Andhra Pradesh

News April 1, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి పది మూల్యాంకనం

image

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు-2024 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైందని డీఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో స్పాట్‌ పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం పక్కాగా సన్నద్ధమైందన్నారు. తాగునీరు, ఫర్నీచర్‌, లైటింగ్‌, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచమన్నారు.

News April 1, 2024

భీమిలిలో వైసీపీ నేతలు సస్పెండ్

image

వైసీపీలో పదవులు అనుభవిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న భీమిలి జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, శింగనబంద సర్పంచ్ గాడు వెంకటనారాయణను సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. వైసీపీకి వ్యతిరేకంగా ఆదివారం వారు మాట్లాడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మరికొందరిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

News April 1, 2024

ప్రకాశం: మసిలే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం

image

నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన భార్యభర్తలు గత కొద్దిరోజులుగా హనుమాన్ నగర్ 13వ లైన్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడి నీరు పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు వాపోయాడు. కేసు నమోదైంది.

News April 1, 2024

వేమిరెడ్డికి 5 లక్షల మెజారిటీ: కేతంరెడ్డి

image

నెల్లూరు సిటీ 53వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 5 లక్షల మెజారిటీ, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణకు లక్ష మెజారిటీ వస్తుందన్నారు. వైసీపీ మేనిఫెస్టోకు ధీటుగా కూటమి మేనిఫెస్టో అన్నీ వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందన్నారు.

News April 1, 2024

వినుకొండ: మరిగే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం

image

నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మరిగే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వినుకొండలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన భార్యభర్తలు గత కొద్దిరోజులుగా హనుమాన్ నగర్ 13వ లైన్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో లుంగీ కట్టుకొని నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడి నీరు పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు వాపోయాడు. కేసు నమోదైంది.

News April 1, 2024

TPT: ఐజర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

తిరుపతి IISERలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్-ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ), బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సంబంధిత ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఇతర వివరాలకు www.iiseradmissiఓn.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 13.

News April 1, 2024

చిత్తూరు: ఫోటో గుర్తింపు కార్డులతో ఓటేయండి

image

ఓటరు గుర్తింపు కార్డులను చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్తూరు కలెక్టర్ ఎస్.షన్మోహన్ కోరారు. ఎపిక్ కార్డు లేని వారు ప్రత్యామ్నాయంగా ఫోటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆధార్ కార్డ్, ఉపాధి హామీ కార్డ్, బ్యాంక్/ పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్‌లు లాంటి 12 రకాల కార్డులు చూపించి ఓటు వేయవచ్చని సూచించారు.

News April 1, 2024

ప్రకాశం: నియోజకవర్గ కేంద్రాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు

image

రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నా, ఫిర్యాదులు ఉన్న వెంటనే తెలిపేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
ఒంగోలు -08592-288099, సంతనూతలపాడు-08592-273100, కొండపి -085982-94717, దర్శి -8639370180, మార్కాపురం-9281034442, గిద్దలూరు -8639483409, ఎర్రగొండపాలెం- 6281735787, జిల్లా సీసీఆర్-08692-288599.

News April 1, 2024

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎస్పీ

image

ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతును నిర్వహించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

News April 1, 2024

తెలుగుదేశంతోనే బీసీలకు పెద్దపీట: భూపేశ్ రెడ్డి

image

బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ తెలుగుదేశం అని కడప పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపేశ్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరులోని స్థానిక పద్మశాలి కళ్యాణ మండపంలో బీసీల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలన్నారు. ప్రొద్దుటూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.