Andhra Pradesh

News March 31, 2024

విజయవాడ: పోలీసులకు సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

image

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి సీపీ క్రాంతి రానా టాటా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నగరంలో పనిచేస్తున్న కింది స్థాయి పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలు ఆరోపణలు రావడంతో సీపీ శనివారం ట్రాఫిక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సిబ్బంది ఉద్యోగంలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 31, 2024

విజయనగరం: ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు పలువురు దూరం..!

image

కుటుంబంలో ఒకరికే సీటు కేటాయించడంలో పలువురు టీడీపీ సీనియర్లు పోటీకి దూరమయ్యారు. విజయనగరంలో కుమార్తెకు టికెట్ ఇవ్వడంతో అశోక్ గజపతిరాజు, బొబ్బిలిలో తమ్ముడు పోటీలో ఉండడంతో సుజయ్ కృష్ణ రంగారావు, గజపతినగరంలో అన్న కొడుకు అభ్యర్థి కావడంతో కొండపల్లి అప్పలనాయుడు, చీపురుపల్లి సీటు పెదనాన్నకు ఇవ్వడంతో కిమిడి నాగార్జున ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దాదాపు దూరం అయ్యినట్లే కనిపిస్తుంది.

News March 31, 2024

నేడు విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఢిల్లీ చెన్నై జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం సామర్థ్యం 28,000 కాగా వాహనాల్లో భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు మధురవాడ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News March 31, 2024

శ్రీకాకుళం: ప్రధాన కూడళ్లు వద్ద చలివేంద్రాలు ఏర్పాటు

image

శ్రీకాకుళం పట్టణంతోపాటు మండల కేంద్రాలు ప్రధాన కూడళ్ళు వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిలాని సమూన్ శనివారం అధికారులకు సూచించారు. వేసవి ఎండలు తీవ్రత పెరుగుతున్నందున చలివేంద్రాలు ఏర్పాటు తప్పనిసరి అని అన్నారు. మున్సిపాలిటీ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు చలివేంద్రాలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News March 31, 2024

శ్రీకాకుళం: కత్తెరతో గొంతు కోసుకున్న వస్త్ర వ్యాపారి

image

టెక్కలి మద్యం మత్తులో ఉన్న వస్త్ర వ్యాపారి కత్తెరతో గొంతు కోసుకున్నాడు. టెక్కలి మండలం కె కొత్తూరు గ్రామానికి చెందిన జి.కుమారస్వామి బట్టల వ్యాపారం చేసుకుని కుటుంబంతో సాకిపల్లి కొత్తూరులో జీవిస్తున్నారు. ఇతనికి మద్యం రోజు తాగే అలవాటు ఉంది. ఆరోగ్యం బాగాలేకపోవడంతో మద్యం తాగవద్దని చెప్పినప్పటికీ వినకపోవడంతో భార్య మందలించింది. దీంతో కత్తితో పీక కోసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేశారు.

News March 31, 2024

ధర్మవరంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

ధర్మవరం టౌన్ కేతిరెడ్డి కాలనీకి చెందిన రాజేశ్వరి (21) అను యువతి తన ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. రాజేశ్వరి పుట్టపర్తిలో సంస్కృతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజేశ్వరి తండ్రి చిదంబరయ్య కూలి మగ్గం నేస్తారు. రాజేశ్వరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2024

కృష్ణా: మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు

image

విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకై పేద విద్యార్థులకు 1వ తరగతిలో అడ్మిషన్లకై ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా అడ్మిషన్ల ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేడు ఆదివారంతో ముగియనుంది. అడ్మిషన్ కావాల్సిన వారు గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని గన్నవరం MEO కె.రవికుమార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 31, 2024

అనకాపల్లి ఎంపీకి కీలక బాధ్యతలు

image

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ అబ్జర్వర్‌గా స్థానిక ఎంపీ బి.వి సత్యవతి నియమితులయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ సూచించింది. కాగా.. ఈసారి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడికి అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 

News March 31, 2024

RRR పోటీపై సందిగ్ధత.. క్యాడర్‌లోనూ క్లారిటీ మిస్!

image

MP రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో ప.గో జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ BJP అభ్యర్థిగా శ్రీనివాసవర్మను అధిష్ఠానం ప్రకటించినప్పటికీ RRR మాత్రం తానే బరిలో ఉంటానని, ఇక్కడ MPగా కాకుంటే ప.గోలోనే MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. అటు BJP నేతలు వర్మనే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. దీంతో RRR వర్గంతో పాటు కూటమి క్యాడర్‌లోనూ క్లారిటీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

News March 31, 2024

ప.గో జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోన్న RRR సీటు!

image

నరసాపురం సిట్టింగ్ MP రఘురామకృష్ణరాజు పోటీపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన పలుమార్లు అన్నప్పటికీ బీజేపీ అధిష్ఠానం శ్రీనివాసవర్మ పేరు ప్రకటించింది. దీంతో RRR కేడర్ సందిగ్ధంలో పడింది. అయితే.. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. నరసాపురం MPగా కాకుంటే ప.గో జిల్లాలో MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో జిల్లాలో RRR సీటు పొలిటికల్ హీట్ పెంచుతోంది.