Andhra Pradesh

News March 30, 2024

ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

image

ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్లుగా విజయవాడకు చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారిణులు, ఒక డాక్టర్‌ కమ్‌ సెక్సాలజిస్ట్‌ను స్టార్‌ క్యాంపెయినర్లుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎంపిక చేసింది. చదరంగంలో విజయవాడ కీర్తిపతాకను ప్రపంచస్థాయిలో ఇనుమడింపచేసిన కోనేరు హంపి, ఆర్చరీలో ప్రపంచాన్నే శాసించిన వెన్నం జ్యోతి సురేఖ, ప్రముఖ వైద్యుడు సెక్సాలజిస్ట్‌, సామాజికవేత్త డాక్టర్‌ జి. సమరంను ఎంపిక చేశారు.

News March 30, 2024

కడప: ట్రాక్టర్ ప్రమాదంలో రైతు దుర్మరణం

image

ట్రాక్టర్ బోల్తా పడి లింగాలకు చెందిన జయరామిరెడ్డి అనే రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈతాకుల కోసం ట్రాక్టర్‌లో వెళ్లాడు. తిరుగు పయణంలో అంబకపల్లి మురారిజింతల గ్రామ సరిహద్దుల్లో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర విలపిస్తున్నారు.

News March 30, 2024

సీఎం రమేశ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: సీపీఎం

image

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కానివ్వమని, పరిశ్రమకు అవసరమైన సొంత గనులు, నిధులు రప్పించి ఆధునీకరించి ఉపాధి కల్పిస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా ఎంపీగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో మీరు చేసిందేమిటి? అని లోకనాధం ప్రశ్నించారు.

News March 30, 2024

ప్రతాపరెడ్డి కుటుంబానికి అండగా ఉంటా: తుగ్గలిలో సీఎం జగన్

image

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత తమ్మారెడ్డి కుమారులు ప్రతాపరెడ్డి, ప్రహల్లాద రెడ్డి ఒకేసారి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో బాధాకరమని సీఎం జగన్ అన్నారు. తుగ్గలి సిద్ధం బస్సు యాత్రకు శనివారం వచ్చిన జగన్ వారి ఫొటోలకు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతాపరెడ్డి, ప్రహల్లాద రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకునికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

News March 30, 2024

నెల్లూరు: నాయుడుపేటలో సిద్ధం బహిరంగ సభ

image

నాయుడుపేట పట్టణంలో ఏప్రిల్ 4వ తేదీన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి సభ ఏర్పాట్లను పరిశీలించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

News March 30, 2024

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కలెక్టర్

image

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నారసింహ మహా యజ్ఞం కార్యక్రమాన్ని తిలకించారు. అప్పన్న బాబును దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దంపతులు యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

News March 30, 2024

మక్కువలో నవవధువు మృతి

image

మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నవవధువు అఖిల (20) మృతి చెందింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహ క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది. బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది.

News March 30, 2024

కుప్పం: ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు

image

ద్రావిడ యూనివర్సిటీలో 2023-24 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. APED CET- 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఏప్రిల్ మూడో తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని తెలియజేశారు. పూర్తి వివరాలకు https://www.dravidianuniversity.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.

News March 30, 2024

అమరావతి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

అమరావతిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న పంప్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైందని అమరావతి పోలీసులు తెలిపారు. ఓ మగ శవం (35) నీటిపై తేలాడుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ బ్రహ్మం అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పసుపు రంగు చారలు ఉన్న టీ షర్ట్ ధరించినట్లు సీఐ చెప్పారు. కేసు నమోదు చేశామన్నారు.

News March 30, 2024

నెల్లూరు: పోలింగ్‌కు 15 వేల మంది సిబ్బంది

image

జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి 15వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని పలు ప్రభుత్వ మహిళా కళాశాలలో అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు.