Andhra Pradesh

News March 27, 2024

లైసెన్స్ కలిగిన ఆయుధాలను ప్రదర్శించకూడదు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారీ వెంట తీసుకువెళ్లడం ప్రదర్శించుట చేయరాదన్నారు. నిషేధాజ్ఞలు ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

News March 27, 2024

ఇంటి నుంచే ఓటు వేయవచ్చు: కలెక్టర్

image

85 ఏళ్లు పైబడిన వృద్ధులు, నడవలేని దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృత్తికా శుక్లా బుధవారం తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంపొందించే దిశగా ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. మొబైల్ వాహనం సాయంతో ఇంటి వద్దే వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయవచ్చన్నారు.

News March 27, 2024

బద్వేలు కూటమి అభ్యర్థిగా బొజ్జా రోషన్న

image

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకుడు రోషన్నను ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తూ తుది జాబితాను వెలువరించిన నేపథ్యంలో బద్వేలు అభ్యర్థిగా రోషన్నను ఎంపిక చేసింది. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి చేరారు.

News March 27, 2024

ఆదోని MLA అభ్యర్థిగా పీవీ పార్థసారథి

image

ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిపై జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పీవీ పార్థసారథిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఏపీ టీడీపీ ఇన్‌ఛార్జ్ కే. మీనాక్షినాయుడు ఈ సీటును ఆశించిన విషయం తెలిసిందే.

News March 27, 2024

విశాఖ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి

image

బీజేపీ కూటమిలో భాగంగా విశాఖ నార్త్‌ సీటుకి విష్ణుకుమార్ రాజు పేరును ప్రకటించింది. ఈయన 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి గెలుపొందగా, 2019లో ఓడిపోయారు. 2014లో 18,240 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియెజకవర్గంలో నమోదు అయిన అత్యధిక మెజారిటీ ఇదే కావడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, జనసేన , టీడీపీ కూటమిలో భాగంగా మరోసారి బరిలో నిలుస్తున్నారు.

News March 27, 2024

అనపర్తి MLA అభ్యర్థిగా శివరామకృష్ణం రాజు

image

ఎట్టకేలకు అనపర్తి MLA టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన ఆ పార్టీ నేత ములగపాటి శివరామకృష్ణం రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. టీడీపీ తొలి జాబితాలో అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. తర్వాత బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. సోము వీర్రాజు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు రాజుకే టికెట్ దక్కింది.

News March 27, 2024

సువిధ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే రాజకీయ నాయకులు తప్పకుండా సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పార్టీ అభ్యర్థులు సమావేశాలు మొదలైనవాటిని నిర్వహించడానికి 48గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముగియడానికి 48గంటల ముందు నిశ్శబ్ద కాలం తప్పక పాటించాలని, దీనినే ఎన్నికల ముందు నిశ్శబ్దం అని పిలుస్తారని అన్నారు.

News March 27, 2024

విజయవాడ వెస్ట్‌ అభ్యర్థిగా సుజనా చౌదరి

image

విజయవాడ వెస్ట్‌ టికెట్‌పై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. బుధవారం బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరికి టికెట్ ఖరారు చేశారు. దీంతో నియోజక వర్గంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News March 27, 2024

ఎచ్చెర్ల నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు

image

ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నడుకుదిటి ఈశ్వరరావును (ఎన్ఈఆర్) బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలెంకు చెందిన ఈయన తొలిసారిగా 2014లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తరువాత.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పట్ల ఆకర్షితుడైన ఎన్ఈఆర్ బీజేపీలో చేరారు. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

News March 27, 2024

కడప: భూపేశ్ రెడ్డికి షాక్

image

జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవగుడి ఆదినారాయణ రెడ్డికి టికెట్ లభించింది. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి టీడీపీలోకి చేరారు. 2019లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. భూపేశ్ టికెట్ ఆశించి భంగపడ్డాడు. వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.