News April 3, 2024

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య స్పెషల్ ట్రైన్

image

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య వీక్లీ AC స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారి ఏకే త్రిపాఠి తెలిపారు. హౌరా – యశ్వంత్ పూర్ (02863) ట్రైన్ ఈ నెల 4,11 తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రారంభమయ్యి, మరుసటి రోజు 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయల్దేరి అదేరోజు రాత్రికి 12.15 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్ 6,13 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు.

News April 3, 2024

కాకినాడ: కమ్యూనిటీ భవనంలో డెడ్‌బాడీ కలకలం

image

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలోని ఓ కమ్యూనిటీ హాల్ నందు మృతదేహం కలకలం రేకెత్తిస్తోంది. బుధవారం ఉదయం స్థానికులు కమ్యూనిటీ హాల్లో ఒక వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News April 3, 2024

పొన్నూరు వద్ద ఆటో ఢీ.. వ్యక్తి మృతి

image

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు వద్ద జిబిసి రోడ్డుపై మంగళవారం ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లలూరుకు చెందిన చందు సురేంద్ర ద్విచక్ర వాహనంపై వస్తుండగా పొన్నూరు నుంచి గుంటూరు వెళుతున్న టాటా మ్యాజిక్ ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2024

ఉత్పత్తి, అమ్మకాల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రగతి

image

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2023-24లో ఉత్పత్తి, అమ్మకాల్లో ప్రగతి కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరంలో వైర్‌ రాడ్‌ కాయిల్స్‌ 7.30 లక్షల టన్నులు, స్ట్రక్చరల్స్‌ 5.08 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి మందు ఏడాది కంటే వృద్ధి సాధించింది. వినియోగదారులకు డోర్‌ డెలివరీ ప్రాతిపదికన 90 వేల టన్నుల ఉత్పత్తులను సరఫరా చేసింది. సీఎండీ అతుల్‌ భట్‌ సిబ్బంది, అధికారులు అభినందించారు.

News April 3, 2024

నెల్లూరు: వైసీపీ ప్రచారంలో హోంగార్డు..?

image

జిల్లాలోని కొండాపురం మండలం పెరికిపాలెంలో వైసీపీ ప్రచారం జరిగింది. ఇందులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే ఏ ఒక్కరూ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

News April 3, 2024

టీడీపీ నేతకు కండువా కప్పిన CM జగన్

image

చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన టీడీపీ నేత, జడ్పీ మాజీ ఛైర్మన్ ఎం.సుబ్రహ్మణ్యం నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి సీఎం జగన్ బస చేసిన అమ్మగారిపల్లె వద్దకు వెళ్లారు. జగన్ ఆయనకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్యం నాయుడితో పాటు మరికొందరు ఫ్యాన్ గూటికి చేరారు.