Andhra Pradesh

News March 30, 2024

అనకాపల్లి: 85 ఏళ్లు దాటిన వారికి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్

image

ఓటింగ్‌ శాతం తగ్గరాదనే ముందు చూపుతో ఎన్నికల సంఘం 85 ఏళ్లు దాటిన వారికి, 40% పైగా వైకల్యమున్న దివ్యాంగులకు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్ వెసులుబాటు కల్పించింది. అర్హులైన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు అందించి, వారితో ఓటు వేయించే బాధ్యత రిటర్నింగ్‌ అధికారి ఆదేశాలతో బీఎల్వోలే తీసుకుంటారని తెలిపింది. నోటిఫికేషన్‌ విడుదలైన ఐదు రోజుల్లో వాటిని భర్తీ చేసి బీఎల్వోలకు సమర్పించాలని నోడల్‌ అధికారి హేమంత్‌ తెలిపారు.

News March 30, 2024

VZM: ‘వేసవిలో పశువులను సంరక్షించాలి’

image

వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పశువులను సంరక్షించాల్సిన బాధ్యత రైతులదేనని గుమ్మలక్ష్మీపురం పశు వైద్య అధికారి పి. లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం రాయగడ జమ్ము గ్రామంలో పశు సంవర్ధక శాఖ, జట్టు సంస్థ సంయుక్తంగా పశు వైద్య శిభిరం నిర్వహించారు. సుమారు 380 పశువులకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో జట్టు సంస్థ కో ఆర్డినేటర్లు జి. ప్రభోద్, జి.మురళి తదితరులు ఉన్నారు.

News March 30, 2024

హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికిన ఏలూరు జిల్లా జడ్జి

image

ఏలూరు పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి బి.కృష్ణ మోహన్‌కి జిల్లా జడ్జి సి.పురుషోత్తం కుమార్ శుక్రవారం స్వాగతం పలికారు. నేడు (శనివారం) స్థానిక జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించబోయే న్యాయమూర్తుల జ్యుడీషియల్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొననున్నారు. జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి, జిల్లాధికారులు, ఇతర న్యాయమూర్తులు, లాయర్లు ఉన్నారు.

News March 30, 2024

నరసరావుపేట: ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్

image

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివ శంకర్ సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియలో భాగంగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డ్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలను పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. భద్రత పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు.

News March 30, 2024

కూటమితో బీసీలకు బంగారు భవిష్యత్తు: కోండ్రు

image

సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని టీడీపీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. వంగర మండలం అరసాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీల కోసం రూ.36వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీలకు వైసీపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు.

News March 30, 2024

నిర్భయంగా ఓటు వేయండి: SP

image

ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు ఎస్పీ జాషువా కోరారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.

News March 29, 2024

ప.గో.: GREAT: 100 సార్లు రక్తదానం..

image

పెరవలి మండలం నడుపల్లి గ్రామానికి చెందిన చిర్రా గోపాల్‌ వందోసారి రక్తదానం చేశారు. తణుకులోని బ్లడ్‌ బ్యాంకులో శుక్రవారం ఆయన ఈమేరకు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. 18 ఏళ్ల వయసులో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న సమయంలో రక్తదానం చేసిన గోపాల్‌ అదే స్ఫూర్తితో 3 నెలలకోసారి రక్తదానం చేస్తూ ఇప్పటి వరకు వందమందికి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.

News March 29, 2024

గుంటూరు పోలీసులకు ఉగాది పురస్కారాలు

image

గుంటూరు క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతురాజు, సౌత్ డీఎస్పీ మహబూబ్ బాషాలకు ఉగాది పురస్కారాలు డీజీపీ డిస్క్ అవార్డులకు ఎంపికయ్యారు. వారిని శుక్రవారం పోలీస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలు అందుకున్న అధికారులు మాట్లాడుతూ.. తాము చేసిన సేవలను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయటం సంతోషంగా ఉందని చెప్పారు.  

News March 29, 2024

మందకృష్ణ ఆశయం త్వరలోనే నెరవేరుతుంది: సత్యకుమార్

image

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావలసిన అవసరముందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నట్లు బీజేపీ నేత సత్యకుమార్ తెలిపారు. ధర్మవరం కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తనకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు. తన నివాసానికి వచ్చిన మందకృష్ణతో సత్య తాజా రాజకీయాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ ఆశయం త్వరలో నెరవేరుతుందన్నారు.

News March 29, 2024

విశాఖలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు

image

విశాఖలో తొలిసారిగా ఒక దివ్యాంగుడు బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశా దివ్యాంగ్‌ సురక్ష ద్వారా ఈ నెల 15న డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కోటవురట్లకు చెందిన ఒక దివ్యాంగుడు ఫోన్‌ చేసి.. అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఒక సంస్థ తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిందని బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.