Andhra Pradesh

News April 2, 2024

అన్న అన్నమయ్యలో.. చెల్లి కడపలో పర్యటన

image

ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. అలాగే వైఎస్ షర్మిల కడపలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే.. షర్మిల కూడా ఇవాళ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. షర్మిల కూడా ప్రచారాన్ని ఇడుపులపాయ నుంచే మొదలు పెట్టే అవకాశం ఉంది.

News April 2, 2024

కర్నూలు: రెండు ప్యాసింజర్ రైళ్లు రద్దు

image

గుంతకల్లు నుంచి కాచిగూడకు వెళ్లే ప్యాసింజర్ రైలు(07671) సోమవారం నుంచి రద్దైనట్లు డోన్ రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. కాచిగూడ నుంచి గుంతకల్లుకు వెళ్లే ప్యాసింజర్ రైలు (07670) మంగళవారం నుంచి మే ఒకటో తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ డివిజన్‌లోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల్లో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతుండటంతో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News April 2, 2024

విశాఖ: ‘రేపటి నుంచి పింఛన్ల పంపిణీ’

image

సామాజిక పింఛన్లను ఈనెల మూడవ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సామాజిక పింఛన్లు గ్రామ వార్డు సచివాలయాలు సిబ్బంది పంపిణీ చేస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లు బయోమెట్రిక్ పరికరాలను పంచాయతీ కార్యదర్శిలకు వెంటనే అందజేయాలన్నారు.

News April 2, 2024

ప.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.

News April 2, 2024

విజయవాడ: ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం

image

యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై నున్న రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుందరయ్య నగర్‌కు చెందిన యువతికి మునీంద్రా రెడ్డితో పరిచయం ఉంది. ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

News April 2, 2024

తిరుపతి జిల్లాకు రానున్న సీఎం జగన్

image

తిరుపతి జిల్లాలోని తడ, నాయుడుపేటలో ఈనెల 4న తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సిద్ధం సభ ఏర్పాట్లను కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డితో పాటు పలువుర నాయకులు కలిసి సభాప్రాంగణాన్ని పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

News April 2, 2024

విజయనగరం ఎంపీగా నెగ్గేదెవరు?

image

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు కాగా 3 విభిన్న పార్టీల అభ్యర్థులు గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో TDP నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో YCP నుంచి బెల్లాన చంద్రశేఖర్ MPలుగా గెలిచారు. ఈ సారి YCP నుంచి బెల్లాన మరోసారి పోటీచేస్తుండగా, TDP ఉమ్మడి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు బరిలో దిగారు. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో కామెంట్ చేయండి.

News April 2, 2024

గుంటూరు రైల్వే డివిజన్ చరిత్రలో ఇదే ప్రథమం

image

గుంటూరు రైల్వే డివిజన్‌కు 2024 మార్చి నెలలో రూ.47.9 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అధికమన్నారు. 3.364 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 21.6% వృద్ధి చెందిందన్నారు. దశాబ్దాల చరిత్ర తిరగరాసిందని తెలిపారు.

News April 2, 2024

ప్రకాశం: అక్కడ వైసీపీ ఖాతా తెరవలేదు

image

జిల్లాలో YCP ఆవిర్భావం నుంచి సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసింది. 2014లో మొత్తం 12 స్థానాలకు గాను 6 చోట్ల.. 2019లో 8 చోట్ల గెలిచింది. పర్చూరు, చీరాలలో YCP ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేశ్, TDP నుంచి ఏలూరి సాంబశివ రావు, పర్చూరులో యడం బాలాజీ TDP నుంచి కొండయ్య బరిలో ఉన్నారు. ఈసారి TDP పట్టు నిలుపుకుంటుందా, YCP పైచేయి సాధిస్తుందా అనేది చూడాలి.

News April 2, 2024

కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని ‘మాస్టర్ ఆఫ్ లాస్’ కోర్సు(LLM) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (2022 రెగ్యులేషన్) థియరీ పరీక్షల టైంటేబుల్‌ విడుదలైంది. ఏప్రిల్ 15, 16, 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.