Andhra Pradesh

News September 18, 2024

సీఎం చంద్రబాబుతో సమావేశం.. హాజరైన మంత్రి నిమ్మల

image

చెల్లించకుండా పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లుల విడుదలకు సంబంధించి మంగళవారం సీఎం చంద్ర‌బాబుతో మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్, నిమ్మ‌ల రామానాయుడు, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కలిసి చర్చించారు. చర్చల అనంతరం ద‌శ‌ల వారీగా నీరు చెట్టు బిల్లులను విడుద‌ల చేయాల‌ని ఆర్థిక శాఖ‌ను ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు.

News September 18, 2024

CM సహాయనిధికి YS సునీత రూ.10 లక్షల విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ మంత్రి దివంగత YS వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రూ.10ల‌క్ష‌ల విరాళాన్ని అందజేశారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌తో మంగళవారం చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

News September 18, 2024

‘ఛానల్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోండి’

image

గుంటూరు ఛానల్ ఆధునికరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధునికీకరణకు సంబంధించి ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

News September 18, 2024

అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు

image

అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

News September 18, 2024

25న మళ్లీ అల్బెండజోల్ మాత్రల పంపిణీ: కలెక్టర్

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తమీమ్‌ అన్సారియా తెలిపారు. జిల్లాలో ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారు 5,96,751 మంది ఉన్నారని చెప్పారు. అల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బందితో మంగళవారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. మంగళవారం మాత్రలు వేసుకోలేని వారు ఉంటే ఈనెల 25న మాప్‌-అప్‌ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

News September 18, 2024

శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు సంస్థ ఘరానా మోసం

image

శ్రీకాకుళం రైతు బజారు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ బాధితులను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థ తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చని ఖాతాదారులను నమ్మించింది. జిల్లాలో సుమారు 3 వేల మంది సభ్యులుగా చేర్చుకుంది. పలు మార్గాల రూపంలో డబ్బులు వసూలు చేసి, 4 నెలలుగా అనుమానం కలగకుండా సక్రమంగా చెల్లింపులు జరిపింది. సంస్థ కార్యకలాపాలు అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.

News September 18, 2024

ప.గో జిల్లాలో పొగాకు మళ్లీ ఆల్ టైం రికార్డ్ ధర

image

ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్‌ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.

News September 18, 2024

నెల్లూరు: చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి

image

సంగం మండలం పడమటి పాలెంలో మంగళవారం అప్పుల బాధ తట్టుకోలేక ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కానిస్టేబుల్ రమేశ్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.

News September 18, 2024

నేడు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

image

అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవిత, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

News September 18, 2024

గంగవరం: విద్యార్థినులతో HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్

image

గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను మంగళవారం విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం తెలిపారు. రామకృష్ణపై రహస్యంగా, సమగ్ర విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు.