Andhra Pradesh

News April 2, 2024

తిరుపతి: ఓటు నమోదుకు 14 వరకు అవకాశం

image

18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం ఈ నెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జీ.లక్ష్మీశ సూచించారు. మార్చి 16వ తేదీ వరకు జిల్లాలో 17.94 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో కొత్తగా ఓట్లు పొందిన యువకులు 30,508 మంది ఉన్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News April 2, 2024

కృష్ణా జిల్లాలో ఈనెల 7న చంద్రబాబు పర్యటన

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 7వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభను నిర్వహించబోతున్నారు. అయితే సత్తెనపల్లి నుంచి పామర్రులోకి ప్రవేశించి.. ఉయ్యూరు సెంటర్‌లో ప్రజాగళం భారీ బహిరంగ సభను చంద్రబాబు నిర్వహించనున్నారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

News April 2, 2024

అనంత: అసమ్మతి నేతలను బుజ్జగించిన సీఎం జగన్

image

సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులును వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వ్యక్తిని చూసుకోకుండా వ్యవస్థను చూసి పనిచేయాలని జగన్ కోరినట్లు తెలిసింది. జగన్‌ను కలిసిన వారిలో శింగనమల నియోజకవర్గం వైసీపీ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, తరిమెల గోకుల్ రెడ్డి, చెన్నంపల్లి రాజన్న, చాములూరు రాజగోపాల్, తదితరులు ఉన్నారు.

News April 2, 2024

31 ఓట్ల అత్యల్ప మెజార్టీతో MLAగా ఎన్నిక

image

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1952-2019 వరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 1987వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈలి వరలక్ష్మి.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పి.కనక సుందరరావుపై 31 ఓట్ల అత్యల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరలక్ష్మికి 42,062 ఓట్లు రాగా.. కనక సుందరరావుకు 42,031 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యల్ప మెజార్టీ.

News April 2, 2024

బాపట్ల: పాము కాటుతో చిన్నారి మృతి

image

పిట్టలవానిపాలెం మండలంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఖాజీపాలెం గ్రామ పంచాయతీ ఎస్టీ కాలనీలో పాము కాటుకు గురై 12 ఏళ్ల  బాలిక మృతి చెందింది. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

శ్రీకాకుళం: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

image

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మన్యం జిల్లావాసిని హత్య చేసిన ఘటన ఒడిశాలోని పర్లాఖెముండిలో జరిగింది. గురండి పోలీసుల కథనం మేరకు.. భామిని మండలం బట్టిపురం గ్రామానికి చెందిన లింగరాజు(28), జయలక్ష్మి దంపతులు. ఆమెకు మన్యం జిల్లా బత్తిలికి చెందిన ఉపేంద్రతో వివాహేతర సంబంధం ఉంది. లింగరాజును గురువారం తన స్వగ్రామంలో జరిగిన వివాహానికి భార్య తీసుకెళ్లింది. పథకం ప్రకారం 53 సార్లు పొడిచి చంపారు.

News April 2, 2024

పెడన వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పెడన-మచిలీపట్నం బైపాస్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. తోటమూల సెంటర్ నుంచి బైపాస్ రోడ్డులో AP39 TU 3126 నెంబర్ గల TVSపై మచిలీపట్నం వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

తాగునీటికి సమస్య ఉండకూడదు: కలెక్టర్

image

ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సిబ్బందికి ఆదేశించారు. తాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, నీటి నిల్వలకు అనుగుణంగా వేసవి మొత్తం సరఫరాకు చేసేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. రానున్న రోజులలో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 2, 2024

పెదకూరపాడులో 30 మంది వాలంటీర్లు రాజీనామా

image

మండల వ్యాప్తంగా సుమారు 30 మంది వాలంటీర్లు తమ వాలంటరీ పోస్టులకు రాజీనామా చేసినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. మండల వ్యాప్తంగా సోమవారం పొడపాడు, హుస్సేనగరం, ముసాపురం, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లోని వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వాలంటరీ పోస్ట్‌లకు రాజీనామా తెలిపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని ఎలక్షన్ల సమయంలో అవ్వ తాతలకు అందించలేకపోయామనే బాధతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

News April 2, 2024

శ్రీకాకుళం: 1210 మందితో పది మూల్యాంకనం

image

పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల కేంద్రాలుగా స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. తొలిరోజు 7 సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం చేపట్టారు. 1210 మంది హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.