Andhra Pradesh

News September 18, 2024

మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

image

స్వచ్చతా హి సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా పరిషత్ ఆవరణలో బుధవారం కలెక్టర్ ఆనంద్, ZP చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా అధికారులు మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ, వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డులకు తరలించడం తదితర కార్యక్రమాలు చేపట్టేమన్నారు.

News September 18, 2024

రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి. అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రమశిక్షణ సంఘం సమావేశం నిర్వహించారు. కొన్ని ఆసుపత్రులలో రోగనిర్ధారణ నిమిత్తం డా. ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులైన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.

News September 18, 2024

మంత్రి మండలి సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై మాట్లాడారు. అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు, ఈ మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు.

News September 18, 2024

తిరుపతి : రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు గురువారం ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కోఆర్డినేటర్స్-4, టీచర్స్-16 మొత్తం 20 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News September 18, 2024

విజయవాడ: మంత్రి నిమ్మలను కలిసిన పలువురు నేతలు

image

విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడును మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్, గోకరాజు గంగరాజు, ఎస్ఎల్‌వీ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాసరాజు, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును వారు సత్కరించారు. అనంతరం బుడ‌మేరు వ‌ర‌ద కార‌ణంగా కేస‌ర‌ప‌ల్లిలో ముంపుకు గురైన ఎస్ఎల్‌వీ లైలా గ్రీస్ మెడోస్ కాలనీవాసులకు భ‌విష్య‌త్తులో త‌మ నివాసాల‌వైపు వ‌ర‌ద నీరు రాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరారు.

News September 18, 2024

ఉమ్మడి కడప జిల్లాలో ప్రారంభం కానున్న 8 అన్న క్యాంటీన్లు.!

image

ఉమ్మడి కడప జిల్లాలో రెండో విడత 8 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
➤ కడప: ఓల్డ్ బస్టాండ్ వద్ద
➤ కడప: ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ వద్ద
➤ కడప: ZP ఆఫీస్ వద్ద
➤ జమ్మలమడుగు: ఆపోజిట్ MRO ఆఫీస్ వద్ద
➤ ప్రొద్దుటూరు: దూరదర్శన్ సెంటర్ వద్ద
➤ పులివెందుల: ఓల్డ్ జూనియర్ కాలేజీ వద్ద
➤రాజంపేట: RB బంగ్లా వద్ద
➤రాయచోటి: గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద SHARE IT.

News September 18, 2024

రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

image

ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్‌ల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

News September 18, 2024

అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇల్లు మంజూరు: కలెక్టర్

image

అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో విడుదల చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, లబ్ధిదారులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజురు పత్రాలను కలెక్టర్ అందజేశారు.

News September 18, 2024

విశాఖ: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

image

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న‌ అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అర్హులైన పర్యాటక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏపీ టూరిజం అథారిటీ, 5వ ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు అందచేయాలన్నారు.

News September 18, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొత్త అన్న క్యాంటీన్లు!

image

ఉ.కర్నూలు జిల్లాలో కొత్తగా మరిన్ని <<14130693>>అన్న<<>> క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాటి అడ్రస్‌లు ఇవే..
➤ ఆళ్లగడ్డ: టీబీ రోడ్డు పాతూర్ వీధి
➤ డోన్: LIC కార్యాలయం కింద
➤ ఎమ్మిగనూరులో(రెండు చోట్ల): శ్రీనివాస థియేటర్ ఎదురుగా, తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో
➤ గూడూరు: కూరగాయల మార్కెట్ వద్ద
➤ ఆదోనిలో(మూడు చోట్ల): పాత లైబ్రరీ పోస్ట్ ఆఫీస్, యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా, శ్రీనివాస భవన్
SHARE IT