Andhra Pradesh

News March 31, 2024

గిద్దలూరులో గెలుపు ఎవరిది?

image

గిద్దలూరు ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో 12 వేలకు వైగా ఓట్లతో గెలిచారు. అటు వైసీపీ నుంచి మార్కాపురం MLA కుందూరు నాగార్జునరెడ్డి గిద్దలూరు బరిలో ఉన్నారు. స్థానికులకే పట్టం కట్టాలని టీడీపీ ప్రచారం చేస్తుంటే, ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తానని కేపీ అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు.

News March 31, 2024

కోడూరు: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

కోడూరుకు చెందిన బాలికను మందపాకల గ్రామానికి చెందిన ఓ యువకుడు(19) అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను అపహరించి తీసుకెళ్లాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని, బాలికను హైదరాబాద్‌లో గుర్తించి స్టేషన్‌కి తరలించారు. ఆపై బాలికను విచారించగా, యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.  

News March 31, 2024

నెల్లూరు: ఏపీ రాష్ట్ర నిర్వహణ విపత్తుల సంస్థ

image

నేడు 50 మండలాల్లో వడగాల్పులు రేపు 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ అధికారి కూర్పునాథ్ తెలిపారు. శుక్రవారం 36 మండలాల్లో వడగాల్పులు కడప జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

News March 31, 2024

నంబూరు: భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లకై యూనివర్శిటి పరిశీలిన

image

ఈవీఎంల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లకై ఆచార్య నాగార్జున యూనివర్శిటీని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు, ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. పరిశీలనలో జిల్లా ఎస్పీ తుషార్ దూడీ, మంగళగిరి రిటర్నింగ్ అధికారి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

News March 31, 2024

గుంటూరు: గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

గడ్డి మందు తాగి వెంకటసాయి (17) మృతి చెందిన ఘటన తుళ్ళూరు (M) మోదుగలంకపాలెంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో మృతుడు ప్రేమలో ఉన్నాడు. విషయం యువతి బంధువులకు తెలియడంతో యువకుడి ఇంటికి వచ్చి బెదిరించారు. భయంతో యువకుడు గురువారం గడ్డి మందు తాగగా, విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 31, 2024

జమ్మలమడుగు: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

జమ్మలమడుగు మండలం, గొరిగేనూరులో తడి బట్టతో ఇంట్లో బండలు తుడుస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైన రామసుబ్బమ్మ మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఇంట్లో గత కొన్నేళ్లుగా ఇంటి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో తడిబట్టలతో బండలు తుడుస్తూ మరో చేత స్విచ్ బోర్డు పట్టుకున్నది. విద్యుత్ సరఫరా అవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

News March 31, 2024

అనంతలో డాక్టర్ సూసైడ్

image

అనంత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనస్తీషియా వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండో పట్టణ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల మేరకు అమరాపురం మండలానికి చెందిన శ్రీజ (22) సాయినగర్ లోని వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది.యువతి వసతి గృహంలోని తన గదిలో అపస్మారక స్థితిలోపడి ఉండటం చూసిన నిర్వాహకులు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 31, 2024

కొలిమిగుండ్లలో కార్మికుడు మృతి

image

పొట్టకూటి కోసం క్లీనర్ పని చేసుకోవడానికి లారీ వెంట వచ్చిన కార్మికుడు గుండె పోటుతో మృతి చెందిన సంఘటన కొలిమిగుండ్ల మండలం అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా బూడిదపాడు గ్రామానికి చెందిన గురక రామిరెడ్డి(48) ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు PC నరసింహులు తెలిపారు.

News March 31, 2024

బి.కొత్తకోట: ప్రియురాలు ప్రేమను నిరాకరించిందని విషం తాగాడు

image

ప్రియురాలు ప్రేమను నిరాకరించిందని విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బి.కొత్తకోట కాండ్లమడుగు క్రాస్, ఈడిగపల్లికి చెందిన నవీన్ టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్ ఓ అమ్మాయిని ప్రేమించగా.. నిరాకరించడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు బాధితుణ్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించగా కోలుకుంటున్నాడు.

News March 31, 2024

ఉదయగిరి: ఆగిన డీజే టిల్లు-2 మూవీ.. ఫ్యాన్స్ ఆందోళన

image

ఉదయగిరి పట్టణంలోని సికిందర్ పిక్చర్ ప్యాలెస్ ఎదుట సినీ వీక్షకులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. డీజే టిల్లు- 2 చిత్రం చూసేందుకు వచ్చిన వీక్షకులకు అసౌకర్యానికి గురై నిర్వాహకులతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చిత్రం ప్రసార సమయంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వీక్షకులు ఆందోళన చేపట్టారు. అనంతరం మూకుమ్మడిగా టికెట్ ఇచ్చి తిరిగి డబ్బులు తీసుకుని వెనుతిరిగారు.