Andhra Pradesh

News March 29, 2024

కడప జిల్లాలో 26 ఓట్లతో గెలిచిన MLA ఎవరో తెలుసా?

image

మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రామారెడ్డి 11 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి ఐదుగురు మాత్రమే MLAలుగా ప్రాతినిధ్యం వహించగా, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి డీఎల్ రవీంద్రరెడ్డి కేవలం 26 ఓట్ల తేడాతో రఘురామిరెడ్డి (TDP)పై గెలుపొందారు. దీంతో జిల్లాలో తక్కువ ఓట్లతో ఓడిన, గెలిచిన వ్యక్తులుగా నిలిచారు.

News March 29, 2024

SKLM: వాట్సప్‌లో మెసేజ్ ఫార్వర్డ్.. టీచర్‌కు షోకాజ్ నోటీస్

image

సారవకోటలో పెద్దలంబ పంచాయతీ మూగుపురంలో టీచర్‌గా పనిచేస్తున్న చౌదరి లక్ష్మీనారాయణ ఎన్నికలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు ఎంఈఓ మడ్డు వెంకటరమణ తెలిపారు. లక్ష్మీనారాయణ ఉపాధ్యాయ పనిచేస్తూ పాతపట్నం నియోజకవర్గం ఆదివాసి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయమని తన వాట్సాప్‌లో ప్రచారం చేసినట్లు కొంతమంది నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీస్ ఇచ్చామన్నారు.

News March 29, 2024

నెల్లూరు: బీఈడీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు

image

నెల్లూరు నగరం సంతపేటలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఎడ్ సెట్ అర్హత సాధించి ఎక్కడా అడ్మిషన్ పొందని విద్యార్థులు ఏప్రిల్ 2వ తేదీ వరకు కళాశాలలో జరిగే స్పాట్ కౌన్సిలింగ్ లో పాల్గొనాలని సూచించారు. రిజిస్ట్రేషన్, కాలేజీ ఫీజుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని కోరారు.

News March 29, 2024

తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే మద్దిశెట్టి?

image

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం మద్దిశెట్టి వేణుగోపాల్ అయితే పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు నియోజకవర్గ ప్రజలకు ఐవిఆర్ఎస్ కాల్స్ చేయించి సర్వే చేయిస్తోంది. దీంతో ఆయన పార్టీ మారనున్నారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. అయితే దర్శిలో ఇప్పటికే పలువురి పేర్లతో ఈ సర్వే కొనసాగుతోంది.

News March 29, 2024

అనంత: తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక సెల్

image

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హసన్‌బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. సమస్య ఎక్కడ తలెత్తిన 08554-275892, 9390098329 నంబర్లకు ఫోన్‌ చేసి సమస్య తెలియజేయాలని కోరారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు.

News March 29, 2024

బాపట్ల ఎంపీగా గెలిచేదెవరు?

image

2019 బాపట్ల పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ గెలుపుపై మళ్లీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్‌పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ సీటును కైవసం చేసుకొనేందుకు రిటైర్డ్ డీజీపీ టి.కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దింపింది. వైసీపీ తరఫున మళ్ళీ ఎంపీ నందిగం సురేశ్‌కే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. 

News March 29, 2024

విజయనగరం అధికారులను బంధించిన ఒడిశా పోలీసులు

image

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కోటియా గ్రూపు గ్రామమైన దిగువ గంజాయబద్రలో కొత్త విద్యుత్ మీటర్లు వెయ్యడానికి వెళ్లిన ఏపీ విద్యుత్ అధికారులను ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. ఆయా గ్రామాలు ప్రజలు విద్యుత్ మీటర్లు కోసం దరఖాస్తులు చెయ్యగా.. గత కొన్ని రోజులుగా విద్యుత్ మీటర్లు సిబ్బంది బిగిస్తున్నారు. గురువారం వెళ్లిన అధికారులను కోటియా పోలీసులు బంధించగా, ఉన్నత అధికారులు ఒడిశా అధికారులతో మాట్లాడి విడిపించారు.

News March 29, 2024

తిరువూరు: పోలీస్ గన్‌మెన్ మోహన్ మృతి

image

తిరువూరు మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ గన్‌మెన్ మారిపోగు మోహన్ రోడ్డు ప్రమాదంలో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. విజయవాడ లాండ్ ఆర్డర్ డీసీపీ వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ బైకు మీద తిరువూరు వైపు వస్తుండగా మంగళగిరి వడ్డేశ్వరం వద్ద వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో మోహన్ మృతిచెందాడు. మోహన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 29, 2024

ఏలూరు: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య SUICIDE

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన చినవెంకట సాంబమూర్తి RDO ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్. ఆయనకు ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంకు చెందిన రాధిక(31)తో 2010లో పెళ్లైంది. రెండ్రోజుల కింద రాధిక ఊరివేసుకొని మృతి చెందింది. అదనపుకట్నం తీసుకురావాలని తరచూ భర్త వేధించడం వల్లే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

News March 29, 2024

రేపు ‘వారాహి విజయభేరి’ సభ.. పవన్ షెడ్యూల్ ఇదే

image

కాకినాడ జిల్లా పిఠాపురంలో రేపు ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. ఈ సభతోనే జనసేన అధినేత పవన్‌ ప్రచారం షురూ కానుంది. SAT 12.30 PMకు పవన్ గొల్లప్రోలు హెలిప్యాడ్‌‌లో దిగుతారు. పాదగయలో పూజలు.. పొన్నాడలోని బషీర్‌ బీబీ దర్గా దర్శనం.. పిఠాపురంలోని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం 4.30 PMకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం నుంచి ప్రచారాన్ని ఎన్నికల మొదలు పెట్టనున్నారు.