Andhra Pradesh

News March 26, 2024

వైపాలెం: గుండె పోటుతో గిరిజనుడు మృతి

image

యర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని గాంధీ నగర్ గిరిజన గూడేనికి చెందిన కుడుముల వీరన్న (33) గుండె పోటుతో మంగళవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరన్నకు గుండెల్లో నొప్పిగా ఉండడంతో ఐటీడీఏ అంబులెన్స్‌కు సమాచారం అందజేసి వీరన్నను యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు.

News March 26, 2024

కోడూరు: బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

image

రైల్వే కోడూరు మండలం మారావారిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు విద్యార్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ సాహిల్, జస్వంత్‌ను తిరుపతి హాస్పిటల్‌కి తరలించామని తెలిపారు. సెట్టిగుంట పంచాయతీ లక్ష్మీ గారి పల్లె ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వీరు కోడూరులో పదో తరగతి పరీక్ష రాసి తమ గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.

News March 26, 2024

వాలంటీర్లకు రూ.50వేలు వచ్చేలా చూస్తా: CBN

image

ఏపీని కాపాడాలన్న అజెండాతోనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో ఆయన సమావేశమయ్యారు. ‘ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. వాలంటీర్లు రూ.30 వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తా’ అని చంద్రబాబు తెలిపారు.

News March 26, 2024

హిందుపూరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా వెంకట రాముడు

image

తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకటరాముడును నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ కార్యదర్శి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News March 26, 2024

పెనుగంచిప్రోలులో దొంగ నోట్లు కలకలం

image

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో దొంగనోట్లు కలకలం రేపాయి. వ్యాపారులు హడావుడిలో ఉన్న సమయంలో ఈ నోట్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మార్చారన్నారు. గతేడాది కూడా తిరునాళ్ల సమయంలో ఆలయ లడ్డూ ప్రసాదాల కౌంటర్లలో దొంగనోట్లు వచ్చాయన్నారు. తాజాగా గ్రామంలోని తూర్పు బజారులో బడ్డీకొట్టులో రూ.200 నోట్లు చెల్లనివి రావటంతో వ్యాపారులు అవాక్కయ్యారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News March 26, 2024

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా మాజీ మంత్రి గుండ అప్ప‌ల..?

image

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగే విష‌య‌మై పునరాలోచ‌న చేస్తున్నామ‌ని మాజీమంత్రి గుండ అప్ప‌ల సూర్యనారాయ‌ణ తెలిపారు. ఈ మేర‌కు మంగళవారం ఆయన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల‌ చేశారు. సోమవారం సాయంత్రం టీడీపీ జిల్లా అధ్య‌క్షులు కూన ర‌వికుమార్ త‌మతో భేటీ అయ్యార‌ని, పార్టీ పునఃప‌రిశీల‌న అనంత‌రం నిర్ణ‌యం వెలువ‌డే దాకా వేచి ఉండాల‌ని సూచించార‌న్నారు. ఆ మేర‌కు తాము ఆలోచ‌న చేస్తున్నామన్నారు.

News March 26, 2024

ఇస్త్రీ పెట్టె పట్టిన మండిపల్లి

image

రాయచోటిలోని 22వ వార్డులో ఇంటింటి ప్రచారంలో టీడీపీ శాసనసభ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఓ షాప్ వద్ద ఇస్త్రీ చేస్తూ కనిపించాడు. అనంతరం వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం, టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

News March 26, 2024

పార్వతీపురం: ‘సువిధలో 48 గంటల ముందుగా దరఖాస్తు చేయాలి’

image

ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్‌లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు.

News March 26, 2024

మాడుగుల: తొలిసారిగా ఎమ్మెల్యే బరిలో అనురాధ

image

మాడుగుల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లే అనురాధను వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆమె తండ్రి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అనకాపల్లి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆమె తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇంటర్ వరకు చదివిన ఆమె మొదటిసారి 2021లో కె. కోటపాడు మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.

News March 26, 2024

మాచవరం పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి

image

విజయవాడ గుణదల విజయనగర్ కాలనీలో మంగళవారం ఉదయం ఓ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకుపోయేందుకు వచ్చానంటూ హల్ చల్ చేశాడు. స్పందించిన స్థానిక ప్రజలు అతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మాచవరం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.