Andhra Pradesh

News September 18, 2024

కర్నూలు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత హి సేవ

image

కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా వ్యాప్తంగా ఊరూరా స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

News September 18, 2024

ప.గో.: మాజీ MLAకు వైసీపీలో కీలక పదవి

image

వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాద్ రాజును నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆయన గతంలో నరసాపురం ఎమ్మెల్యేగా, మాజీ చీఫ్ విప్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

News September 18, 2024

ప.గో. జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ

image

తాడేపల్లి పరిధిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ బుధవారం సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. సమావేశంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

News September 18, 2024

చీరాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి

image

చీరాల నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటుచేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మంత్రి నారా లోకేష్‌ను కోరారు. బుధవారం ఆయన మంత్రిని కలిసి హబ్ ఏర్పాటుకు సంబంధించిన వసతుల గురించి తెలియజేశారు. హబ్ ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుందన్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి హబ్ ఏర్పాటుకు కృషిచేస్తామని లోకేశ్ తెలిపారు.

News September 18, 2024

తిరుపతి: ఈ నెల 20న ఉద్యోగ మేళా

image

తిరుపతి నగరం పద్మావతి పురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 5 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులన్నారు. మొత్తం 190 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 18, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక సరఫరా

image

ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం నుంచి ఉచిత ఇసుక ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో ఇసుక తరలింపుపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తాడిమర్రి మండలం సీసీ రేవు, ముదిగుబ్బ మండలం పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఉందన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ ఉంటుందన్నారు.

News September 18, 2024

చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

చిన్నారుల ఆరోగ్యం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం నంద్యాలలోని పొన్నాపురం కాలనీలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ప్రత్యేక దత్తత కేంద్రం (జిల్లా బాలల సంరక్షణ విభాగం)ను తనిఖీ చేశారు. దత్తత కేంద్రంలోని వసతులు, చిన్నారుల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News September 18, 2024

పాప చికిత్సకు సాయం అందిస్తాం: మంత్రి లోకేశ్

image

జంగారెడ్డిగూడెంలోని ఓ పాపకు డెంగీ, మలేరియా ఇన్ఫెక్షన్ కవాసకి అనే డిసీస్ వచ్చింది. చికిత్స నిమిత్తం సుమారు రూ.6లక్షలు ఖర్చు అవుతోందని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి ధైర్యంగా ఉండమ్మా! పాప ఆరోగ్యం మెరుగుపడేందుకు వైద్య చికిత్సకు సాయం అందిస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు.

News September 18, 2024

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. విమానాశ్రయానికి అల్లూరి పేరును నామకరణం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 18, 2024

కృష్ణా: ఇసుక బుకింగ్‌పై సిబ్బందికి శిక్షణ

image

ఇసుక Online బుకింగ్ విధానంపై గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి పోర్టల్‌ను రేపు ప్రారంభిస్తారన్నారు.