Andhra Pradesh

News March 31, 2024

విశాఖలో విద్యార్థిని ఆత్మహత్య.. విచారణకు కమిటీ

image

విశాఖలో చైతన్య పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని బలవన్మరణంపై సాంకేతిక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. సంఘటనపై విచారణ జరిపి 24 గంటలలోగా నివేదిక అందించాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ నేతృత్వంలో విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ మెటలర్జీ విభాగాధిపతి రత్నకుమార్, సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్ రాజ్యలక్ష్మి విచారణ చేయనున్నారు.

News March 31, 2024

సీఎస్ఆర్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ విరాళాలతో కొంత భాగాన్ని ఆయా కంపెనీలు కొలువై ఉన్నచోట కొంతమేర ఖర్చు చేయాలని కలెక్టర్ పీ.అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నందు కియా కంపెనీ అనుబంధ సంస్థ Hyundai Mobis కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో రూ.44,13,436 విలువ గల పరికరాలు కలెక్టర్ పి.అరుణ్ బాబుకు అందజేశారు.

News March 31, 2024

తాగునీటి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో వేసవికాలంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్‌ను కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడినా 08514-244424కు కాల్ చేసిన వెంటనే సంబంధిత అధికారులతో తనిఖీలు చేయించాలన్నారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News March 31, 2024

నెల్లూరు: హైకోర్టు జడ్జీలను కలిసిన కమిషనర్

image

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జయసూర్య, హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డిని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక జిల్లా కోర్టు కాంప్లెక్‌లో జిల్లా న్యాయ అధికారుల వర్క్ షాష్‌కు న్యాయమూర్తులు హాజరయ్యారు.

News March 31, 2024

ప్రకాశం: ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేశ్‌కు డాక్టరేట్

image

పామూరు పట్టణ రెండో ప్రాదేశిక ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేశ్‌కు తమిళనాడుకు చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. సామజిక సేవా విభాగంలో విశిష్ఠ సేవలు అందించి సందర్భంగా శనివారం యూనివర్సిటీ వారు ఆకుపాటి వెంకటేశ్‌ను సత్కరించి డాక్టరేట్‌కు సంభందించిన సర్టిఫికెట్‌ను, డాలర్‌ను అందజేశారు.

News March 31, 2024

ఈవీఎం గోడౌన్స్ తనిఖీ చేసిన పల్నాడు కలెక్టర్

image

పల్నాడు జిల్లాలోని ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్ భద్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ శివశంకర్ శనివారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్‌లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

News March 31, 2024

తిరుపతి: ‘తాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

image

వేసవిలో తాగునీటి ఎద్దడిపై కలెక్టరేట్‌లో శనివారం సంభందిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పట్టణాల్లో, గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చూడాలని చెప్పారు.

News March 31, 2024

రాజమండ్రి: ‘ఈసీ ఆంక్షలు చంద్రబాబు చేసిన కుట్రే’

image

జగనన్నను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు సేవలందించేందుకు ముందుకు వచ్చిన యువత వాలంటీర్లుగా పనిచేస్తుంటే టీడీపీ- జనసేన నేతలు వేధింపులకు గురిచేస్తున్నారని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించడం చంద్రబాబు చేసిన కుట్రే అన్నారు.
– ఎంపీ వ్యాఖ్యలపై మీరేమంటారు..?

News March 31, 2024

పార్వతీపురం: ‘సమర్థవంతంగా ఎన్నికల నిర్వహనే లక్ష్యం’

image

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. EVM గోడౌన్‌ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం తనిఖీ చేశారు. సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా, పటిష్టంగా నిర్వహించేలా ప్రతీ నియోజక వర్గంలో EVM, వీవీ ప్యాట్‌లపై శిక్షణ అందించనున్నామని అన్నారు.

News March 31, 2024

విశాఖ: ‘ఎన్నికల నిర్వహణలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలి’

image

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ సూచించారు. జిల్లాలోని వివిధ నోడల్ అధికారులతో శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశమయ్యారు. ఆయా నోడల్ అధికారుల సమక్షంలో ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు, తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా నోడల్ అధికారుల సమక్షంలో చేయాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని డీఆర్ఓ సూచించారు.