Andhra Pradesh

News March 30, 2024

VZM: ప్రేమ ముందు ఓడిపోయిన క్యాన్సర్ 

image

ప్రేమించిన అమ్మాయికి క్యాన్సర్ అని తెలిసికూడా పెళ్లి చేసుకుని ప్రేమ ఎంత గొప్పదో చాటి చెప్పారు ఓ యువకుడు. పాచిపెంట మండలం మడవలస వాసి బంటు సాయి క్యాన్సర్‌తో బాధపడుతుంది. అదే గ్రామానికి చెందిన బూతాల పోలరావు ఆమెను ప్రేమించాడు. పెద్దల ఆమోదంతో శుక్రవారం తెల్లవారుజామున వారు వివాహం చేసుకొన్నారు. మంత్రి రాజన్నదొర వైద్యానికి ఆర్థిక సహాయం చెయ్యగా, ఐటీడీఏ లైఫ్ లాంగ్ మందులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

News March 30, 2024

తూ.గో: వేసవి ప్రారంభంలోనే భానుడి భగభగలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికే సుమారు 35 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత అధికం కావడంతో భానుడి భగభగలు మిన్నంటుతున్నాయి. ఈ వేసవి సీజన్‌ ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు మూడు డిగ్రీల వరకూ అధికంగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తుంది.

News March 30, 2024

నరసరావుపేట: తొలిసారి పోటీ చేయనున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

image

నరసరావుపేటలో స్త్రీల వైద్య నిపుణురాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేయనున్నారు. గొట్టిపాటి లక్ష్మి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన మహిళగా గుర్తింపు ఉంది. అద్దంకి టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్న కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.. దర్శి నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పై పోటీ చేయనున్నారు.

News March 30, 2024

REWIND: నాడు 355 ఓట్ల మెజార్టీతో గన్నవరం ఎమ్మెల్యే

image

గన్నవరం నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. 355 ఓట్ల మెజార్టీ అత్యల్పం. 1972లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.ఎస్.ఆనందబాయి ఇంత తక్కువ మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారు. ఇదే నియోజకవర్గంలో 1989లో 715 ఓట్లు, 1955లో 823 ఓట్లు, 2019లో 838 ఓట్ల మెజార్టీతో ముసునూరు రత్నబోస్, పి. సుందరయ్య, వల్లభనేని వంశీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి గన్నవరంలో వంశీ, యార్లగడ్డ వెంకట్రావు తలపడుతున్నారు.

News March 30, 2024

తాడేపల్లిగూడెం ఓటర్ల తీర్పు ఏంటో..?

image

హోల్‌సేల్ వ్యాపారానికి పెట్టింది పేరు తాడేపల్లిగూడెం. ఇక్కడి ఓటర్ల నాడి అంత ఈజీగా పట్టలేం. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ.. ఇలా ప్రతి పార్టీకి పట్టం కడుతూ విభిన్న తీర్పు ఇస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి తరుపున బొలిశెట్టి సత్యనారాయణ(జనసేన) బరిలో ఉండగా.. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. మరి ఈసారి తాడేపల్లిగూడెం ఓటర్లు ఏం తీర్పునిచ్చేనో చూడాలి.

News March 30, 2024

ప్రకాశం జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి

image

మార్కాపురంలోని గాంధీ బజార్‌లో శనివారం భవనం పైనుంచి ప్రమాదవశాత్తు సచివాలయ ఉద్యోగి పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లయ్య (32) ఉదయం ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్ఐ రెహమాన్ తెలిపిన వివరాలు ప్రకారం.. మిద్దెపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్రగాయాలపాలై మల్లయ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

News March 30, 2024

వాల్తేరు రైల్వే డివిజన్ మరో రికార్డు

image

వాల్తేరు రైల్వే డివిజన్ మరో రికార్డు సాధించింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో సరుకు రవాణా చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 26వ తేదీ నాటికి 75.64 మిలియన్ టన్నుల మార్కును దాటినట్లు వాల్తేరు రైల్వే డీఆర్ఎం సౌరభ ప్రసాద్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 69.9 మిలియన్ టన్నుల సరుకులు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఐదు రోజుల వ్యవధి ఉండగా 75.64 మిలియన్ టన్నుల రవాణా చేసినట్లు తెలిపారు.

News March 30, 2024

MPL: జ్యూస్ అనుకుని కిరోసిన్ తాగిన బాలుడు

image

జ్యూస్ అనుకుని ఓ బాలుడు కిరోసిన్ తాగిన ఘటన మదనపల్లెలో జరిగింది. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల వివకాల మేరకు.. మదనపల్లె పట్టణం బీకేపల్లిలో ఉంటున్న వెంకటరమణ కుమారుడు వేదిక్(5) ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున జ్యూస్ అనుకొని కిరోసిన్ తాగేశాడు. కుటుంబీకులు గమనించి బాలుడిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

News March 30, 2024

నెల్లూరు: జులై నుంచి 4 వేలు పెన్షన్: కేతం రెడ్డి 

image

నెల్లూరు సిటీ పరిధిలో 5వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణని గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం గెలవగానే జులై నెల నుంచి 4వేలు పెన్షన్ ఇస్తామని అవ్వ, తాతలకు భరోసా కల్పించారు. వైసీపీ ప్రభుత్వం ఒక చేత్తో సంక్షేమ పథకాలిచ్చి మరొక చేత్తో అధిక ధరల రూపంలో లాక్కోవడం సరికాదన్నారు.

News March 30, 2024

అనంత: అంబికా లక్ష్మీనారాయణ రాజకీయ నేపథ్యం

image

అంబికా లక్ష్మీ నారాయణ అంబికా గ్రూపు ఆఫ్ ఫార్మ్స్‌కు అధిపతి. బోయ సామాజిక వర్గానికి చెందిన ఈయన 2009లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. గత టీడీపీ  హయాంలో అహుడా ఛైర్మన్‌గా ఉన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, వాల్మీకి సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మహర్షి వాల్మీకి భవన్ అధ్యక్షుడిగా, రోటర్ క్లబ్ సభ్యులుగా  పనిచేశారు. తాజాగా అనంతపురం పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.