Andhra Pradesh

News March 29, 2024

సింగరాయకొండలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

సింగరాయకొండ పట్టణంలోని రాయల్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 40సం.రాలు ఉంటుందని, మృతుడి చేతి మీద కేశవ పద్మావతి అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.

News March 29, 2024

రాజంపేట: తమ నేతకు టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం

image

రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడుకు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు రాజంపేటలో భవనంపై నుంచి దూకుతానని కొద్దిసేపు హల్చల్ చేశారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. టీడీపీ నేతలు కొందరు హుటాహుటిన భవనం పైకెక్కి మందా శీనును సముదాయించి కిందికి దించారు.

News March 29, 2024

చంద్రబాబు సభకు దూరంగా బొల్లినేని

image

ఉదయగిరి తెలుగుదేశం పార్టీలో రేగిన అసమ్మతి చల్లారేలా కనిపించడం లేదు. వింజమూరులో ఇవాళ టీడీపీ అధినేత నిర్వహించిన ప్రజాగళం సభకు మాజీ MLA బొల్లినేని రామారావు దూరంగా ఉన్నారు. చంద్రబాబు సభాస్థలికి రాకమునుపే బస్సులో ఆయనతో సమావేశమైన రామారావు.. తర్వాత రాత్రి చంద్రబాబు బస ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. ఉదయగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బొల్లినేనిని కాదని టీడీపీ అధిష్ఠానం కాకర్లకు అవకాశం కల్పించింది.

News March 29, 2024

భీమిలిలో గురుశిష్యుల మధ్య పోటీ

image

భీమిలిలో గురుశిష్యుల మధ్య పోటీతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. 2009లో అవంతిని గంటా రాజకీయాల్లోకి పరిచయం చేశారు. 2009లో వీరిద్దరూ ప్రజారాజ్యం నుంచి పోటీచేయగా అనకాపల్లిలో గంటా, భీమిలిలో అవంతి గెలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇద్దరూ వేరు వేరు పార్టీలలో చేరి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ భీమిలిలో ప్రత్యర్థులుగా దిగుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 29, 2024

తూ.గో.: ‘మా కుటుంబాన్ని ఆ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది’ 

image

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తల్లి సత్యవతి అనపర్తి ప్రజలను ఉద్దేశించి శుక్రవారం ఓ కరపత్రం విడుదల చేశారు. తన భర్త మూలారెడ్డి, కుమారుడు రామకృష్ణారెడ్డి టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషిచేశారన్నారు. అధికార పార్టీ తమ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇప్పుడు టీడీపీ ఇచ్చిన టికెట్‌ను కాదని అన్యాయం చేస్తుందని, తమకు ప్రజలే మద్దతుగా నిలవాలన్నారు.

News March 29, 2024

గుంటూరులో రూ.7,62,850 నగదు సీజ్

image

గుంటూరులో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రటిష్టంగా అమలు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరిస్తూ సహకరించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు సరైన పత్రాలు చూపని రూ.7,62,850 నగదును సీజ్ చేశామని చెప్పారు. 

News March 29, 2024

సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నారు: కృష్ణయ్య

image

బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయపార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే, సీఎం జగన్ ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారన్నారు. సీఎం జగన్ ముందు చూపుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, ప్రజల బంగారు భవిష్యత్కు బాట వేస్తున్నారని ఆయన తెలిపారు. 

News March 29, 2024

ప్రజల ఆస్తులు కబ్జా: చంద్రబాబు

image

వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని.. ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కావలిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలపైనే కేసులు పెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 29, 2024

ఒంగోలు ఎంపీ టిడిపి అభ్యర్థి మాగుంట రాజకీయ నేపథ్యం

image

ఒంగోలు ఎంపీ టిడిపి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈయన 2014 టిడిపిలో చేరి ఒంగోలు టిడిపి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 టిడిపికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరి 2019 ఒంగోలు ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2024లో ఫిబ్రవరిలో వైసిపి పార్టీకి రాజీనామా చేసి మార్చి 16న 2024న మళ్లీ టిడిపిలో చేరారు. జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి అందరికీ సుపరిచితమే.

News March 29, 2024

దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ రాజకీయ ప్రస్థానం

image

అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్యెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈయన 2014 నుంచి 2019 వరకు రాప్తాడు ఎంపీపీగా పని చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసినప్పటికీ ఎటువంటి పదవులు అధిరోహించలేదు. వెంకటేశ్వర ప్రసాద్ పని తీరుని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.