Andhra Pradesh

News August 23, 2025

ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి: ఏఎస్పీ

image

స్వాతంత్ర్య సమరయోధుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఏఎస్పీ హుస్సేన్ పీరా అన్నారు. శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన నిస్వార్థ సేవలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

News August 23, 2025

కడప: ఫలితాలు విడుదల

image

YVU డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొ. శ్రీనివాసరావు విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ ఐదు సెమిస్టర్ల పరీక్షలకు 1,012 మంది విద్యార్థులు హాజరు కాగా.. 977 పాస్ అయ్యారని తెలిపారు. ఫలితాల కోసం https:www.yvuexams.in ను సంప్రదించాలన్నారు. ఈ ఫలితాలను విడుదల చేసిన వారిలో రిజిస్ట్రార్ పి.పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు ఉన్నారు.

News August 23, 2025

రాజమండ్రి: దోమల నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ

image

రాజమండ్రిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ శుద్ధి లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఇందులో భాగంగా కంబాల చెరువు పార్కులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. డ్రోన్లతో మందులు పిచికారీ చేయడంతోపాటు, దోమల లార్వాలను తినే గాంబూసియా చేపలను చెరువులో వదిలారు. ఈ వినూత్న కార్యక్రమం పట్ల ఎమ్మెల్సీ హర్షం వ్యక్తం చేశారు.

News August 23, 2025

29న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన

image

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. ఈనెల 29, 30 తేదీల్లో సీఎం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 29న ఆయన కుప్పం చేరుకుని సొంతింట్లో బసచేస్తారు. 30వ తేదీ సతీ సమేతంగా పరమసముద్రం వద్ద హంద్రీనీవా జలాలను విడుదల చేసి జల హారతి ఇస్తారు. అక్కడే జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.

News August 23, 2025

గణేశ చతుర్థి ఉత్సవాలకు పోలీసుల కీలక సూచనలు

image

గణేష్ చతుర్థి ఉత్సవాలకు జిల్లా పోలీసు శాఖ కీలక సూచనలు చేశారు. విగ్రహాలను రహదారులకు దూరంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని, తాత్కాలిక సీసీ కెమెరాలు పెట్టాలని, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. మండపాల వద్ద ఇసుక బస్తాలు, డ్రమ్ముల్లో నీరు, అగ్ని ప్రమాద నిరోధిక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.

News August 23, 2025

పోలీస్ నుంచి టీచర్‌గా..

image

మెగా డీఎస్సీ ఫలితాల్లో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మం. జూటూరుకు చెందిన వసుంధర సత్తా చాటారు. జిల్లా స్థాయిలో 59వ ర్యాంకుతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలి (SGT)గా ఎంపికయ్యారు. అయితే వసుంధర ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పుట్లూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో పనిచేశారు. ప్రజల రక్షణలో కీలకంగా పనిచేస్తూ లక్ష్యాన్ని మరవకుండా టీచర్ జాబ్ సాధించారు.

News August 23, 2025

ఇక నుంచి ఎవ్వరికి పెరోల్ లేఖ ఇవ్వను: కోటంరెడ్డి

image

ఇక నుంచి తాను ఎవరికీ పెరోల్ కోసం లేఖలు ఇవ్వనని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తాను, గూడూరు MLA సునీల్ ఇచ్చిన లేఖలను హోమ్ శాఖ తిరస్కరించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సైతం లేఖలు ఇచ్చారని వాటితోనే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

News August 23, 2025

విశాఖలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్

image

స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా PMAJAY కింద SC యువతీ/యువకులకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 20-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులు. విశాఖ జిల్లా వాసులై, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. అర్హులైన 10 మంది (పురుషులు-5, స్త్రీలు-5)కి APSTRC ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. MVP కాలనీ సంక్షేమ భవన్‌లో ఆగష్టు 27లోపు దరఖాస్తు అందజేయాలి.

News August 23, 2025

దేవరపల్లి: లారీ ఢీకొని సర్పంచ్ బుల్లారావు మృతి

image

దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదర మండలం రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బుల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లారావు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 23, 2025

ఉయ్యూరుకు గ్రేడ్ -2 మున్సిపాలిటీ హోదా

image

ఉయ్యూరు నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ శుక్రవారం GO విడుదలైంది. ఉయ్యూరు జనాభా 46 వేలు కాగా వివిధ పన్నుల రూపంలో రూ. 4.66 కోట్ల ఆదాయం వస్తోంది. ఆదాయం రూ. కోటి లోపు ఉండే పట్టణాలను నగర పంచాయతీలుగా గుర్తించగా.. అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తున్నందున గ్రేడ్-2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు ప్రత్యేక గ్రాండ్లు కూడా వస్తాయన్నారు.