Andhra Pradesh

News March 28, 2024

ఎడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

image

మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు, ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వైపు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి NRI ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

కర్నూలు: పల్లె లక్ష్మన్న శవం ఆచూకీ లభ్యం

image

దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన లక్ష్మన్న మృతదేహాం ఇవాళ లభ్యమైంది. అనంతపురం జిల్లా పామిడి బైపాస్ రోడ్‌లో బ్రిడ్జి కింద ముళ్లపొదలలో అతడి తల, మొండెం వేరుగా పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ శ్రీనివాసులు తెలిపారు. అనుమానితులుగా మృతుడి భార్య, కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 40 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది.

News March 28, 2024

ఉరవకొండ: గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

ఉరవకొండ పట్టణంలోని 10వార్డ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శర్మాస్ వలి(23) బుధవారం సాయంత్రం బెంగళూరులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పీజీలో ఉంటున్న అతడికి ఉన్న ఫలంగా ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులు సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 28, 2024

నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. రాపూరు మండలం గోనుపల్లికి చెందిన ఓ యువతి పొదలకూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో ఇవాళ విద్యార్థిని విష ద్రావకం తాగింది. గమనించిన స్థానికులు పొదలకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

చీరాల: TDP అభ్యర్థి ఫ్యాక్టరీలో రూ.56 లక్షలు స్వాధీనం

image

చీరాల మండలం కావూరివారి పాలెంలోని బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.56 లక్షల నగదును గురువారం పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తమ సిబ్బందితో మెరుపు దాడి చేసి నగదును సీజ్ చేశారు.

News March 28, 2024

కాకినాడ నూతన కలెక్టర్‌గా జే.నివాస్

image

కాకినాడ కలెక్టర్‌గా జే.నివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్‌గా పని చేస్తున్న కృత్తికా శుక్లాను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కృత్తికా శుక్లా గత రెండేళ్లుగా కాకినాడ కలెక్టర్‌గా సేవలు అందించారు. వైద్యారోగ్య శాఖలో డైరెక్టర్‌గా ఉన్న జె.నివాస్‌ను కృతికా శుక్లా స్థానంలో కలెక్టర్‌గా నియమించారు.

News March 28, 2024

అన్నమయ్య: గుండెపోటుతో మున్సిపల్ కౌన్సిలర్ మృతి

image

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీలోని 30వ వార్డు కౌన్సిలర్ ఆసిఫ్ అలీ ఖాన్ గుండెపోటుతో గురువారం మద్యాహ్నం మృతిచెందారు. వైసీపీలో కీలక వ్యక్తి అయినటువంటి ఆసిఫ్ అలీ ఖాన్ మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వార్డు పరిధిలో ఆయన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని స్థానికులు చెప్పుకొచ్చారు.

News March 28, 2024

విశాఖ: తమ్ముడి కోసం అక్క.. భర్తల కోసం భార్యలు

image

ఉమ్మడి విశాఖలోని అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. విశాఖ తూర్పు TDP అభ్యర్థి వెలగపూడి తరఫున ఆయన భార్య సుజన, పశ్చిమ YCP అభ్యర్థి ఆనంద్ కుమార్ తరఫున ఆయన సోదరి రమాకుమారి, అనకాపల్లి YCP అభ్యర్థి మలసాల భరత్ కుమార్‌కు మద్దతుగా ఆయన భార్య ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అటు బీజేపీ MP అభ్యర్థి సీఎం రమేశ్ సోదరుడు సురేశ్, తనయుడు రితీష్‌ అనకాపల్లిలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు.

News March 28, 2024

కృష్ణా: ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

ట్రాక్ భద్రత పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు, విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లను కొన్ని రోజులపాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR)తెలిపింది. ట్రైన్ నం.22701 విశాఖపట్నం- గుంటూరు, నం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

News March 28, 2024

సీతారామపురంలో విజయసాయిరెడ్డి రోడ్ షో

image

ఉదయగిరి నియోజకవర్గంలో సీతారామపురంలో గురువారం వైసీపీ అభ్యర్థులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వేణుంబాక విజయసాయి రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఎల్.వీ.ఆర్ కళాశాల వద్ద నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. వైసీపీని వాడుకుని వదిలేసిన నాయకులకు ఘన విజయంతో గుణపాఠం చెప్పాలని విజయసాయి రెడ్డి కోరారు.