Andhra Pradesh

News April 2, 2024

పోలీసు శాఖలో పదవీ విరమణ పొందడం అభినందనీయం: ఎస్పీ

image

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అన్నారు.
సోమవారం పదవీ విరమణ పొందిన కర్నూలు ట్రాఫిక్ ఎస్సై టీఎస్ఎస్.ప్రసాద్ కుమార్‌ను ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు.

News April 2, 2024

తిరుపతి: వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేయండి

image

వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎండ వేడిమి, వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

News April 2, 2024

ఈనెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

ఓటు హక్కు పొందేందుకు ఇదే చివరి అవకాశం అని, ఏప్రిల్ ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఈనెల 14వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లభిస్తుందని, దరఖాస్తు చేసుకుంటే నూతనంగా ఓటు పొందవచ్చునని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను 10 రోజులలో పరిశీలించి కొత్త ఓటు హక్కు కల్పిస్తామన్నారు.

News April 2, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం: డీజీపీ

image

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, సమాచారం సేకరణ వంటి అంశాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి ఎస్పీ జీ.ఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ డీజీపీ జిల్లాలోని పోలింగ్ వద్ద భద్రత వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

News April 2, 2024

నేడు కడపకు రానున్న YS షర్మిల

image

ఏపీసీసీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ తెలియజేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని, సాయంత్రం కడప అమీన్ మెమోరియల్ హాల్ లో నిర్వహించే ఇఫ్తార్ విందుకు ఆమె హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

News April 2, 2024

ఉదయగిరి: అంగన్వాడీ కేంద్రాల పనివేళ్లలో మార్పు

image

ఉదయగిరి అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమయాన్ని ప్రభుత్వం మార్పు చేసిందని సిడిపిఓ పచ్చవ లావణ్య సోమవారం తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మినీ, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలన్నారు. వేసవి సెలవులు కార్యకర్తలకు మే 1 నుంచి 15వ తేదీ వరకు, ఆయాలకు మే 16 నుంచి మే 31వరకు ఉంటాయన్నారు.

News April 2, 2024

సరుకు రవాణాలో సత్తా చాటిన విజయవాడ రైల్వే డివిజన్

image

విజయవాడ రైల్వే డివిజన్ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.4029.08 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డివిజన్ ఏర్పడ్డ అనంతరం సరుకు రవాణాలో ఇదే అత్యధిక ఆదాయమని డివిజన్ అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. బొగ్గు, ఎరువులు, ఆహార పదార్థాలు, స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకులను డివిజన్ నుంచి ఎక్కువగా రవాణా చేశామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

News April 2, 2024

సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ: గుంటూరు కలెక్టర్

image

ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలకు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ పంపిణీపై ఎన్నికల సంఘం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. సచివాలయాలలో పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి లాగిన్లు ఇచ్చామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

News April 2, 2024

సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యం: ఎంపీ

image

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాల్లో సామాన్యుడికి ఒక నిబంధన ముఖ్యమంత్రికి మరో నిబంధననా అని ఆయన ప్రశ్నించారు.

News April 1, 2024

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.