Andhra Pradesh

News March 28, 2024

నిడమర్రు: వాహన తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదు సీజ్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో బుధవారం పలు చోట్ల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఉంగుటూరు మండలం బువ్వనపల్లి చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ1.75 లక్షలు నగదు సీజ్‌ చేసినట్లు నిడమర్రు ఎస్సై ఆర్‌.శ్రీను చెప్పారు. బువ్వనపల్లి సత్యనారాయణపురంలో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో రూ.1.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

News March 28, 2024

రాజానగరంలో భారీ అగ్ని ప్రమాదం

image

మండలంలోని చక్రద్వారబంధం గ్రామంలో సుమ రిఫైనరీ పామాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఆయిల్ ముడిసరుకు బాయిలర్ శుభ్రం చేయడానికి మరమ్మతులు చేస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని యాజమాన్యం తెలిపారు.

News March 28, 2024

దర్శి టికెట్‌పై నీలినీడలు?

image

దర్శి టికెట్‌పై రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని అటు పార్టీలో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, రోజుకో కొత్త పేరు వినపడుతోంది. టీడీపీ నుంచి గోరంట్ల రవికుమార్, మాజీ MLA గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తోంది. బాచిన కృష్ణచైతన్య, మాగుంట రాఘవరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు జనసేన నుంచి గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నాడు.

News March 28, 2024

పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కోడ్ ఉల్లంఘన కేసు 

image

పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదయ్యింది. పట్టణంలోని నవిరికాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈనెల 25న కరపత్రాలను పంపిణీ చేసినట్లు ఫిర్యాదు అందిందని ఎన్నికల అధికారిని కే.హేమలత తెలిపారు. ఈ ఫిర్యాదుపై విచారణ అనంతరం టీడీపీ అభ్యర్థి విజయచంద్రతోపాటు మరో పదిమందిపై పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News March 28, 2024

అవనిగడ్డ ఒక్కటే మిగిలింది.!

image

కైకలూరు, విజయవాడ వెస్ట్ NDA అభ్యర్థులను నిన్న ప్రకటించారు. దీంతో ఉమ్మడి కృష్ణాలోని 16 సీట్లలో 15 మంది అభ్యర్థులెవరో తెలిసిపోయింది. జనసేనకు కేటాయించిన అవనిగడ్డ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. వంగవీటి రాధ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నా ఫైనల్ కాలేదు. మరోవైపు మండలి బుద్ధప్రసాద్ వర్గం TDPకే టికెట్ ఇవ్వాలని నిరసన తెలుపుతోంది. ఈ క్రమంలో అవనిగడ్డ టికెట్ ఎవరికిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

News March 28, 2024

పార్వతీపురం మన్యంలో గజరాజులతో బెంబేలు

image

ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం గవరంపేట, చింతలబెలగాం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపైకి రావడంతో వాహన చోదకులు భీతిల్లిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారిపై రెండుసార్లు ఏనుగుల గుంపు రావడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపైకి ఏనుగులు వచ్చిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వచ్చి వాటిని సమీప పంట పొలాల్లోకి తరలించారు.

News March 28, 2024

అనంత : ‘ నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ వేటు’

image

రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీకి చెందిన ఒప్పంద ఉద్యోగులు విజయకుమార్, సూర్యనారాయణరెడ్డి, తిరుపాల్ రెడ్డి, శింగనమల(M) వెస్ట్ నరసాపురానికి చెందిన క్షేత్ర సహాయకుడు అంజన్ రెడ్డి ఉన్నారు. వీరితో కలిపితే ఇప్పటి దాకా 36 మంది వాలంటీర్లు, ఐదుగురు రేషన్ డీలర్లు, 11 మంది ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు.

News March 28, 2024

విశాఖ: అక్రమంగా తాబేళ్ల రవాణా

image

నిషేధిత తాబేళ్లను రవాణా చేస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో నక్షత్రపు తాబేళ్లు రవాణా చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందడంతో బుధవారం విశాఖ రైల్వేస్టేషన్‌లో నిఘా పెట్టారు. ఇద్దరు అనుమానితులను తనిఖీల్లో 396 నక్షత్రపు తాబేళ్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పశ్చిమ బెంగాల్‌ నుంచి తమిళనాడుకు రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు.

News March 28, 2024

విశాఖ: సముద్రంలో డీజిల్ కొట్టేసే ముఠా అరెస్ట్ 

image

సముద్రంలోని నౌకల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యులు వీర్రాజు, బడే రాజు, సూరాడ రాములును అరెస్టు చేసినట్లు డీసీపీ-2 ఎం.సత్తిబాబు తెలిపారు. సముద్రంలో ఉన్న నౌకల నుంచి డీజిల్ దొంగలించి బోట్లు ద్వారా తీరానికి తీసుకువచ్చి వారు విక్రయిస్తున్నట్లు తెలిపారు. సుమారు 13 మంది నౌకల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వీరిలో ముగ్గురు పట్టుబడుగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు.

News March 28, 2024

విశాఖ: డీసీఐ కేసు ఏప్రిల్‌ 11కు వాయిదా

image

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కేసును హైకోర్టు ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది. అన్యాయంగా తొలగించారని తన కేసు తేలాకే కొత్త ఎండీ, సీఈఓ నియామకం నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ పాత ఎండీ జార్జి విక్టర్‌ కేసు వేశారు. ఆ మేరకు నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని డీసీఐ వాదించింది. ఈ కేసులో తీర్పును ఏప్రిల్‌ 11న వెలువరిస్తామని విచారణను హైకోర్టు వాయిదా వేసినట్టు డీసీఐ వర్గాలు తెలిపాయి.