Andhra Pradesh

News April 1, 2024

అనంత: మరణానంతరం నేత్రదానం చేసిన వృద్ధుడు

image

అనంతపురంలోని పాతూరు బ్రాహ్మణ వీధిలో మంజు క్లాత్ స్టోర్ యజమాని అనుముల ఆదినారాయణ వయస్సు రీత్యా సోమవారం మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఆయన నేత్రాలను దానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆడిటర్ ఆదిశేషయ్య, నాగభూషణం, సాయి ట్రస్ట్ సభ్యులు విజయ సాయికుమార్, నారాయణ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

News April 1, 2024

విశాఖ: పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ పీజీ సెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు.
✒ మే 4 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే5 నుంచి 15 వరకు రూ.500, మే15 నుంచి మే25 వరకు రూ.1000 ఫైన్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
✒ ఫీజు:రూ.850(OC), రూ.750(BC),రూ.650(దివ్యాంగులు, SC, ST)
✒ ఎడిట్ ఆప్షన్: మే 27 నుంచి 29 వరకు
✒ హాల్ టికెట్ల డౌన్‌లోడ్: మే 31 నుంచి
✒ పరీక్ష తేదీలు: జూన్ 10 – 14 వరకు
> Share it

News April 1, 2024

పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం: కలెక్టర్

image

సామాజిక పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ చెప్పారు. జిల్లాలో 732 సచివాలయాల ద్వారా ఒక్కో సచివాలయానికి సగటున 456 చొప్పున పెన్షన్లను పంపిణీ చేయవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ హాజరయ్యారు.

News April 1, 2024

ప్రొద్దుటూరులో 23 మంది వాలంటీర్ల రాజీనామా

image

పింఛన్ల పంపిణీ వ్యవస్థపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు పట్టణంలోని 28, 30వ వార్డు సచివాలయాల్లోని 23 మంది వాలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను వార్డు కార్యదర్శికి అందజేశారు. సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి గెలిపించుకునేందుకే తాము ప్రచారం చేస్తామని రాజీనామా చేసిన వాలంటీర్లు తెలిపారు.

News April 1, 2024

రాపూరు: ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయాలు

image

రాపూరు- చిట్వేల్ ఘాట్ రోడ్ 12 కిలోమీటర్ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా నెల్లూరుకి తరలించారు. చిట్వేల్ ఘాటు వద్ద ఉసిరికాయలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులు పంగిలి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

News April 1, 2024

శ్రీకాకుళం: విద్యార్థుల భద్రత కళాశాల యాజమాన్యానిదే : ఎస్పీ

image

కళాశాల, పాఠశాల, వసతి గృహలకు వచ్చిన విద్యార్థి విద్యార్థినీలు ప్రవర్తనను ప్రతి నిమిషం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని ఎస్పీ రాధిక సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె జిల్లాలోని వివిధ కళాశాలలు యాజమాన్యంతో విద్యార్థులు భద్రత, ఆత్మహత్యలు నివారణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బోధనేతారా సిబ్బంది విద్యార్థి విద్యార్థినీలను కౌన్సెలింగ్ నెపంతో పిలిస్తే కాలేజ్ యాజమాన్యంకు చెప్పాలన్నారు.

News April 1, 2024

విశాఖ: ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల

image

రాష్ట్రవ్యాప్తంగా వర్శీటీలు అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ పీజీ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య జి. శశిభూషణరావు తెలిపారు. మే 4వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఈరోజు ఏపీ పీజీ సెట్ చైర్మన్,వీసీ ప్రసాద్ రెడ్డి విడుదల చేసినట్లు తెలిపారు.

News April 1, 2024

ఏలూరు: కళ్ల ముందే భర్త మరణం..

image

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు.. బైక్‌పై వెళ్తున్న దంపతులు వేణి, పవన్ ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో పవన్ అక్కడికక్కడే చనిపోగా వేణికి గాయాలయ్యాయి. భర్త కళ్లముందే చనిపోవడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

News April 1, 2024

ప్రకాశం జిల్లాపై భానుడి ప్రతాపం

image

ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా పీసీపల్లిలో 42.67 డిగ్రీల రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలో 42.40 డిగ్రీలు, మార్కాపురం మండలం దరిమడుగులో 42.30, గుండ్లాపల్లిలో 42.03 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News April 1, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు

image

డోన్ మండలం గోసానిపల్లె సమీపంలో కరివేపాకు తోట మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ప్యాపిలి మండలం కోటకొండకు చెందిన వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు అక్కడికక్కడే మృతిచెందారు. అతని కుమారుడికి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు.