Andhra Pradesh

News March 27, 2024

బార్లు, రెస్టారెంట్లపై కేసులు నమోదు చేయండి: ప్రకాశం ఎస్పీ

image

జిల్లాలో సమయపాలన పాటించని బార్, రెస్టారెంట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి అధికారులను అదేశించారు. కోడ్ అమల్లో ఉన్నా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయిస్తుండడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మార్కాపురం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రెహమాన్ స్థానిక బార్ నిర్వాహకులతో మంగళవారం సమావేశమయ్యారు. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు వారిని విక్రయించుకోవాలని సూచించారు.

News March 27, 2024

ప్రొద్దుటూరు: మహిళా వాలంటీర్ సూసైడ్

image

ప్రొద్దుటూరు పట్టణంలోని టీబి రోడ్డులోని తేజస్విని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మూడో సచివాలయం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న తేజస్వినికి తరచూ ఫిట్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనారోగ్య సమస్యలతోనే తేజస్విని మృతి చెందిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 27, 2024

ఏలూరు: మాగంటి బాబు పార్టీ మార్పు.. క్లారిటీ

image

తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నాయకులు మాగంటి బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత 24 గంటల నుండి సోషల్ మీడియాలో వస్తున్న తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవాలని, వాటిని నమ్మొద్దని చెప్పారు. వ్యక్తిగత పనులపై హైదరాబాదులో ఉన్న కారణంగా క్యాంప్ కార్యాలయంలో అందుబాటు లేనని చెప్పారు. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు లేదన్నారు.

News March 27, 2024

తూ.గో.: 31న ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక

image

ఉమ్మడి తూ.గో. జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు తెలిపారు. స్త్రీ, పురుషుల విభాగంలో జట్ల ఎంపిక ఉంటుందన్నారు. అమలాపురం జడ్పీ పాఠశాలలో ఆరోజు ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన వారు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలతో రావాలని ఆయన సూచించారు.

News March 27, 2024

చౌడేపల్లి: రామచంద్ర యాదవ్‌పై కేసు నమోదు

image

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఐదుగురు అనుచరులపై ఎన్నికల కోడు ఉల్లంఘన కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో పలమనేరు రోడ్డులో బస్టాండ్ ప్రాంతంలో సమావేశానికి అనుమతి తీసుకుని.. ప్రైవేటు బస్టాండ్‌లో సమావేశం నిర్వహించి కోడ్ ఉల్లంఘించారని ఆయన చెప్పారు. రోడ్డుపై బాణసంచా కాల్చడం, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం వంటి కారణాలతో కేసు నమోదు చేశామన్నారు.

News March 27, 2024

REWIND.. నెల్లూరులో ‘ఉదయించిన సూర్యుడు’

image

నెల్లూరు నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో జక్కా కోదండరామి రెడ్డి(జేకే రెడ్డి) సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగగా ఎన్నికల కమిషన్ ఉదయించే సూర్యుడు గుర్తు కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రచారాన్ని జేకే రెడ్డి సరికొత్త పుంతలు తొక్కించారు. అందరి మనస్సు చూరగొని తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్ రెడ్డిపై 14474 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

News March 27, 2024

కొల్లిపర: పురుగుమందు తాగిన దంపతులు.. భర్త మృతి

image

కొల్లిపర మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండలంలోని తూములూరుకు  చెందిన చంద్రశేఖర్ (45), నాగలక్ష్మీ (35) దంపతులు ఆర్థిక సమస్యలతో మంగళవారం పురుగుమందు తాగారు. చంద్రశేఖర్ మృతి చెందగా, నాగలక్ష్మి చికిత్స పొందుతోంది. వీరిది దుగ్గిరాల మండలం ఈమని. డ్రైవరుగా పనిచేసే చంద్రశేఖర్‌ గతేడాది ప్రమాదం బారిన పడి ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

 శ్రీ సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థులకు గాయాలు

image

బుక్కపట్నం మండల పరిధిలోని సిద్దరాంపురం గ్రామ సమీపన జరిగిన ఆటో ప్రమాదంలో సిద్దరాంపురం గ్రామానికి చెందిన విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం బుక్కపట్నంలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తిరిగి సిద్దరాంపురం వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

News March 27, 2024

కర్నూలు: 3 నుంచి ఏప్రిల్ నెల పింఛన్లు

image

ఏప్రిల్ నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3 రోజులు ఆలస్యం కానుందని డీఆర్డీఏ-వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ సలీమ్ బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 31 ఆదివారం నాటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, మరుసటి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉందని, 2న పింఛన్ల బడ్జెట్‌ను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుందని చెప్పారు. 3వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పెన్షనర్లు గమనించాలని కోరారు.

News March 27, 2024

తిరుపతి: TTDలో 78 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని డిగ్రీ/ ఓరియంటల్, జూనియర్ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికగా లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల గడువు బుధవారంతో ముగుస్తుంది. డిగ్రీ లెక్చరర్స్ -49, జూనియర్ లెక్చరర్స్-29 మొత్తం …78 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 27.