Andhra Pradesh

News April 1, 2024

అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు నిర్వహిస్తాం: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత రశీదు, ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు పాల్గొన్నారు.

News April 1, 2024

సంతనూతలపాడు ఎమ్మెల్యేకు మాతృవియోగం

image

సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ సోమవారం సాయంత్రం మృతి చెందారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో టీజేఆర్ సుధాకర్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

News April 1, 2024

కాకినాడలో పేలిన ఆయిల్ ట్యాంకర్..UPDATE

image

శంఖవరం మండలం కత్తిపూడి శివారు ప్రాంతంలో మరమ్మతుల కోసం తీసుకువచ్చిన ఆయిల్ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలి ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా
మృతులు కత్తిపూడికి చెందిన కొచ్చర్ల ప్రభాకర్ (38), బూరా సోమరాజు(39)గా గుర్తించారు. బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

News April 1, 2024

VZM: ‘టీడీపీ ఇన్‌ఛార్జ్‌కు లోకేశ్ హామీ’

image

జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఉండవల్లిలోని నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా ఇటీవల అలకబూనిన నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజు తన బృందంతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఏదైనా కార్పొరేషన్ పదవితో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఆకిరి ప్రసాద్, కడగల ఆనంద్ తదితరులు ఉన్నారు.

News April 1, 2024

విశాఖ నుంచి తిరుపతికి అవయవాల తరలింపు

image

విశాఖలో ప్రత్యేక గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. విశాఖ జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో కిమ్స్‌లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్‌ ఫ్లైట్‌లో రేణిగుంటకు తరలించారు.

News April 1, 2024

అవనిగడ్డలో టీడీపీ పగ్గాలు చేపట్టేది ఎవరు.?

image

అవనిగడ్డలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. ప్రస్తుతం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేడు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జనసేనలోకి వెళ్లడంతో టీడీపీ పగ్గాలు చేపట్టేది ఎవరో అనే చర్చ మొదలైంది. టీడీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

News April 1, 2024

విశాఖ నుంచి తిరుపతికి అవయవాల తరలింపు

image

విశాఖలో ప్రత్యేక గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలో పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో షీలానగర్‌లో ఉన్న కిమ్స్‌లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్‌ ఫ్లైట్‌లో రేణిగుంటకు తరలించారు.

News April 1, 2024

రేపు పత్తికొండలో కలెక్టర్, ఎస్పీ పర్యటన

image

పత్తికొండలో రేపు (మంగళవారం) కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ పర్యటన ఉంటుందని పత్తికొండ ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి సోమవారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎస్పీ పాల్గొంటారని వెల్లడించారు.

News April 1, 2024

రేపు కడపకు రానున్న YS షర్మిల

image

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఇడుపులపాయ రానున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు తన తండ్రి దివంగత YSR సమాధి వద్ద నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం కడప లోక్ సభ స్థానం నుంచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News April 1, 2024

కర్నూలు: విద్యార్థిపై అన్నం వండిన గంజి పడి ఆస్పత్రి పాలు

image

హోళగుంద: గంజహళ్లిలో అంగన్వాడీ విద్యార్థి మల్లప్పపై అన్నం గంజి పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. అంగన్వాడీ సెంటర్-2లో మల్లప్ప యూరిన్ పోసి వస్తుండగా.. ఆ సమయంలో ఆయా లక్ష్మి అన్నం గంజిని విసిరినట్లు తెలిసింది. చూసుకోకుండా విసిరినట్లు అంగన్వాడీ ఆయా తెలుపగా.. తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డపై గంజి పోసిందంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.