Andhra Pradesh

News March 31, 2024

కడప: అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

image

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గత కొద్ది నెలల క్రితం పులివెందులలోని జెండా మాను వీధిలో తన భార్యను హత్య చేసిన కేసులో అనుమానితుడిగా కానిస్టేబుల్ ఉన్నాడు. అయితే ఇవాళ ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికుల సమాచారం ద్వారా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.

News March 31, 2024

ధర్మవరంలో విద్యార్థిని సూసైడ్

image

ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన చింత చిదంబరయ్య కుమార్తె చింత రాజేశ్వరి(21) ఆదివారం ఉరివేసుకుని మృతిచెందింది. రాజేశ్వరి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆదివారం కూడా నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో చీరతో ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

News March 31, 2024

కైకలూరు: నాటు తుపాకీ కలిగిన ఇద్దరి అరెస్టు

image

ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కైకలూరు మండలం రామవరం గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల వద్ద 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎటువంటి లైసెన్స్ లేదని పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రూరల్ ఎస్ఐ రామకృష్ణ అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 31, 2024

తూ.గో. జిల్లాలో తొలిసారి బరిలో.. గెలిచి నిలిచేనా..?

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలోని 19స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తొలిసారి పోటీచేస్తున్నవారు 9 మంది ఉండటం విశేషం. జనసేన నుంచి బత్తుల రామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, YCP నుంచి పిల్లి సూర్యప్రకాశ్, TDP నుంచి యనమల దివ్య, వాసంశెట్టి సుభాష్, మిర్యాల శిరీష, ఆదిరెడ్డి వాసు, BJP- శివకృష్ణంరాజు ఉన్నారు. గెలిస్తే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

News March 31, 2024

అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూత

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కింజరాపు కళావతమ్మ (90) ఇవాళ మధ్యాహ్నం చనిపోయారు. కళావతమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఆమె మరణంతో కింజరాపు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 31, 2024

నెల్లూరు: వేసవిలో మండుతున్న పుచ్చకాయ ధరలు

image

జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఉపసమనం పొందేందుకు పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న వ్యాపారులు కిలో 25 రూపాయలు చొప్పున కాయ సైజును బట్టి  రూ.100 నుంచి రూ.150 వరకు  విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో ప్రజలు అధిక రేట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

News March 31, 2024

చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న ఎండలు

image

రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో చిత్తూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పులిచెర్ల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, రామకుప్పంలో అత్యల్పంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 41.7, SRపురంలో 41.4, తవణంపల్లె, నగరిలో 41.1, బంగారుపాళ్యం, పలమనేరులో 41, గుడుపల్లెలో 40.6, పుంగనూరులో 40.3, గుడిపాలలో 40, శాంతిపురం, సదుం, వెదురుకుప్పంలో 39.2, సోమల, రొంపిచెర్ల, చౌడేపల్లెలో 39.1 డిగ్రీలు నమోదైంది.

News March 31, 2024

కడప జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

image

ఏప్రిల్ రెండవ తేదీన కడప జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కడపలో తెలిపారు. 28వ తేదీ కడపలో పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదా పడగా.. ఏప్రిల్ 2న కడపలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొనడంతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో షర్మిల పాల్గొంటున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.

News March 31, 2024

VZM: ‘ఏప్రిల్ 14లోగా ఓటుకోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి’

image

18 సంవత్సరాలు నిండినవారంతా ఏప్రిల్ 14వ తేదీలోగా ఓటుకోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వాటిని ప‌రిశీలించి 10 రోజుల్లో నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుందన్నారు. వీరికి మాత్ర‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త‌గా ఓటేసే అవ‌కాశం ల‌భిస్తుందని, అర్హ‌త ఉన్న‌వారంతా ఓటు హ‌క్కు పొంద‌డ‌మే కాకుండా, ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోవాలని సూచించారు.

News March 31, 2024

తెనాలి వద్ద మృతదేహం కలకలం

image

తెనాలి మండలం సంగం జాగర్లమూడి సమీపంలో ఆదివారం ఓ మహిళ మృతదేహం ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంగం జాగర్లమూడి రోడ్డు పక్కన సుమారు 30 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.