Andhra Pradesh

News August 23, 2025

డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన పెదఅమీరం యువకుడు

image

ఇటీవల విడుదలైన డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులో కాళ్ల మండలం పెదఅమీరంకు చెందిన బూరాడ వెంకటకృష్ణ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ – మ్యాథ్స్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8వ ర్యాంక్, జోన్ 2 స్థాయి (3జిల్లాలు కలిపి) ఉద్యోగాలైన టీజీటీ మ్యాథ్స్‌లో 6వ ర్యాంక్, పీజీటీ మ్యాథ్స్‌లో 24వ ర్యాంక్, రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ పోస్ట్‌కు గాను 56వ ర్యాంక్ సాధించాడు.

News August 23, 2025

తొలి వారం 7.6 లక్షల మంది ‘స్త్రీశక్తి’ ప్రయాణాలు : RM షమీమ్

image

జిల్లాలో స్త్రీశక్తి పథకం ఆరంభించాక తొలి వారం 7,64,311 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కాగా, 22 వ తేదీ వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ వంటి మూడు రకాల బస్‌లలో మొత్తం 14,88,537 మంది ప్రయాణించారన్నారు.

News August 23, 2025

ప్రకాశం: ‘పేదల పార్టీ’కి.. షోకాజ్ నోటీసు జారీ!

image

పొదిలి మండలం కాటూరి వారి పాలెంకు చెందిన పేదల పార్టీ అనే రాజకీయ పార్టీకి జిల్లా ఎన్నికల అధికారి తమీమ్ అన్సారియా శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శికి నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయనందుకు నోటీసు జారీ చేశారు. వచ్చేనెల 8న ఎన్నికల అధికారి ముందు హాజరు కావాలన్నారు.

News August 23, 2025

DSCలో మూడు ఉద్యోగాలు సాధించిన సాయినాథ్

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన కావలి సాయినాథ్ DSC పరీక్షలో ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించాడు. PGT SOCIAL – 22nd rank, SA SOCIAL -23 RANK, TGT SOCIAL – 59th Rank సాధించి 3 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. సాయినాథ్‌ను పలువురు అభినందించారు.

News August 23, 2025

లావణ్యకు కర్నూలు జిల్లా మొదటి ర్యాంక్

image

తుగ్గలి మండలం గుత్తి ఎర్రగుడి గ్రామానికి చెందిన బొల్లుం లావణ్య డీఎస్సీ మెరిట్ లిస్టులో 94.53202 మార్కులతో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి టీచర్ ఉద్యోగం పొందారు. ఇష్టపడి చదివిన ఫలితమే ఈ విజయమని లావణ్య అన్నారు. మాజీ సర్పంచ్ వెంకటస్వామి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, గ్రామస్థులు ఆమె ప్రతిభను కొనియాడి అభినందించారు.

News August 23, 2025

రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం భూమిని సిద్ధంగా పెట్టుకోవాలి: కలెక్టర్

image

రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం తాడిపత్రి మండలం పెద్దపొలమడ పరిధిలో అనంతపురం -తాడిపత్రి జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 1,390లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్ కోసం కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

News August 23, 2025

రేపు వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సోమిరెడ్డి

image

గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం భాగంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కార్యాలయ సిబ్బంది తెలిపారు.

News August 23, 2025

యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

రైతులు అవసరానికి మించి యూరియాను వాడకుండా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్‌లో యూరియా వినియోగంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 18,588 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని వెల్లడించారు. ఇంకా 2,405 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News August 23, 2025

విశాఖ ఉక్కుపై సీఎం, డిప్యూటీ సీఎం నోరు మెదపడం లేదు

image

మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 35 భాగాలుకు ప్రైవేటు టెండర్లు పిలిచారని వెంటనే ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బలరాం డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు 2వ రోజు భీమవరం సీపీఎం ఆఫీసు‌లో జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కాదని మేం కాపాడుతామని చెప్పిన పెద్దలు నేడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు.

News August 23, 2025

ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి: ఏఎస్పీ

image

స్వాతంత్ర్య సమరయోధుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఏఎస్పీ హుస్సేన్ పీరా అన్నారు. శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన నిస్వార్థ సేవలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.