Andhra Pradesh

News April 2, 2024

ఈ నెల 9నుంచి దుర్గగుడి వసంత నవరాత్రోత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నెల 9 నుంచి 18 వరకు, వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు సోమవారం తెలిపారు. ఈ నెల 9న స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ దర్శనానికి ఉదయం 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తారన్నారు. ఉదయం 8.15 గంటలకు లక్ష్మీగణపతి మందిరం వద్ద వసంత నవరాత్రోత్సవాలు కలశస్థాపన, అనంతరం దుర్గమ్మకు పుష్పార్చన ప్రారంభిస్తారన్నారు.

News April 2, 2024

మదనపల్లెలో సీఎం బహిరంగ సభ

image

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మదనపల్లెలో పర్యటించనున్నారు. స్థానిక టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజంపేట MP మిథున్ రెడ్డి, మదనపల్లె అసెంబ్లీ వైసీపీ MLA అభ్యర్థి నిస్సార్ అహ్మద్ లతో కలిసి పలువురు YCP నాయకులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు

News April 2, 2024

విశాఖ: సముద్ర తీరంలో మూడు ముళ్ల బవిరి చేప

image

విశాఖ నగరం రుషికొండ బీచ్ సమీపంలో గల సముద్ర తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు వివిధ ఆకారాల్లో ఉన్న రెండు బవిరి చేపలు చిక్కాయి. వీటి వెన్నుపై ఒక ముల్లు ముందు భాగంలో రెండు ముళ్లు ఉన్నాయి. సముద్రం లోపల సంచరించే ఈ చేపలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ముందుకు వస్తుంటాయని మత్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు.

News April 2, 2024

బాపట్ల: ట్రాన్స్ జెండర్ గొంతు కోసిన ఆగంతుకుడు

image

చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ కొల్లూరులోని ఓ దుకాణం వద్ద చందా తీసుకుంటుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆగంతుకుడు ఆమె వెనుకగా వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె బయపడి అతని చెంపపై కొట్టింది. దీంతో అతడు పదునైన ఆయుధంతో గొంతుపై గాయం చేసి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

విశాఖ: సముద్ర తీరంలో మూడు ముళ్ల బవిరి చేప

image

విశాఖ నగరం రుషికొండ బీచ్ సమీపంలో గల సముద్ర తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు వివిధ ఆకారాల్లో ఉన్న రెండు బవిరి చేపలు చిక్కాయి. వీటి వెన్నుపై ఒక ముల్లు ముందు భాగంలో రెండు ముళ్లు ఉన్నాయి. సముద్రం లోపల సంచరించే ఈ చేపలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ముందుకు వస్తుంటాయని మత్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు.

News April 2, 2024

అనంతపురం జిల్లాలో రూ.86.58 కోట్లు పింఛన్ నిధులు మంజూరు

image

అనంతపురం జిల్లాలో 2,89,131 మంది లబ్దిదారులకు మొత్తం రూ.86.58 కోట్లు నిధులు పించన్ మంజూరైనట్లు పీడీ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో వృద్ధులు 1,45,839 మందికి గాను రూ.43.75 కోట్లు, వితంతువులు 66,868 మందికి రూ.20 కోట్లు, విభిన్న ప్రతిభావంతులు 46,664 మందికి రూ.13.99 కోట్లు, చేనేతలు 6,793 మందికి రూ.2 కోట్లు, ఒంటరి మహిళలు 6,744 మందికి రూ.2 కోట్లు 3వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు.

News April 2, 2024

నంద్యాల: భూమా అఖిల ప్రియపై కేసు

image

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియపై ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఎస్ఐ రామాంజనేయులు రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మార్చి 28న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన అనుమతులు పాటించకుండా డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారి రఘురాం ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.

News April 2, 2024

శ్రీకాకుళం: ఓ ఇంటిలోకి చొరబడిన ఎలుగుబంటి

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి మంగళవారం తెల్లవారుజామున ఎలుగుబంటి చొరబడి హల్‌చల్ చేసింది. గమనించిన స్థానికులు భయంతో వణుకుతూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల కాలంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు.

News April 2, 2024

నెల్లూరు: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ప్రభుత్వ టీచర్‌పై వేటు

image

వరికుంటపాడు మండలం రామదేవులపాడులో రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ విజయసంకల్ప యాత్రలో వింజమూరు మండలం నందిగుంట ఉపాధ్యాయుడు జక్కం మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపై నోడల్ అధికారి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతయ్య తెలిపారు.

News April 2, 2024

కూటమిలో BJP కలవాలని నేనూ కృషి చేశా: RRR

image

TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.