Andhra Pradesh

News April 1, 2024

అంతరాష్ట్ర బోర్డర్ చెక్ పోస్టులలో ముమ్మరంగా తనిఖీలు

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అంతరాష్ట్ర సరిహద్దులలో జిల్లా పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆదివారం రాత్రి ఎస్పీ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోకి, పట్టణాలలో ప్రవేశించి బస్సులు, లారీలు, కార్లు, తదితర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు నగలను స్వాధీనం చేసుకుంటున్నారు.

News April 1, 2024

హెడ్ కానిస్టేబుల్‌ను సన్మానించిన బాపట్ల ఎస్పీ

image

ఏ.ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన కె.వి. సుబ్రహ్మణ్యంని ఆదివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా సన్మానించారు. అనంతరం 40 సంవత్సరాల పాటు వివిధ విభాగాలలో పోలీస్ శాఖకు విశేష సేవలు అందించి పదవి విరమణ పొందిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ కె.వి. సుబ్రహ్మణ్యంని జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు వారి కుటుంబసభ్యుల సమక్షంలో దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.

News April 1, 2024

VZM: ‘ఏప్రిల్ 14లోగా ఓటుకోసం దర‌ఖాస్తు చేసుకోవాలి’

image

18 సంవత్సరాలు నిండినవారంతా ఏప్రిల్ 14వ తేదీలోగా ఓటుకోసం దర‌ఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వాటిని ప‌రిశీలించి 10 రోజుల్లో నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుందన్నారు. వీరికి మాత్ర‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త‌గా ఓటేసే అవ‌కాశం ల‌భిస్తుందని, అర్హ‌త ఉన్న‌వారంతా ఓటు హ‌క్కు పొంద‌డ‌మే కాకుండా, ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోవాలని సూచించారు.

News April 1, 2024

విజయవాడ: నేటినుంచి మొదలు కానున్న దరఖాస్తు ప్రక్రియ

image

విజయవాడ మధురా నగర్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 2024- 25 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో అడ్మిషన్లకై నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తును https://no1vijayawada.kvs.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ప్రిన్సిపాల్ ఆదిశేషవర్మ తెలిపారు. 1వ తరగతిలో అడ్మిషన్‌ కై మార్చి 2024 నాటికి 6 నుంచి 8 సంవత్సరాల వయసున్న పిల్లలు ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 31, 2024

చంద్రబాబు వృద్ధుల ద్రోహి: VSR

image

ఒకటో తేదీన వృద్ధులకు పింఛన్ అందకుండా చేసిన ద్రోహి చంద్రబాబు అని వైసీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR) మండిపడ్డారు. నెల్లూరు 5వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల్లో హైవే అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరుకు చుట్టపు చూపునకు వస్తున్న నారాయణకు వ్యతిరేకంగా ఓటు వేసి నెల్లూరు ప్రజల సత్తా చూపించాలన్నారు.

News March 31, 2024

పెడనలో అత్యధిక మెజారిటీ రికార్డు బద్దలయ్యేనా..

image

2008లో ఏర్పడ్డ పెడన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో టీడీపీ తరఫున దివంగత కాగిత వెంకట్రావు 13,694 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా వెంకట్రావు కుమారుడు కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి బరిలో ఉండగా.. వైసీపీ ఉప్పాల రాముకు టికెట్ ఇచ్చింది. తాజా ఎన్నికల్లో వెంకట్రావు రికార్డు చెరిగిపోతుందా.. మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.

News March 31, 2024

వివాదాస్పద పోస్టులు పెడితే చర్యలు తప్పవు: ఎస్పీ

image

ఎన్నికల వేళ సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచామని, వివాదాస్పద పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని అనంత ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాలలో పాటించాల్సిన నియమ నిబంధనలు, సూచనలపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో తప్పుదారి పట్టించే సమాచారాన్ని పెడితే చర్యలు తప్పవన్నారు.

News March 31, 2024

కొండపి: చెట్టును ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి

image

కొండపి మండలంలోని నేతివారిపాలెం సాయిబాబా గుడి వద్ద ప్రమాదం జరిగింది. చీమకుర్తి మండలానికి చెందిన ఇద్దరు యువకులు జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ గుడికి బైక్‌పై వెళ్లి వస్తూ మద్యం మత్తులో చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో రాగం చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తరలించారు. ఘటనా స్థలాన్ని కొండపి ఎస్సై కృష్ణబాజీ పరిశీలించారు.

News March 31, 2024

గంజాయి మత్తులో యువకుడిపై దాడి

image

నాయుడుపేటలో గంజాయి మత్తులో యువకుడిపై ఆదివారం దాడి జరిగింది. ఓజిలి మండలం గ్రద్దగుంట, నాయుడుపేట మండలం విన్నమాలకు చెందిన కొందరు బీడీకాలనీలో గంజాయి తాగారు. ఈక్రమంలో వారి మధ్య ఘర్షన జరిగింది. మత్తులో గ్రద్దగుంట యువకుడిపై విన్నమాల యువకుడు దాడి చేశాడు. సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

News March 31, 2024

బాపట్ల: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాపట్ల పట్టణంలోని గుంటూరు రహదారిలో గల ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన సదరు వ్యక్తి చంద్రబాబు సభకు వెళుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు.