Andhra Pradesh

News March 28, 2024

HM.పాడు: కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి

image

హనుమంతునిపాడు మండలంలోని సీతారాంపురంలో గురువారం కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి చెందాయి. సీతారాంపురం గ్రామానికి చెందిన తెల్లయ్య, గురవయ్యకి సంబంధించిన గొర్రె పిల్లలను దొడ్లో కట్టేశాడు. కుక్కల మంద వచ్చి దాడి చేయడంతో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయని వారు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 28, 2024

గ్రూపులో ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత: గుంటూరు ఎస్పీ

image

సోషల్ మీడియాలో ఎన్నికల వేళ చేసే ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత అని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. వివాదాస్పద పోస్టులు, కామెంట్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుంచి తొలగించాలని, అలాంటి పోస్టుల వివరాలు పోలీసులకు సమాచార ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

News March 28, 2024

ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పొడిగింపు: డీఈఓ

image

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆయా స్కూళ్లలో 25 శాతం కోటా కింద పేద విద్యార్థులు ప్రవేశం పొందచవ్చని తెలిపారు. విద్యార్థుల https://cse.ap.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. 

News March 28, 2024

ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి సుజనా చౌదరి

image

విజయవాడ వెస్ట్ NDA అభ్యర్థి సుజనా చౌదరి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడుతున్నారు. 2005లో టీడీపీలో చేరిన ఆయన 2010 నుంచి రెండు విడతలు రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. 2014 నుంచి 2018 వరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్నారు. సుజనా చౌదరి స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల.

News March 28, 2024

అనపర్తి MLA సీటుపై కూటమి అభ్యర్థి కీలక వాఖ్యలు

image

కూటమి అభ్యర్థి శివకృష్ణం రాజు టికెట్ వివాదంపై స్పందించారు. పొత్తులో భాగంగా సీటు ఏ పార్టీకి వచ్చినా అందరూ కలసి సహకరించుకుని ఎన్నికల్లో పోటీ చేయడం పొత్తు ధర్మం అన్నారు. త్వరలో నల్లమిల్లి రామక్రిష్ణ రెడ్డితో పాటు జనసేన నేతలను కలసి మద్ధతు అడుగుతానని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్తానన్నారు.

News March 28, 2024

సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన సాయినాథ్ శర్మ

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీబొట్ల సాయినాథ్ శర్మ గురువారం నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైసీపీ నేత వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

News March 28, 2024

విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డ్

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే డివిజన్ సరుకు రవాణా ద్వారా రూ3.975కోట్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా 36.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. త్వరలోనే విజయవాడ రైల్వే డివిజన్ వార్షిక ఆదాయం రూ.4వేల కోట్ల మైలురాయి దాటనుందని వారు తెలిపారు. అనంతరం సరుకు రవాణా కోసం కొత్తగా రూ.153కోట్లతో 15గూడ్స్ షెడ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

News March 28, 2024

మెట్టుకూరు మెట్టు దిగేనా !

image

వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాల్లో వైసీపీ సీనియర్ నేత, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వెంకటగిరిలో పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పాటు కచ్చితంగా పోటీలో ఉంటానని రాజకీయ కాక రేపారు. ఈ క్రమంలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో వెళ్లారు. కీలక నేతలు సుదీర్ఘంగా మంతనాలు సాగించినా ఆయన మెత్తబడలేదని సమాచారం.

News March 28, 2024

ఉండ్రాజవరంలో భర్తను హత్య చేసిన భార్య

image

ఉండ్రాజవరంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. మద్యం మత్తులో నిత్యం వేధించడంతో భార్య అసహనానికి గురై దాడి చేసినట్లు భార్య తెలిపింది. ఈక్రమంలో జరిగిన పరస్పర దాడులలో భర్త గొల్లవిల్లి వెంకట్, కుమారుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

నరసరావుపేట ఎంపీగా గెలిచేదెవరు.?

image

నరసరావుపేట లోక్‌సభ స్థానంలో MP లావు కృష్ణదేవరాయలు, MLA అనిల్ మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. YCPకి రాజీనామా చేసి టీడీపీ నుంచి బరిలో దిగుతున్న లావు.. పల్నాడు అభివృద్ధి కోసమే గుంటూరు YCP ఎంపీ టికెట్ వద్దనుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు, వైసీపీ పాలనను టీడీపీ ప్రభుత్వంతో బేరీజు వేసుకొని తీర్పు ఇవ్వాలని అనిల్ అంటున్నారు. వీరిద్దరూ నాన్ లోకల్ కాగా, విజయం ఎవరిని వరిస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.