Andhra Pradesh

News September 18, 2024

కడప: వరద బాధితులకు 1వ తరగతి విద్యార్థిని విరాళం

image

విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం 1వ తరగతి విద్యార్థిని తన పాకెట్ మనీని విరాళంగా అందించింది. వివరాలిలా ఉన్నాయి. పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం.వర్ణిక వరద బాధితులను చూసి చలించి పోయింది. వారికి సహాయం చేయాలని అనుకుంది. ఈ క్రమంలో తన బాబాయి ప్రణీత్ కుమార్‌తో కలిసి బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌కు తన పాకెట్ మనీ రూ.72,500 విరాళంగా అందించింది.

News September 18, 2024

SKLM: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News September 18, 2024

వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి

image

వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కాకాణికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి పార్టీ మారడంతో జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. తాజాగా ఆయనను నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

News September 18, 2024

నంద్యాల: కాలువలో పడి బాలుడి మృతి

image

శిరివెళ్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కాశిరెడ్డి నాయన దేవాలయం సమీపంలోని కాలువలో పడి శంకరయ్య(13) అనే బాలుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన గురుమూర్తి, సుంకమ్మ కుమారుడు శంకరయ్య నిన్నటి నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా ఆలయం పక్కన ఉన్న కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

News September 18, 2024

భీమిలి: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి

image

భీమిలి మండలం నారాయణరాజుపేట గ్రామంలో విషాదం నెలకొంది. రౌడి గ్రామంలోని నర్సరీ చదువుతున్న బి.వేణు తేజ(5) బస్సు దిగి వెనుక వైపు నిల్చున్నాడు. గమనించని డ్రైవర్ రివర్స్ చేయగా.. ఆ బాలుడు బస్సు వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. బస్సు ఆ చిన్నారి తలపై నుంచి వెళ్లిపోయింది. బస్సు‌కు క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News September 18, 2024

బాలినేని వైసీపీ వీడటానికి ఇవి కూడా కారణమయ్యాయా..?

image

బాలినేని శ్రీనివాసరెడ్డి 1999నుంచి చాలా ఏళ్లు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్, వైసీపీలోనూ ఆయన హవా కొనసాగింది. కాగా, YCP ప్రభుత్వ హయాంలో క్యాబినేట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోవడం, ఆయన సూచించిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్ఠానంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. మరోవైపు, తాజా ఎన్నికల్లో ఓటమి, ఇతరత్రా కారణాలతో ఆయన వైసీపీని వీడినట్లు తెలుస్తోంది.

News September 18, 2024

రేగిడి: సూసైడ్‌ లెటర్‌ రాసి విద్యార్థి ఆత్మహత్య

image

రేగడి ఆమదాలవలస అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన గోగుల యోగేశ్వరరావు(20) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అతడు సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లు ఎస్సై నీలావతి తెలిపారు. ‘దానిలో తాను కెరియర్లో సక్సెస్ అవ్వలేక పోతున్నా, కుటుంబ సభ్యులను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రయత్నించా, కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నా’ అంటూ విద్యార్థి రాశాడు.

News September 18, 2024

విశాఖ: ‘పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు ఎన్.పి.ఎస్ వాత్సల్య’

image

పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్.పి.ఎస్ వాత్సల్య యోజన పథకం ఎంతో దోహదపడుతుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం ప్రారంభించారు. సిరిపురం వద్ద ఎస్బీఐ పరిపాలన విభాగంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ పథకం దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తుందన్నారు.

News September 18, 2024

తూ.గో.: చిరుత కోసం అదనపు బోన్లు ఏర్పాటు

image

సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలలో బుధవారం చిరుత కదలికలు గుర్తించలేదని అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ట్రాప్ కెమెరాలను మారుస్తూ అదనపు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులలో కుక్కలు చిక్కుకుంటున్నాయని, దాని వల్ల ఇబ్బంది కలుగుతుందన్నారు. నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ కాలేదని, దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే చిరుత ఉందన్నారు.

News September 18, 2024

కుప్పంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

image

కుప్పం చెరువు కట్టపై బుధవారం ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముగ్గురు విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నారని సమాచారం. మృతి చెందిన విద్యార్థులు ‌మదనపల్లె, తిరుపతికి చెందిన వారుగా పోలీసులు ‌గుర్తించారు. అర్బన్ సీఐ జీటీ నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.