Andhra Pradesh

News March 30, 2024

పిఠాపురంలో పవన్ షెడ్యూల్ ఇలా.. నేటి నుంచి షురూ

image

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. తొలిరోజు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో పవన్‌ దిగనున్నారు. అక్కడి నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం, అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. అనంతరం దొంతమూరులో TDP మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ నివాసానికి వెళ్లి ఆయనను పలకరిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు చేబ్రోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

News March 30, 2024

ప్రకాశం: ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి

image

సింగరాయకొండ మండలం పెదనబోయినవారిపాలెంకు చెందిన కావలి పద్మ, రమాదేవి, ప్రహర్ష సింగరాయకొండ నుంచి ఆటోలో గ్రామానికి బయల్దేరారు. ఊళ్లపాలెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న జగనన్న కాలనీ సమీపంలోకి వెళ్లేసరికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పద్మ, మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని ఒంగోలు తరలిస్తుండగా పద్మ మధ్యలో మృతిచెందారు. ఎస్సై శ్రీరాం కేసు నమోదుచేశారు.

News March 30, 2024

నేడు కడప జిల్లాకు చంద్రబాబు.. స్వల్ప మార్పులు

image

కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా వెలువడిన షెడ్యూల్ ప్రకారం మైదుకూరు, ప్రొద్దుటూరులో పర్యటించాల్సి ఉండగా మైదుకూరు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని కేవలం ప్రొద్దుటూరులో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఉదయం వింజమూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రొద్దుటూరు చేరుకొని రోడ్‌షో ద్వారా శివాలయం సర్కిల్లో బహిరంగ సభ నిర్వహిస్తారు.

News March 30, 2024

విశాఖ యువకుడికి రూ.కోటి ఉపకార వేతనంతో MBA సీటు

image

విశాఖకు చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఎంబీఏ)లో రూ.కోటి ఉపకార వేతనంతో సీటు లభించింది. అమెరికాలోని ఐవీవై లీగ్ యూనివర్సిటీలోనూ సీటు లభించిందని, అయినా స్టాన్ఫోర్డు వర్సిటీలో చేరనున్నట్లు వరుణ్ తెలిపారు. దేశంలో అతికొద్ది మందికి మాత్రమే ఉపకారవేతనంతో కూడిన సీటు లభిస్తుందన్నారు.

News March 30, 2024

మదనపల్లెలో యువకుడిపై కత్తితో దాడి

image

మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా ప్రశ్నించిన యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. మదనపల్లె పట్టణంలోని సీటీఎం రోడ్డులో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక శివాజీ నగర్‌లో ఉంటున్న షేక్ మస్తాన్ కుటుంబంలోని మహిళలతో అదే వీధిలో ఉండే ఇర్షాద్ అసభ్యకర పదజాలంతో మాట్లాడాడు. దీంతో అతడిని మస్తాన్ నిలదీశాడు. ఆగ్రహించిన ఇర్షద్ మస్తాన్‌పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.

News March 30, 2024

ఎన్నికల బరిలో ఐదుగురు నరసరావుపేట అభ్యర్థులు

image

పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఐదుగురు టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేయటం సంచలనం రేకెత్తిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను రాజకీయంగా శాసించిన నరసరావుపేట నేతలు తమకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, గురజాల శాసనసభ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News March 30, 2024

చిత్తూరు: 6వ తేదీ వరకు గడువు పొడిగింపు

image

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2024-25లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు చిత్తూరు డీఈవో దేవరాజు తెలిపారు. ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి 12 వరకు ప్రవేశ పరీక్ష అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 30, 2024

తాగునీటి సమస్యలపై సత్యసాయి కలెక్టర్ సమీక్ష

image

సత్యసాయి కలెక్టర్ పి.అరుణ్ బాబు కదిరి మున్సిపాలిటీ సమావేశ మందిరంలో తాగునీటి ఎద్దడి నివారణ, ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి ఆర్డీవో వంశీకృష్ణ, కదిరి మున్సిపాలిటీ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఈ వెంకటనారాయణ, DWMA PD విజయ ప్రసాద్ పాల్గొన్నారు.

News March 30, 2024

నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళి అమలు: ఢిల్లీ రావు

image

విజయవాడ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికల నియమావళిని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

News March 30, 2024

పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలు: కలెక్టర్

image

ఈనెల 30, ఏప్రిల్ 01 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మాన్ పవర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ మేనేజ్మెంట్, ఈవీఎం నోడల్ అధికారులు, ఆర్వోలతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు.