Andhra Pradesh

News April 2, 2024

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఇచ్చాపురం – వసుపత్రి చక్రవర్తిరెడ్డి, పలాస – మజ్జి త్రినాథ్ బాబు, పాతపట్నం – కొప్పురోతు వెంకటరావు, శ్రీకాకుళం – పైడి నాగభూషణరావు, ఆమదాలవలస – సనపల అన్నాజీరావు, ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు, నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి, రాజాం – కంబాల రాజవర్దన్, పాలకొండ – చంటిబాబు.

News April 2, 2024

తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశా బదిలీ

image

తిరుపతి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ లక్ష్మీశాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ప్రతిపక్ష పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా వారిలో కలెక్టర్ లక్ష్మీశా ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు ఎస్‌పీ జాషువాను కూడా బదిలీ చేశారు.

News April 2, 2024

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బదిలీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న పరమేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఎస్పీని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News April 2, 2024

నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి బదిలీ

image

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

News April 2, 2024

కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు బదిలీ

image

కృష్ణా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ రాజాబాబును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ప్రతిపక్ష పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా వారిలో కలెక్టర్ రాజాబాబు ఉన్నారు. 2023 ఏప్రిల్ 15న కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈయన అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

News April 2, 2024

రాజమండ్రి ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి నేపథ్యం ఇదే..

image

రాజమండ్రి ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ అధిష్ఠానం మంగళవారం ఖరారు చేసింది. అమలాపురం ప్రాంతానికి చెందిన రుద్రరాజు కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. YS షర్మిల రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యే వరకూ ఆయనే కొనసాగారు. అనంతరం 2024 జనవరి 16న రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.

News April 2, 2024

YCP అరాచకపాలనకు రోజులు దగ్గర పడ్డాయి: సత్యకుమార్

image

ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ TDP అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్లు సత్యకుమార్ ‘X’లో పోస్ట్ చేశారు. YCP అరాచకపాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. మోదీ నేతృత్వంలో, పవన్ సహకారంతో.. చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానున్నట్లు వివరించారు. అంధకారం తొలిగి వెలుగులు ప్రసరించనున్నట్లు సత్యకుమార్ పేర్కొన్నారు.

News April 2, 2024

విశాఖ: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి తొలి విడతలో ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా విశాఖ, అనకాపల్లి, అరకు ఎంపీ అభ్యర్థులతో పాటు మరో 9 నియోజకవర్గల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
✒ విశాఖ ఈస్ట్- గుత్తుల శ్రీనివాసరావు
✒ మాడుగుల- బీబీఎస్ శ్రీనివాసరావు
✒ పాడేరు(ST)- శటక బుల్లిబాబు
✒ అనకాపల్లి- ఇల్లా రామ గంగాధరరావు
✒ పెందుర్తి- పిరిడి భగత్
✒ పాయకరావుపేట(SC)- బోని తాతారావు

News April 2, 2024

ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో భాగంగా రిజర్వ్‌డు స్థానాలైన బద్వేలు నుంచి విజయ జ్యోతి, రైల్వే కోడూరు నుంచి గోసుల దేవితో పాటు రాయచోటి నుంచి అల్లా బకాష్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది.

News April 2, 2024

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థలును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీరిలో దర్శి నుంచి కొండారెడ్డి, అద్దంకి నుంచి కిషోర్ బాబు, ఒంగోలు నుంచి రమేశ్ బాబు, కొండపి నుంచి సతీశ్, మార్కాపురం నుంచి షేక్ సైదా, గిద్దలూరు నుంచి పగడాల పెద్ద రంగస్వామి, కనిగిరి నుంచి కదిరి భవాని బరిలో నిలిచారు. ఈ మేరకు పీసీసీ ఛీఫ్ షర్మిలా ప్రకటన విడుదల చేశారు.