Andhra Pradesh

News April 3, 2024

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని చుక్కలూరులో రైతు మిద్దె గోపాల్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2024

పరవాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో లంకెలపాలెం సబ్బవరం రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన సహదీప్ (52) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సహదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు స్మైల్ ఎక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బాలసూర్యారావు తెలిపారు.

News April 3, 2024

గుంటూరు అదనపు ఐజీగా అశోక్‌ కుమార్‌ బాధ్యతలు

image

ఏలూరు ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌కు గుంటూరు రేంజ్‌ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్‌ కుమార్‌ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 3, 2024

తిరువూరు కాంగ్రెస్ అభ్యర్థి తాంతియా కుమారి

image

తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా లాం. తాంతియా కుమారిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర మాజీమంత్రి కోనేరు రంగారావు కుమార్తెగా తాంతియా కుమారి ప్రజలకు సుపరిచితులు. సోషియాలజీలో పీజీ చేసిన ఈమె 2014లో రాష్ట్ర సమాచార కమిషనర్‌గా, 2023లో ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన తండ్రి ఆశయ సాధన కోసం తిరువూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

News April 3, 2024

అరసవల్లి: కిడ్నీ నుంచి 6సె.మీ రాయి తొలగింపు

image

రోగి కిడ్నీ నుంచి తొలగించిన 6 సెంటీమీటర్ల రాయి నగరంలోని గ్లోబల్ న్యూరోకేర్ ఆస్పత్రి వైద్యులు బొడ్డేపల్లి యోగేష్ (యూరాలజిస్ట్), డా.గొనప భవానిల ఆధ్వర్యంలో ఓ రోగి కిడ్నీ నుంచి ఏకంగా 6 సెంటీమీటర్ల రాయిని తొలగించారు. ఈ విషయాన్ని ఎండీ దేవిరెడ్డి గౌతమ్ మంగళవారం తెలిపారు. సాధారణంగా కిడ్నీలో 0.5 సె.మీ రాయి ఉంటేనే శస్త్రచికిత్సలు చేస్తామని, అలాంటిది అరుదుగా 6 సె.మీ ఉండడం గుర్తించి తొలగించామన్నారు.

News April 3, 2024

కడప: ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

చాపాడు మండల పరిధిలోని పల్లవోలు గ్రామానికి చెందిన విద్యార్థిని నాగేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 3, 2024

ఆనం ఫ్యామిలీకే తక్కువ మెజార్టీ..!

image

ఆనం సంజీవ రెడ్డి 1958లో కాంగ్రెస్ తరఫున ఆత్మకూరులో పోటీ చేశారు. కేవలం 45 ఓట్ల తేడాతో MLAగా గెలిచారు. జిల్లాలో ఇప్పటి వరకు తక్కువ మెజార్టీ ఆయనదే. 1962లో వి.వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి 86 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు. 2009లో నెల్లూరు సిటీలో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి(PRP) కేవలం 90 ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్(CONG)పై గెలిచారు. తాజా ఎన్నికల్లో ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందా?

News April 3, 2024

తూ.గో.: 3 పార్లమెంటు స్థానాల్లో.. 3 పార్టీలు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3పార్లమెంట్ స్థానాల నుండి TDP- జనసేన- బీజేపీ కూటమిలోని 3 పార్టీలు పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొంది. కాకినాడ నుండి జనసేన అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, రాజమండ్రి నుండి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురందీశ్వరి బరిలో నిలిచారు. అమలాపురం నుండి టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఉన్నారు. మరి గెలుపు మూడు పార్టీల అభ్యర్థులను వరించేనా..? మీ కామెంట్.?

News April 3, 2024

కర్నూలులో వ్యక్తి దుర్మరణం

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు కర్నూలు ట్రాఫిక్ సీఐ గౌతమి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు బైక్‌పై కురువ బాలన్నగారి ఆదినారాయణ, తన అల్లుడు గిడ్డయ్య కలిసి వెళ్తుండగా హ్యాంగ్ అవుట్ హోటల్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న ఆదినారాయణ అక్కడికక్కడే చనిపోయారు. గిడ్డయ్యకు గాయాలు కావడంతో కర్నూలు GGHకు తరలించామని తెలిపారు.

News April 3, 2024

VZM: గల్లంతయిన మత్స్యకారులు క్షేమం

image

విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన భోగాపురం మండలం ముక్కాం గ్రామానికీ చెందిన మత్స్యకారుల <<12977348>>ఆచూకీ <<>>లభ్యమయింది. వారంతా అప్పికొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఆరుగురు క్షేమంగా ఉన్నారని తెలియడంతో మత్స్యకార కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అలల ఉద్ధృతికి సముద్రంలో బోటు బోల్తా పడటంతో వారంతా దానిపై భాగంలో ఉండిపోయారు. రాత్రి అప్పికొండ సముద్ర తీరానికి చేరుకున్నట్లు వారు సమాచారం అందించారు.