Andhra Pradesh

News March 27, 2024

సామర్లకోట: ఏప్రిల్ 1 నుంచి పలు రైళ్లు రద్దు

image

ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రైళ్లను పూర్తిగా, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో పట్టాల మరమ్మతుల కారణంగా విశాఖపట్నం- మచిలీపట్నం, గుంటూరు- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 4 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. రామవరప్పాడు- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.

News March 27, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు: ఎస్పీ

image

ఎన్నికల సమయంలో ప్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలపై నిఘా ఉంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మాధవ్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పోలీస్‌ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.

News March 27, 2024

విశాఖ: వాల్తేరు డివిజన్ ఆల్ టైమ్ రికార్డు

image

2003-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలో వాల్తేరు డివిజన్ ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించినట్లు డిఆర్ఎం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు 5 రోజుల ముందే రికార్డు సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది, అధికారులను డిఆర్ఎం సౌరబ్ ప్రసాద్ అభినందించారు. ఈ సంవత్సరంలో సుమారు 10 శాతం ఆర్థిక ఆదాయం సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 27, 2024

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఇలా

image

ప్రజాగళం పేరుతో మాజీ సీఎం, TDP అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కుప్పం నుండి బయలుదేరి 9:30 గంటలకు పలమనేరు చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. తదుపరి మధ్యాహ్నం 2:30 గంటలకు పుత్తూరుకి, సాయంత్రం 4:30 గంటలకు మదనపల్లె బెంగళూరు బస్ స్టాండు వద్దకు చేరుకుంటారు. విందులో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

News March 27, 2024

ఎచ్చెర్ల : పరీక్ష ఫీజు స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2,4 సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థుల పబ్లిక్ పరీక్షలకు ఫీజు స్వీకరణ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీలోగా ఫీజు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 15లోగా చెల్లించవచ్చని కోరారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామన్నారు.

News March 27, 2024

VZM: నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు సీఈవో కె.రాజ్ కుమార్ తెలిపారు. విజయనగరంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు. సభ్యులు అడిగిన సమాచారం సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

News March 27, 2024

విశాఖ: ఏప్రిల్ 1 నుంచి 24 గంటలు విమాన రాకపోకలు

image

విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 24 గంటలు విమాన రాకపోకలకు నేవీ అనుమతించింది. రీ సర్ఫేసింగ్ పనులు కారణంగా 2023, నవంబర్ 15 నుంచి రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకూ రన్ వే మూసి మూసి వేస్తూ పనులు చేపట్టారు. నిర్దేశిత గడువుకు ముందే నేవీ ముందుగానే పనులు పూర్తి చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటంకం తొలగింది.

News March 27, 2024

VZM: గుండె పోటుతో టీచర్ మృతి

image

విజయనగరం ఉడా కాలనీలో గుండెపోటుకు గురై ఉపాధ్యాయుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కే.వెంకటరమణ అనే ఫిజిక్స్ టీచర్ మంగళవారం విజయనగరం బాలికల పాఠశాలకు పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌కి వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుబుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

News March 27, 2024

కమలాపురం నియోజకవర్గంలో TDPకి షాక్

image

కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమలాపురం మండలంలోని పెద్దచెప్పలిలో మంగళవారం సాయంత్రం ఆయన తన అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.

News March 27, 2024

కృష్ణా: వైసీపీలో చేరిన జనసేన కీలక నేత

image

ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన కీలక నేత బత్తిన రాము మంగళవారం వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈయన బత్తిన ట్రాన్స్‌ఫోర్ట్ అధినేత. గతంలో ఈయన ప్రజారాజ్యం తరఫున గన్నవరం నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ‌చేసి ఓటమి చెందారు. నిన్న ఆయన కేశినేని నానితో సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు.