Andhra Pradesh

News April 1, 2024

అంతా సీఎం అనుకున్నట్లే జరిగింది: గంటా

image

డీఎస్సీ విషయంలో అంతా సీఎం జగన్ అనుకున్నట్లే జరిగిందని భీమిలి టీడీపీ MLA అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు విమర్శించారు. ఐదేళ్లపాటు నిద్రపోయి ఎన్నికల ముందు కోడ్ వస్తుందని తెలిసి అడ్డగోలు నిబంధనలతో డీఎస్సీ ప్రకటన ఇచ్చారని ట్విటర్ లో పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ శిక్షణ కోసం నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. జగన్ కుట్ర అందరికీ అర్థమైందని అన్నారు.

News April 1, 2024

కర్నూలు: 44 మందికి షోకాజ్ నోటీసులు

image

కర్నూలు జిల్లా పీవో, ఏపీవో శిక్షణ తరగతులకు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్తికొండ నియోజకవర్గంలో 16 మంది, ఎమ్మిగనూరులో 12 మంది, ఆలూరులో తొమ్మిది మంది, మంత్రాలయంలో ఏడుగురు.. మొత్తంగా 44 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

News April 1, 2024

ఏలూరులో ‘దొంగ డాక్టర్’.. మత్తు ఇంజక్షన్స్ ఇచ్చి చోరీలు

image

ఏలూరు జిల్లాలో ఓ వైద్యుడు మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. చొదిమెళ్లకు చెందిన భానుసుందర్ MBBS చదివాడు. తపాలా శాఖలో రిటైర్డ్ ఉద్యోగి మల్లేశ్వరరావు(63)తో సన్నిహితంగా ఉండేవాడు. గత DEC 24న మల్లేశ్వరరావు ఇంట్లో ఉండగా.. భానుసుందర్ వెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చి డబ్బు, నగలతో ఉడాయించాడు. ఇలాంటి కేసులు ఆ వైద్యుడిపై చాలానే ఉండగా.. మల్లేశ్వరరావు మృతితో అతడి తతంగం బయటపడింది.

News April 1, 2024

అంతా సీఎం అనుకున్నట్లే జరిగింది: గంటా

image

డీఎస్సీ విషయంలో అంతా సీఎం జగన్ అనుకున్నట్లే జరిగిందని భీమిలి టీడీపీ MLA అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు విమర్శించారు. ఐదేళ్లపాటు నిద్రపోయి ఎన్నికల ముందు కోడ్ వస్తుందని తెలిసి అడ్డగోలు నిబంధనలతో డీఎస్సీ ప్రకటన ఇచ్చారని ట్విటర్ లో
పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ శిక్షణ కోసం నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. జగన్ కుట్ర అందరికీ అర్థమైందని అన్నారు.

News April 1, 2024

వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం..

image

వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం 1995లో ఏర్పడింది. అయితే అంతకు ముందు అమృతలూరు నియోజకవర్గంలో ఉండేది. 1965 నుంచి 2004 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉండగా.. 2009లో ఈ నియోజకవర్గం (SC)గా మారింది. అయితే 1955 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు మహిళా అభ్యర్థినులు గెలవలేదు. రాబోవు ఎన్నికల్లో అయినా నియోజకవర్గంలో మహిళలు పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సిఉంది. మరి మీ కామెంట్.

News April 1, 2024

జమ్మలమడుగు బరిలో డాక్టర్ V/s టీచర్

image

రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం YCP నుంచి సిట్టింగ్ MLA డా. మూలె సుధీర్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో జమ్మలమడుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆది నారాయణ రెడ్డి మరోసారి తన హవా కొనసాగించేందుకు కూటమి అభ్యర్థిగా సిద్దమయ్యారు. రాజకీయాలకు ముందు కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశారు. మరి ఇద్దరిలో గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News April 1, 2024

తిరుపతి కానిస్టేబుల్ సస్పెండ్

image

పేకాట ఆడుతూ పట్టుబడ్డ కానిస్టేబుల్‌ను తిరుపతి జిల్లా SP కృష్ణకాంత్ పటేల్ సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం(M) కొల్లాగుంటలోని ఓ మామిడి తోటలో పేకాట ఆడారు. పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పూర్ణచంద్రరావు ఉన్నారు. జూదాన్ని అడ్డుకోవాల్సిన పోలీసే ఇలా చేయడంతో SP సీరియస్ అయ్యారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

News April 1, 2024

అద్దంకి మున్సిపాలిటీ ప్రథమస్థానం

image

ఇంటి పన్నుల వసూళ్లలో అద్దంకి మున్సిపాలిటీ బాపట్ల జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4.55 కోట్ల వసూలు లక్ష్యం కాగా ఆదివారం నాటికి రూ.3.72 కోట్లు వసూలు చేసినట్టు చెప్పారు. జిల్లాలో 81.80 శాతం వసూళ్లతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు.

News April 1, 2024

NLR: వైసీపీ ప్రచారంలో టీచర్..?

image

జిల్లాలోని వరికుంటపాడు మండలం రామదేవులపాడులో జరిగిన వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ టీచర్ పాల్గొన్నారు. వింజమూరు మండలం నందిగుంట ఎంపీయూపీ పాఠశాలలో మోహన్ రెడ్డి టీచర్‌గా పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

News April 1, 2024

విశాఖపట్నం పోర్టు సరికొత్త రికార్డు

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు సరుకు రవాణాలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 81. 09 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిందని పోస్ట్ చైర్మన్ అంగముత్తు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతి ఏడాది నమోదు చేసిన 73.75 మిలియన్ మెట్రిక్ టన్నుల రికార్డును తిరగరాసిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సృష్టించాలని ఆయన సిబ్బందిని కోరారు.