Andhra Pradesh

News April 2, 2024

విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.

News April 2, 2024

సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సంఘం సలహాదారుపై కేసు నమోదు

image

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సంఘం సలహాదారు చంద్రశేఖర్ రెడ్డిపై తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెలగపూడి సచివాలయంలో గత నెల 26న జరిగిన విలేకరుల సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి మాట్లాడినట్లు, టీడీపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా తుళ్ళూరు సీఐ సుభాని సెక్షన్ 188, 171F కింద కేసు నమోదు చేశారు.

News April 2, 2024

విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.

News April 2, 2024

విశాఖ: గోవులతో ఉన్న కంటైనర్ సీజ్

image

నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ సమీపంలో కబేళాకు గోవులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ మోహన్, నక్కపల్లి సీఐ విజయ్ కుమార్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక కంటైనర్ తనిఖీ చేయగా.. అందులో 65 గోవులున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కంటైనర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

News April 2, 2024

శ్రీకాకుళంలో టీచర్ సస్పెండ్

image

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ వేంకటేశ్వర రావు మంగళవారం తెలిపారు. శ్రీకాకుళంలోని తుమ్మావీధి మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న పప్పాల సత్యనారాయణ రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వార్తా పేపర్‌లో వచ్చింది. విచారణ చేపట్టిన ఎంఈఓ దానిని ధ్రువీకరించారు. దీంతో టీచర్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 2, 2024

ఉదయగిరి: పింఛన్ కోసం పడిగాపులు కాసి వృద్ధుడు మృతి

image

ఉదయగిరి మండల పరిధిలోని కొండయ్యపాలెం పంచాయతీ వీరారెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన స్వర్ణ లక్ష్మయ్య అనే వృద్ధుడు మృతి చెందారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటింటికి తెచ్చి పెన్షన్లు అందజేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లు వ్యవస్థను పక్కన పెట్టింది. దీంతో పెన్షన్ మీదే ఆధారపడే ఈ వృద్ధుడు ఉండబట్టలేక కొండాయపాలెం సచివాలయం వెళ్లి విచారించి తిరిగి ఇంటికి వచ్చే లోగా ప్రాణం వదిలారు.

News April 2, 2024

ధర్మవరంలో మార్పు కోసం వస్తున్నా: సత్యకుమార్

image

ధర్మవరంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు అంతం చేయడానికి ఈ నెల 4న ప్రజల ముందుకు వస్తున్నట్లు కూటమి అభ్యర్థి సత్యకుమార్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అనంతపురం నుంచి ర్యాలీగా బయల్దేరతామన్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటానని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సత్యకుమార్ కోరారు.

News April 2, 2024

ఆ ఘనత సీఎం జగన్ దక్కుతుంది: జెడ్పీ చైర్మన్

image

పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతనతో వైసీపీ మేమంతా సిద్ధం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, ఎంపీ అభ్యర్థి తనుజ పాల్గొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారిని లక్షాధికారులుగా చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అన్నారు

News April 2, 2024

పిచ్చాటూరు: కన్నతల్లిని గొంతు కోసిన కసాయి కొడుకు

image

ఆస్తి తగాదాలతో కన్నతల్లి గొంతు కోసి చంపిన ఘటన పిచ్చాటూరు మండలంలోని అడవి కొడియంబేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. రాజమ్మ (80) రెండో కొడుకు కృష్ణారెడ్డి, అతని కొడుకులు కలిసి రాజమ్మతో గొడవ పడి గొంతు కోసి చంపి పరారైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖలో ఈనెల 3న జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.