Andhra Pradesh

News March 28, 2024

నక్కపల్లి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

నక్కపల్లి మండలం గుల్లిపాడు, నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం లభ్యమయ్యింది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి గురువారం ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తుని రైల్వే ఎస్సై షేక్ అబ్దుల్ మరూఫ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలుంటాయని, అతని వివరాలు తెలియలేదన్నారు. తుని ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచామని చెప్పారు.

News March 28, 2024

కాకినాడ: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

image

కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్లిపాడు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృత్యువాత పడినట్లు ఎస్సై అబ్దుల్ మారూప్ తెలిపారు. మృతుడు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు నుంచి జారిపడి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉంచామని పోలీసులు తెలిపారు.

News March 28, 2024

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: SP పరమేశ్వరరెడ్డి

image

సోషల్ మీడియాలో నిరాధార, వాస్తవ దూరమైన సమాచారం ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. తప్పుడు సమాచారం, బెదిరింపులకు పాల్పడే పోస్టులపై పూర్తి బాధ్యతను గ్రూప్ అడ్మిన్‌నే వహించాల్సి ఉంటుందన్నారు.

News March 28, 2024

టెక్కలి మండలంలో విషాదం

image

మండలంలోని చిన్ననారాయణపురానికి చెందిన సాలిన రాము(42) అనే వ్యక్తి గురువారం సాయంత్రం మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటీన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News March 28, 2024

REWIND: నెల్లూరు జిల్లాలో ఓడిపోయిన సినీనటి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేతలు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో 1999 ఎన్నికల్లో అదే సామాజికవర్గానికి చెందిన సినీనటి శారదను TDP రంగంలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ CM నేదురమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి తొలిసారి పోటీ చేశారు. 10,718 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. తాజా ఎన్నికల్లో YCP నుంచి ఆమె తనయుడు రాంకుమార్ రెడ్డి, TDP అభ్యర్థిగా సాయిలక్ష్మి ప్రియ బరిలో ఉన్నారు.

News March 28, 2024

పెండ్లిమర్రి: పది ఏళ్లు క్యాన్సర్‌తో పోరాటం.. చివరికి

image

నలుగురు పిల్లలు, పది ఏళ్లు క్యాన్సర్‌తో పోరాటం, బతకాలనే ఆశ చివరికి ఇవేమి పని పనిచేయక ఓ మహిళ మృతి చెందింది. పెండ్లిమర్రికి చెందిన గంగులమ్మ (80) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. ఇవాళ ఉదయం 10 గంటలకు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గత పది సంవత్సరాలుగా గంగులమ్మ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుండేదన్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ చనిపోయినట్లు తెలిపారు.

News March 28, 2024

2న శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 9న ఉగాది ఆస్థానం జరగనుంది. ఈక్రమంలో ఏప్రిల్‌ 2వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

News March 28, 2024

పశ్చిమ ప్రకాశంను వీడని కరువు.. ప్రజల వలస

image

కరువుతో పశ్చిమ ప్రకాశం ప్రజలు వలసబాట పడుతున్నారు. ఉన్న ఊళ్లో బతుకుభారమై పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాలకు తరలి వెళ్తున్నారు. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో చాలా గ్రామాలు జనం లేక వెలవెలబోతున్నాయి. అడపాదడపా తాగునీరు అందిస్తున్నప్పటికీ చాలీచాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కరువు నివారణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు..

News March 28, 2024

ఈవీఎంలు పల్నాడు, బాపట్ల జిల్లాకు కేటాయించాం

image

ఎన్నికల సంఘం గుంటూరు GMCకి కేటాయించిన EVMలలో కొన్నింటిని గత ఏడాది పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఇచ్చామని నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరుకి అవసరమున్నందున వాటిని తిరిగి ఆయా జిల్లా అధికారులు శనివారం అందించనున్నారని కమిషనర్ తెలిపారు. వచ్చిన ఈవీఎంలను గోడౌన్ నందు భద్రపరుచుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News March 28, 2024

మక్కువ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం మక్కువ ఎస్సై నరసింహ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కన్నంపేట గ్రామానికి చెందిన చీపురు ఉమామహేశ్వరరావు(40) బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన పెళ్లి మండపం పనులు చేస్తుండగా, విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.